Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India vs England: వరుణ్ చక్రవర్తి టీ20 సిరీస్ ఆడడం మళ్లీ డౌటే.. కారణం ఇదే!!

Varun Chakravarthy fails BCCIs Fitness Test, Doubt for T20Is against England

ముంబై: కోల్‌కతా నైట్ రైడర్స్ మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తికి ఏది కలిసి రావడం లేదు. గాయం కారణంగా ఆస్ట్రేలియా పర్యటన నుంచి వైదొలిగిన వరుణ్.. త్వరలో ఇంగ్లండ్‌తో జరగబోయే టీ20 సిరీస్‌లో పాల్గొనడం అనుమానాస్పదంగా మారింది. తాజాగా భారత క్రికెట్ మండలి (బీసీసీఐ) నిర్వహించిన ఫిట్‌నెస్ టెస్టులో వరుణ్ ఫెయిలైనట్లు క్రిక్‌బజ్‌ ఓ ప్రకటలో పేర్కొంది. దీంతో ఐదు టీ20ల సిరీస్‌ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో ఒక మార్పు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే బీసీసీఐ నుంచి మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

ఫిట్‌నెస్ టెస్టులో వరుణ్ ఫెయిల్

ఫిట్‌నెస్ టెస్టులో వరుణ్ ఫెయిల్

భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య మార్చి 12 నుంచి అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్ జరుగనుంది. ఈ సిరీస్ కోసం 19 మందితో కూడిన భారత్ జట్టుని ఇటీవల బీసీసీఐ సెలెక్టర్లు ప్రకటించారు. అందులో చోటు దక్కించుకున్న వరుణ్ చక్రవర్తి తాజాగా ఫిట్‌నెస్ టెస్టులో ఫెయిలైనట్లు తెలుస్తోంది. దాంతో అతడిపై వేటు పడే అవకాశం ఉంది. వరుణ్ ఇప్పటి వరకూ భారత్ తరఫున కనీసం ఒక్క మ్యాచ్‌ కూడా ఆడలేదు.

యో-యో ఫిట్‌నెస్ టెస్టు తప్పనిసరి

యో-యో ఫిట్‌నెస్ టెస్టు తప్పనిసరి

టీమిండియా క్రికెటర్ ఎవరైనా అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాలంటే బీసీసీఐ నిర్వహించే యో-యో ఫిట్‌నెస్ టెస్టు పాసవడం తప్పనిసరి అన్న విషయం తెలిసిందే. బీసీసీఐ కొత్త ఫిట్‌నెస్ రూల్ ప్రకారం భారత ఆటగాళ్లు 8.5 నిమిషాల్లో 2 కిలోమీటర్ల పరుగును పూర్తి చేయాలి లేదా యో-యో పరీక్షలో 17.1 స్కోరు చేయాలి. ప్లేయర్స్ 8.5 నిమిషాల్లో 2 కిలోమీటర్ల పరుగును పూర్తి చేయాలని బీసీసీఐ తాజాగా రూల్ పెట్టిన విషయం తెలిసిందే. యో-యో టెస్ట్ ద్వారానే గతంలో యువరాజ్ సింగ్, అంబటి రాయుడు కూడా జట్టులో చోటు కోల్పోయారు.

భుజం గాయంతో

భుజం గాయంతో

ఐపీఎల్ 2020 సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ తరఫున 13 మ్యాచ్‌లాడిన వరుణ్ చక్రవర్తి అద్భుతంగా రాణించి 17 వికెట్లు పడగొట్టాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 20 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. ప్రతి మ్యాచులో కూడా బాగా బౌలింగ్ చేశాడు. ఈ ప్రదర్శన కారణంగా ఆస్ట్రేలియాతో గత ఏడాది చివరలో జరిగిన టీ20 సిరీస్‌ కోసం బీసీసీఐ సెలెక్టర్లు ఎంపిక చేశారు. అయితే టూర్‌కి ముందే భుజం గాయంతో దూరమయ్యాడు. తాజాగా మరోసారి టీమ్‌లోకి ఎంపికై.. సిరీస్‌కి ముందే అతను జట్టు నుంచి వైదొలిగే సూచనలు కనిపిస్తున్నాయి.

టీ20 జట్టు

టీ20 జట్టు

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్, ఇషాన్ కిషన్, యుజ్వేంద్ర చహల్, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రాహుల్ తెవాటియా, టీ నటరాజన్, భువనేశ్వర్ కుమార్, దీపక్ చహర్, నవదీప్ సైనీ, శార్ధూల్ ఠాకూర్.

తన్మయ్‌, తిలక్‌ సెంచరీలు.. అయినా హైదరాబాద్‌కు నిరాశే! ఆంధ్ర అదరహో!

Story first published: Monday, March 1, 2021, 11:09 [IST]
Other articles published on Mar 1, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+