హైదరాబాద్: సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో ఆఖరి ఓవర్ వేసేటప్పుడు తన హార్ట్ బీట్ 200కు చేరిందని కోల్‌కతా నైట్‌రైడర్స్ మిస్టరీ స్సిన్నర్ వరుణ్ చక్రవర్తీ అన్నాడు. ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో గురువారం ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో కేకేఆర్ 5 పరుగులతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఆఖరి ఓవర్‌లో వరుణ్ చక్రవర్తీ 9 పరుగులను డిఫెండ్ చేసి విజయంలో కీలక పాత్ర పోషించాడు. చివరి ఓవర్‌లో అబ్దుల్ సమద్ వికెట్ తీయడంతో పాటు మూడు పరుగులే ఇచ్చి మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బిగ్గర్ బౌండరీ వైపు ఆడేలా బౌలింగ్ చేసి ఫలితం రాబట్టానని వరుణ్ చక్రవర్తీ వెల్లడించాడు. 'చివరి ఓవర్ వేసేటప్పుడు నా హార్ట్ బీట్ 200 ధాటింది. కానీ నేను లాంగర్ బౌండరీ వైపు ఆడేలా బౌలింగ్ చేయాలనుకున్నా. డ్యూతో బంతి జారుతున్నా.. లాంగర్ బౌండరీవైపు వేస్తేనే ఫలితం దక్కుతుందని భావించా. తొలి ఓవర్‌లో నేను 12 పరుగులిచ్చా. మార్క్‌రమ్ రెండు బౌండరీలు బాదాడు. గతేడాది నేను గంటకు 85 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేశాను. బౌలింగ్‌లో వైవిధ్యం కోసం చాలా ప్రయత్నించాను. చివరకు నేను నా బౌలింగ్ తీరును మార్చుకోవాలని గ్రహించి దానిపై వర్క్ చేశాను'అని వరుణ్ చక్రవర్తీ చెప్పుకొచ్చాడు.

ఈ మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు వేసిన వరుణ్ చక్రవర్తీ 20 పరుగులు మాత్రమే ఇచ్చి ఓ వికెట్ తీసాడు. తొలి ఓవర్‌లో 12 పరుగులు ఇచ్చిన వరుణ్.. రెండో ఓవర్‌లో నాలుగు, మూడో ఓవర్‌లో ఐదు, చివరి ఓవర్‌లో మూడు పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఇందులో 4 పరుగులు బైస్ రూపంలోనే వచ్చాయి.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 171 పరుగులు చేసింది. కెప్టెన్ నితీశ్ రాణా(31 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 42), రింకూ సింగ్(35 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 46) రాణించారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో నటరాజన్, మార్కో జాన్సెన్ రెండేసి వికెట్లు తీయగా.. భువనేశ్వర్ కుమార్, కార్తీక్ త్యాగీ, ఎయిడెన్ మార్క్‌రమ్, మయాంక్ మార్కండే తలో వికెట్ తీసారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 166 పరుగులే చేసి ఓటమిపాలైంది. కెప్టెన్ ఎయిడెన్ మార్క్‌రమ్(40 బంతుల్లో 4 ఫోర్లతో 41), హెన్రీచ్ క్లాసెన్(20 బంతుల్లో ఫోర్, 3 సిక్స్‌లతో 36) రాణించినా ఫలితం లేకపోయింది. కేకేఆర్ బౌలర్లలో వైభవ్ అరోరా, శార్దూల్ ఠాకూర్ రెండేసి వికెట్లు తీయగా.. హర్షిత్ రాణా, ఆండ్రీ రస్సెల్, అనుకుల్ రాయ్, వరుణ్ చక్రవర్తీ తలో వికెట్ పడగొట్టారు. ఆఖరి ఓవర్ వేసిన వరుణ్ చక్రవర్తీ మూడు పరుగులు మాత్రమే ఇచ్చి కేకేఆర్‌ను గెలిపించాడు.