For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs NAM: ఆ ఒక్కడే ఓడించాడు: నమీబియా కెప్టెన్

Gerhard Erasmus: టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తీ అసాధారణ బౌలింగ్‌తో తమ ఓటమిని శాసించాడని నమీబియా కెప్టెన్ గెర్హార్డ్ ఎరాస్మస్ అన్నాడు. చిన్న గ్రౌండ్‌లో డ్యూ పరిస్థితుల్లో ధాటిగా ఆడాలనుకున్న తమ బ్యాటింగ్ ప్రణాళికలను ఆరంభంలోనే దెబ్బతీసాడని చెప్పాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా న్యూఢిల్లీ వేదికగా గురువారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన టీమిండియా 93 పరుగుల తేడాతో నమీబియాను చిత్తు చేసింది.

ఈ మ్యాచ్‌లో రెండు ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసిన వరుణ్ చక్రవర్తీ(3/7) మూడు వికెట్లతో నమీబియా నడ్డి విరిచాడు. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన నమీబియా కెప్టెన్ ఎరాస్మస్.. వరుణ్ చక్రవర్తీ అద్భుత బౌలింగ్‌తో తమ లక్ష్య ఛేదనను దెబ్బతీసిందన్నాడు. 'ఇది చాలా చిన్న గ్రౌండ్. రెండో ఇన్నింగ్స్‌లో డ్యూ ప్రభావంతో స్పిన్నర్లకు బౌలింగ్ చేయడం కష్టమవుతుందని భావించాను. 26 ఓవర్ల తర్వాత మాకు గెలిచే అవకాశాలు ఉంటాయని ఆశించాను. కానీ దురదృష్టవశాత్తు వరుణ్ చక్రవర్తీ తన రెండో ఓవర్ల స్పెల్‌తో మా పతనాన్ని శాసించాడు.

Varun Broke the Back of Our Chase Gerhard Erasmus on Namibia s Loss to India in T20 WC 2026
Photo Credit: twitter (X)

మా నడ్డి విరిచాడు..

స్మిత్ పవర్ ప్లే తర్వాత తిరిగి వచ్చి డెత్ ఓవర్లలో బౌలింగ్ చేసిన విధానం అద్భుతం. ఇలాంటి నైపుణ్యం కలిగిన ఆటగాళ్లు ఉండాలని మేం కోరుకుంటున్నాం. పెద్ద జట్లతో పోటీ పడాలంటే మా ఇన్నింగ్స్ ఆరంభం, ముగింపు బాగుండాలి. మా బ్యాటింగ్ ప్రమాణాలను ఆ దిశగా పెంచుకోవాలి.

చెన్నైలోని స్లో పిచ్ మాకు బాగా సరిపోతుందని నేను భావిస్తున్నా. ఇంకా మేం చూపించాల్సింది చాలా ఉంది. మేం ఇంకా 100 శాతం సామర్థ్యంతో ఆడటం లేదు. ఈ పర్యటనలో అత్యుత్తమ ప్రదర్శన చేయాలని భావిస్తున్నాం. మా బ్యాటింగ్‌లో చాలా పవర్ ఉంది. కానీ ఆ పవర్‌ను చూపించడానికి అవసరమైన పునాది వేయడానికి సరిపడా బంతులను మేం ఆడలేకపోతున్నాం. పిచ్‌లో ఎలాంటి మార్పు రాలేదని నేను భావిస్తున్నా. భారత బౌలర్లు నాణ్యమైన బంతులు వేశారు. అది మిడిల్ ఓవర్లలో స్పష్టంగా కనిపించింది. ముఖ్యంగా 6 నుంచి 10 ఓవర్ల మధ్య భారత బౌలర్లు మా నడ్డిని విడిచారు.'అని ఎరాస్మస్ చెప్పుకొచ్చాడు.

భారత్ ఘన విజయం..

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 209 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్(24 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్‌లతో 61), హార్దిక్ పాండ్యా(27 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 52) హాఫ్ సెంచరీలతో రాణించారు. నమీబియా కెప్టెన్ ఎరాస్మస్(4/20) నాలుగు వికెట్లు తీయగా.. బెన్ షికోంగో, జేజే స్మిత్, బెర్నార్డ్ స్కాల్ట్జ్ తలో వికెట్ తీసారు.

అనంతరం నమీబియా 18.2 ఓవర్లలో 116 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్లు స్టీన్ కాంప్(29), జాన్ ఫ్రిలింక్(22) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తీ(3/7) మూడు వికెట్లు తీయగా.. హార్దిక్ పాండ్యా(2/21), అక్షర్ పటేల్(2/20) రెండేసి వికెట్లు పడగొట్టారు. భారత స్పిన్నర్ వరుణ్ చక్రవర్తీ ధాటికి ఐర్లాండ్ బ్యాటర్లు తేలిపోయారు.

Story first published: Friday, February 13, 2026, 7:05 [IST]
Other articles published on Feb 13, 2026
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+