నేను చెప్పిన ఆ ఒక్క మాటతోనే వికెట్లు తీసారు: SRH బౌలింగ్ కోచ్
సన్‌రైజర్స్ హైదరాబాద్ యువ పేసర్లు ప్రఫుల్ హింగే, సాకిబ్ హుస్సేన్‌లపై ఆ జట్టు బౌలింగ్ కోచ్ వరుణ్ ఆరోన్ ప్రశంసల జల్లు కురిపించాడు. ఈ కుర్రాళ్లు వచ్చిన నేపథ్యం చూస్తే.. వారు సాధించినది చాలా గొప్ప విషయని కొనియాడాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో సోమవారం ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 57 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే.
ఈ మ్యాచ్ ద్వారా ఐపీఎల్‌లోకి అరంగేట్రం చేసిన సన్‌రైజర్స్ అనామక పేసర్లు ప్రఫుల్ హింగే(4/34), సాకిబ్ హుస్సేన్(4/24) నాలుగేసి వికెట్లతో రాజస్థాన్ రాయల్స్ పతనాన్ని శాసించారు. ముఖ్యంగా ప్రఫుల్ హింగే ఇన్నింగ్స్ ఫస్ట్ ఓవర్‌లోనే మూడు వికెట్లు తీసి సరికొత్త చరిత్రను లిఖించాడు. అరంగేట్రంలోనే తొలి ఓవర్‌లో మూడు వికెట్లు తీసిన బౌలర్‌గా ప్రఫుల్ హింగే చరిత్రకెక్కాడు. మరో అరంగేట్ర పేసర్ సాకిబ్ హుస్సేన్ సైతం నాలుగు వికెట్లతో సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.

కోచోత్సాహం..
ఈ ఇద్దరూ వికెట్లు తీసిన ప్రతీసారి డగౌట్‌లో ఉన్న వరుణ్ ఆరోన్ ఎగిరి గంతేసారు. ఈ ఇద్దరి ప్రతిభను గుర్తించి సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులోకి తీసుకొచ్చిందే ఆయనే. దాంతో కోచోత్సాహంతో ఉప్పొంగిపోయాడు. ఈ మ్యాచ్ అనంతరం మీడియా సమావేశంలో పాల్గొన్న వరుణ్ ఆరోణ్ ఈ కుర్రాళ్లపై ప్రశంసల జల్లు కురిపించాడు. అంతేకాకుండా ఈ యువ పేసర్లతో తాను రచించిన గేమ్ ప్లాన్ గురించి వివరించాడు. ఫలితం గురించి ఆలోచించకుండా అరంగేట్ర మ్యాచ్‌ను ఆస్వాదించాలని కుర్రాళ్లకు చెప్పానని, ఆ మాట బాగా పనిచేసిందని వరుణ్ ఆరోన్ వెల్లడించాడు.
ఆటను ఆస్వాదించమని చెప్పా..
'మ్యాచ్‌కు ముందు నేను వారికి చెప్పింది ఒకే ఒక్క మాట. 'ఫలితం గురించి ఆలోచించకుండా మీ తొలి మ్యాచ్‌ను ఆస్వాదించండి.' ఏ ఫార్మాట్‌లోనైనా మీరు ఒక్కసారే అరంగేట్రం చేస్తారు. అందుకే ఈ ఆటను పూర్తిగా ఆస్వాదించండి. వారు వచ్చిన నేపథ్యం చూస్తే.. ఈ రోజు వారు సాధించినది చాలా గొప్ప విషయం. మ్యాచ్‌కు ముందు నేను వారిని కోరినది ఒక్కటే.. ఒకవేళ మీరు ఈ ఆటను ఆస్వాదించకపోతే నాకు చాలా కోపం వస్తుందని చెప్పాను. వారు నిజంగానే ఆటను ఆస్వాదించారు. మారి బౌలింగ్‌ను మేం కూడా ఎంజాయ్ చేశాం.
తొలి బంతికే ఔట్ చేస్తానన్నాడు..
వైభవ్ సూర్యవంశీని తొలి బంతికే ఔట్ చేస్తానని ప్రఫుల్ నాతో అన్నాడు. గతంలో ఔట్ చేశానని కూడా చెప్పాడు. అన్నట్లుగానే వైభవ్ సూర్యవంశీని గోల్డెన్ డకౌట్ చేసి మాట నిలబెట్టుకున్నాడు. అయితే అతన్ని ఔట్ చేసేందుకు మేం ప్లాన్ చేశాం. ప్రఫుల్.. రౌండ్ ది వికెట్ బౌలింగ్ చేయాలనుకున్నాడు. కానీ నేను 'ఓవర్ ది వికెట్' బౌలింగ్ చేయమని సూచించాను. కచ్చితంగా వికెట్ తీస్తావని చెప్పాను. చివరకు అనుకున్నదే అయ్యింది. వైభవ్ వికెట్ విషయంలో ప్రఫుల్ చాలా నమ్మకంతో ఉన్నాడు. ఆ నమ్మకమే అతనికి విజయాన్ని అందించింది.' అని వరుణ్ ఆరోన్ చెప్పుకొచ్చాడు.
సన్‌రైజర్స్ అనామక బౌలర్ల ధాటికి 217 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ 19 ఓవర్లలో 159 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ ఇద్దరి యువ పేసర్ల సంచలన ప్రదర్శనతో బలహీనంగా ఉన్న సన్‌రైజర్స్ బౌలింగ్ లైనప్ బలంగా కనిపిస్తోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications