Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

U19 T20 WC: చరిత్ర సృష్టించిన వైష్ణవి శర్మ.. 17 బంతుల్లోనే భారత్ విజయం! (వీడియో)

టీమిండియా యువ ప్లేయర్ వైష్ణవి శర్మ చరిత్ర సృష్టించింది. మహిళల అండర్ 19 ప్రపంచకప్ చరిత్రలోనే హ్యాట్రిక్ సాధించిన తొలి భారత బౌలర్ రికార్డ్ సాధించింది. మలేషియా వేదికగా జరుగుతున్న ఐసీసీ మహిళల అండర్ 19 టీ20 ప్రపంచకప్ 2025లో వైష్ణవి శర్మ ఈ ఫీట్ సాధించింది.

ఆతిథ్య మలేషియా జట్టుతో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో వైష్ణవి శర్మ(5/5) సంచలన బౌలింగ్‌తో భారత విజయంలో కీలక పాత్ర పోషించింది. వైష్ణవి శర్మ ధాటికి ఈ మ్యాచ్‌ను భారత్ 17 బంతుల్లోనే విజయం సాధించింది.

Vaishnavi Sharma creates history becomes the first Indian bowler to take the Hat-trick in Women s U-19 WC

మలేషియా బ్యాటర్లు నుర్ ఎయిన్ బింటి రోస్లన్(3), నుర్ ఇస్మా డానియల్(0), సిటి నజ్వా(0) వైష్ణవి శర్మ వేసిన 13వ ఓవర్‌లో వరుస బంతుల్లో పెవిలియన్ చేరారు. ఈ ఓవర్ రెండు, మూడు బంతులకు బింటి రోస్లన్(3), ఇస్మా డానియల్(0) ఎల్బీగా వెనుదిరిగారు. నాలుగో బంతికి సిటి నజ్వా(0)ను వైష్ణవి శర్మ క్లీన్ బౌల్డ్ చేసింది.

దాంతో ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన మలేషియా 14.3 ఓవర్లలో 31 పరుగులకు కుప్పకూలింది. వైష్ణవి శర్మ(5/5)తో పాటు ఆయుషి శుక్లా(3/8) మూడు వికెట్లతో రాణించగా.. జోషితా(1/5) ఒక వికెట్ దక్కింది. అనంతరం భారత్ 17 బంతుల్లో వికెట్ నష్టపోకుండా 32 పరుగులు చేసి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఓపెనర్, తెలుగు తేజం గొంగడి త్రిష(12 బంతుల్లో 5 ఫోర్లతో 27 నాటౌట్) విధ్వంసకర బ్యాటింగ్‌తో మ్యాచ్‌ను ముగించింది.

మధ్యప్రదేశ్‌కు చెందిన వైష్ణవి శర్మ.. లెఫ్టార్మ్ స్పిన్నర్. ఈ టోర్నీలో ఈ మ్యాచ్‌లోనే ఆమెకు అవకాశం ఇవ్వగా సంచలన బౌలింగ్‌తో ఆకట్టుకుంది. ప్రస్తుతం వైష్ణవి శర్మ హ్యాట్రిక్ వికెట్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.'

Story first published: Tuesday, January 21, 2025, 14:46 [IST]
Other articles published on Jan 21, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+