వైభవ్ సూర్యవంశీ భారీ సిక్సర్.. స్టేడియం బయట పడ్డ బంతి!(వీడియో)
టీమిండియా టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ ఆస్ట్రేలియా గడ్డపై దుమ్మురేపుతున్నాడు. యూత్ వన్డే సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా-ఏతో జరుగుతున్న సిరీస్‌లో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగాడు. తొలి మ్యాచ్‌లో 22 బంతుల్లో 38 పరుగులు చేసిన సూర్యవంశీ.. రెండో వన్డేల్లో 68 బంతుల్లో 70 పరుగులు చేశాడు.
బ్రిస్బేన్ వేదికగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో 6 సిక్స్‌లు బాదాడు. ఇందులో ఒక సిక్స్ అయితే స్టేడియం బయట పడింది. జాన్ జేమ్స్ వేసిన షార్ట్ బాల్‌ను బ్యాక్‌వార్డ్ స్క్వేర్ లెగ్ దిశగా స్టేడియం బయటకు పంపాడు. ప్రస్తుతం ఈ సిక్స్‌కు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

అతను ఇదే జోరు కొనసాగిస్తే అతి త్వరలోనే టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. తాజా ఇన్నింగ్స్‌తో వైభవ్ సూర్యవంశీ.. ఉన్ముక్త్ చంద్ రికార్డ్‌ను అధిగమించాడు. యూత్ వన్డే క్రికెట్‌లో అత్యధిక సిక్స్‌లు బాదిన క్రికెటర్‌గా నిలిచాడు. ఉన్ముక్త్ చంద్ 38 సిక్స్‌లు బాదగా.. సూర్యవంశీ 39 సిక్స్‌లతో అతన్ని అధిగమించాడు. ఇంగ్లండ్ పర్యటనలోనూ వైభవ్ సూర్యవంశీ సత్తా చాటాడు. ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో 78 బంతుల్లో 143 పరుగులు చేశాడు. అతను ఆడే విధానం, సిక్స్‌లు కొట్టే తీరు యువరాజ్ సింగ్‌ను తలపిస్తుందని క్రికెట్ విశ్లేషకులు కామెంట్ చేస్తున్నారు.
Vaibhav Suryavanshi 70 Runs For 68 Balls 5 Four and 6 Sixes
— Sahil Singhadiya (@SahilSinghadiya) September 24, 2025
What a performance 🔥 pic.twitter.com/lMRHCB6zLp
వైభవ్ సూర్యవంశీ(68 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్స్‌లతో 70) విధ్వంసకర హాఫ్ సెంచరీతో ఈ మ్యాచ్‌లో భారత్ అండర్ 19 జట్టు 300 పరుగుల భారీ స్కోర్ చేసింది. కెప్టెన్ ఆయుష్ మాత్రే(0) విఫలమైనా.. విహాన్ మల్హోత్ర(74 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 70), అభిజ్ఞాన్ కుందు(64 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 71) రాణించారు. ఆస్ట్రేలియా అండర్ 19 బౌలర్లలో విల్ బైరమ్ మూడు వికెట్లు తీయగా.. యశ్ దేశ్‌ముఖ్ రెండు వికెట్లు పడగొట్టాడు. బార్టన్, స్కిల్లర్, జాన్ జేమ్స్, ఆర్యన్ శర్మ తలో వికెట్ తీసారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications