Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టీమిండియాలోకి వైభవ్ సూర్యవంశీ.. లైన్ క్లియర్!

టీమిండియా టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ అరంగేట్రానికి మార్గం సుగుమమైంది. అంతర్జాతీయ క్రికెట్ ఆడాలంటే కావాల్సిన కనీస 15 సంవత్సరాల వయసులోకి ఈ బిహార్ కుర్రాడు అడుగుపెట్టాడు. శుక్రవారం(మార్చి 27)తో వైభవ్ సూర్యవంశీ 15వ ఏట అడుగుపెట్టాడు.

14 ఏళ్ల వయసులోనే ప్రొఫెషనల్ క్రికెట్‌లోకి అడుగుపెట్టి సంచలనాలు సృష్టించిన ఈ బిహార్ కుర్రాడు.. ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్‌లో చెలరేగేందుకు సిద్దమయ్యాడు. 15వ జన్మదినం జరుపుకుంటున్న వైభవ్ సూర్యవంశీకి సోషల్ మీడియా వేదికగా విషెస్ వెల్లువెత్తుతున్నాయి. తన ఐపీఎల్ ఫ్రాంచైజీ రాజస్థాన్ రాయల్స్ తమదైన శైలిలో వైభవ్ సూర్యవంశీకి బర్త్‌డే విషెస్ తెలియజేసింది.

ఇది నీ రోజు రా.. బుడ్డోడా

'బ్యాట్ పట్టిన ఒక కుర్రాడు.. తన కలను నిజం చేసుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగి ఈ స్థాయికి చేరుకున్నాడు. వైభవ్ సూర్యవంశీ, ఈ రోజు నీది!'అని పోస్ట్ చేసింది. డ్రెస్సింగ్ రూమ్‌లో వైభవ్ సూర్యవంశీ బర్త్‌డేను ఘనంగా సెలెబ్రేట్ చేశారు. కేక్ కట్ చేసిన అనంతరం వైభవ్.. సీనియర్ ఆటగాళ్లకు దొరకకుండా పారిపోయాడు. కేకు రుద్దుతారనే భయంతో వారికి దూరంగా పరుగెత్తాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. వైభవ్ సూర్యవంశీకి పలువురు క్రికెటర్లు కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

Vaibhav Suryavanshi Turns 15 Youngest IPL Star Officially Eligible for Indian Team Selection

గతేడాది రాజస్థాన్ రాయల్స్ తరఫున ఐపీఎల్‌లోకి అరంగేట్ర చేసిన వైభవ్ సూర్యవంశీ.. తాను ఎదుర్కొన్న తొలి బంతినే సిక్సర్ తరలించాడు. ఆ తర్వాత గుజరాత్ టైటాన్స్‌తో 35 బంతుల్లోనే సెంచరీ బాది.. 14 ఏళ్ల వయసులోనే టీ20 శతకం బాదిన తొలి ప్లేయర్‌గా నిలిచాడు. అండర్ 19 ప్రపంచకప్ 2026లోనూ మెరుగైన ప్రదర్శనతో భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా ఇంగ్లండ్‌తో ఫైనల్లో (175) విధ్వంసకర శతకంతో చెలరేగాడు.

ఐపీఎల్‌లో చెలరేగితే..

భారత క్రికెట్ ముఖచిత్రంగా ఎదుగుతున్న వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టే సమయం కూడా ఆసన్నమైందని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. ఐపీఎల్ 2026 సీజన్‌లో ఈ బిహార్ కుర్రాడు చెలరేగితే.. టీమిండియా టీ20 టీమ్‌లోకి ఎంట్రీ ఇస్తాడని జోస్యం చెబుతున్నారు. అన్నీ అన్నుకున్నట్లు జరిగితే ఈ ఏడాదే వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టే అవకాశం ఉందని కామెంట్ చేస్తున్నారు.

ఐసీసీ రూల్స్ ప్రకారం అంతర్జాతీయ క్రికెట్ ఆడేందుకు కనీస వయసు 15 ఏళ్లు. అదే జరిగితే భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన అతి పిన్న వయస్కుడిగా వైభవ్ సూర్యవంశీ నిలుస్తాడు. సచిన్ టెండూల్కర్ రికార్డును అధిగమిస్తాడు. 1989లో పాకిస్థాన్‌తో టెస్ట్ మ్యాచ్‌తో సచిన్.. 16 ఏళ్ల 205 రోజుల వయసులో అరంగేట్రం చేశాడు.

వైభవ్ కెరీర్ హైలైట్స్..

  • 12 ఏళ్లకే రంజీ ట్రోఫీలో అరంగేట్రం

  • విజయ్ హజారే ట్రోఫీలో 36 బంతుల్లో సెంచరీ, 59 బంతుల్లో 150 పరుగులతో ఏబీ డివిలియర్స్ రికార్డు బ్రేక్

  • 14 ఏళ్ల 23 రోజుల వయస్సులోనే ఐపీఎల్‌లో అరంగేట్రం

  • 14 ఏళ్ల 32 రోజులకే ఐపీఎల్ సెంచరీ

  • ఒకే ఇన్నింగ్స్‌లో 11 సిక్సర్లు కొట్టి, భారత్ తరఫున ఈ ఫీట్ సాధించిన రెండో ప్లేయర్.
Story first published: Friday, March 27, 2026, 10:58 [IST]
Other articles published on Mar 27, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+