Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Vaibhav Suryavanshi: చరిత్ర సృష్టించిన బుడ్డోడు.. 36 బంతుల్లోనే సెంచరీ!

టీమిండియా టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ చరిత్ర సృష్టించాడు. ప్రతిష్టాత్మక దేశవాళీ వన్డే టోర్నీ విజయ్‌ హజారే ట్రోఫీలో తొలి మ్యాచ్‌లోనే ఈ 14 ఏళ్ల కుర్రాడు భారీ శతకంతో చెలరేగాడు. ఈ టోర్నీలో బిహార్ తరఫున బరిలోకి దిగిన వైభవ్ సూర్యవంశీ.. అరుణాచల్ ప్రదేశ్‌తో రాంచీ వేదికగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో 36 బంతుల్లోనే సెంచరీ మార్క్ అందుకున్నాడు.

తద్వారా విజయ్ హజారే ట్రోఫీలో సెంచరీ బాదిన అతి పిన్న వయస్కుడిగా వైభవ్ సూర్యవంశీ నిలిచాడు. అంతేకాకుండా లిస్ట్-ఏ క్రికెట్‌లోనే సెంచరీ బాదిన అతి పిన్న వయస్కుడిగా రికార్డ్ అందుకున్నాడు. లిస్ట్-ఏలో ఫాస్టెస్ట్ సెంచరీ బాదిన మూడో బ్యాటర్‌గా నిలిచిన సూర్యవంశీ.. రెండో భారత బ్యాటర్‌గా రికార్డ్ అందుకున్నాడు.

Vaibhav Suryavanshi Smashes 36-Ball Century Second-Fastest in Vijay Hazare Trophy History

ఈ జాబితాలో జేక్ ఫ్రేజర్ మెక్‌గర్క్ 29 బంతుల్లో సెంచరీ బాది అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఏబీ డివిలియర్స్(31), అన్‌మోల్ ప్రీత్ సింగ్(35).. వైభవ్ సూర్యవంశీ(36), కోరే అండర్సన్(36), గ్రహమ్ రోజ్(36) తర్వాతి స్థానంలో ఉన్నారు. అన్‌మోల్ ప్రీత్ సింగ్ 35 బంతుల్లో సెంచరీ బాది లిస్ట్-ఏ క్రికెట్‌లో వేగవంతమైన సెంచరీ బాదిన తొలి భారత ఆటగాడిగా నిలిచాడు. గతేడాది అరుణాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో అన్‌మోల్ ప్రీత్ సింగ్ ఈ ఫీట్ సాధించడం గమనార్హం.

అండర్ 19 ఆసియా కప్ 2025 ఫైనల్లో విఫలమైన వైభవ్ సూర్యవంశీ.. ఆ ఓటమిని అక్కడే మర్చిపోయి ఫ్రెష్‌గా బరిలోకి దిగి చెలరేగాడు. విజయ్ హజారే ట్రోఫీ తొలి మ్యాచ్‌లోనే విధ్వంసకర బ్యాటింగ్‌తో సత్తా చాటాడు. తృటిలో ద్విశతకాన్ని చేజార్చుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన బిహార్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 574 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది.

వైభవ్ సూర్యవంశీ(84 బంతుల్లో 16 ఫోర్లు, 15 సిక్స్‌లతో 190), ఆయుష్ లోహరుక(56 బంతుల్లో 11 ఫోర్లు, 8 సిక్స్‌లతో 116), సకిబుల్‌గని(40 బంతుల్లో 10 ఫోర్లు, 12 సిక్స్‌లతో 128 నాటౌట్) భారీ శతకాలతో చెలరేగారు. పీయూష్ సింగ్(66 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 77) హాఫ్ సెంచరీతో రాణించాడు.

Story first published: Wednesday, December 24, 2025, 10:23 [IST]
Other articles published on Dec 24, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+