Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Vaibhav Suryavanshi సిక్సర్ల మోత!(వీడియో)

రాజస్థాన్ రాయల్స్ సిక్సర పిడుగు వైభవ్ సూర్యవంశీ తన జోరును కొనసాగిస్తున్నాడు. ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ఉన్న వైభవ్ సూర్యవంశీ.. భారత అండర్ 19 టీమ్‌తో కలిసి ఇంగ్లండ్ పర్యటనకు సిద్దమవుతున్నాడు. శనివారం జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ సిక్సర్ల మోత మోగించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

భారత అండర్ 19 జట్టు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. ఇంగ్లండ్ అండర్ 19తో కలిసి మూడు ఫార్మాట్ల సిరీస్ ఆడనుంది. ఈ క్రమంలోనే బీసీసీఐ.. అండర్ 19 టీమ్‌కు ఎన్‌సీఏలో ప్రాక్టీస్ క్యాంప్ ఏర్పాటు చేసింది. ప్రాక్టీస్ మ్యాచ్‌లో సూర్యవంశీ తనకే సాధ్యమైన షాట్స్ ఆడాడు. వినూత్న షాట్స్‌తో పరుగులు రాబట్టాడు.

Vaibhav Suryavanshi seen smashing powerful sixes at U19 NCA Camp ahead of England tour Video

ఐపీఎల్ 2025 సీజన్‌లో వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రదర్శన కనబర్చిన విషయం తెలిసిందే. 14 ఏళ్ల వయసులోనే ఐపీఎల్‌లోకి అరంగేట్రం చేయడమే కాకుండా ఎదుర్కొన్న తొలి బంతినే సిక్సర్‌గా మలిచాడు. ఆ తర్వాత 35 బంతుల్లో సెంచరీ నమోదు చేసి ఈ ఘనతను అందుకున్న అత్యంత పిన్నవయస్కుడిగా నిలిచాడు. వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ ఈ సీజన్‌కే హైలైట్‌గా నిలిచింది.

ఆలస్యంగా అవకాశం అందుకున్న వైభవ్ 7 మ్యా‌చ్‌ల్లో 36 యావరేజ్.. 206.55 స్ట్రైక్‌రేట్‌తో 252 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీతో పాటు హాఫ్ సెంచరీ ఉంది. ఈ ప్రదర్శనతో వైభవ్.. సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్‌గా నిలిచాడు. ఈ అవార్డ్ కింద అతనికి రూ. 10 లక్షల క్యాష్ రివార్డ్ దక్కింది. అలాగే టాటా కర్వ్ కారు కూడా బహుమతిగా లభించింది. అయితే, అతని వయస్సు 14 ఏళ్లు మాత్రమే కావడంతో, కారు నడపడానికి మరో నాలుగు ఏళ్లు ఆగాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఆర్థికంగా ఎన్నో కష్టాలను ఎదుర్కొన్న వైభవ్‌కు ఈ సీజన్‌తో భారీ క్యాష్ అవార్డ్ దక్కింది. వేలంలో కోటి 10 లక్షల రూపాయలకు రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేయగా.. అద్భుత ప్రద్శనతో అంతర్జాతీయంగా గుర్తింపు దక్కింది. అయితే వైభవ్ రాణించినా.. రాజస్థాన్ రాయల్స్ లీగ్ దశలోనే ఇంటిదారి పట్టింది. 14 మ్యాచ్‌ల్లో నాలుగు మాత్రమే గెలిచి పాయింట్స్ టేబుల్‌లో 9వ స్థానంలో నిలిచింది.

Story first published: Saturday, June 7, 2025, 22:18 [IST]
Other articles published on Jun 7, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+