Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs PAK: వైభవ్ సూర్యవంశీని ఎగతాళి చేసిన పాక్ ఫ్యాన్స్.. బుడ్డోడు ఏం చేశాడంటే..?(వీడియో)

ఆసియాకప్ అండర్ 19 టోర్నీ‌లో పాకిస్థాన్ విజేతగా నిలిచింది. గత ఆదివారం దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్లో 191 పరుగుల భారీ తేడాతో భారత్‌ను చిత్తు చేసింది. అయితే ఈ మ్యాచ్ అనంతరం టీమిండియా టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ పట్ల పాకిస్థాన్ అభిమానులు అనుచితంగా ప్రవర్తించారు. కానీ వైభవ్ సూర్యవంశీ పరిణతి కనబర్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

ఈ మ్యాచ్ అనంతరం వైభవ్ సూర్యవంశీ స్టేడియం నుంచి బయటకు వస్తున్న క్రమంలో పాకిస్థాన్ అభిమానులు గట్టిగా అరుస్తూ అతన్ని ఎగతాళి చేశారు. సాధారణంగా కుర్రాళ్లు ఇలాంటి సందర్భాల్లో భావోద్వేగానికి గురవుతారు. అభిమానులతో గొడవపడుతారు. కానీ వైభవ్ సూర్యవంశీ కనీసం వారివైపు చూడను కూడా చూడలేదు. మౌనంగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అతని చర్యను భారత అభిమానులు కొనియాడుతున్నారు.

Vaibhav Suryavanshi s Maturity Impresses Fans as 14-Year-Old Stays Calm Amid Heckling from Pakistan

ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ బౌలర్ అలీ రజాతో వైభవ్ సూర్యవంశీ గొడవపడ్డాడు. వైభవ్ ఔటైన సమయంలో అలీ రజా నోటికి పని చెప్పగా.. వైభవ్ సూర్యవంశీ తన షూ చూపిస్తూ సైగలు చేశాడు. ఈ ఘటనపై వివాదం చెలరేగింది. ఫైనల్లో భారత్ ఓడినప్పటికీ ఈ టోర్నీ ఆసాంతం ఆకట్టుకుంది. వైభవ్ సూర్యవంశీ 5 ఇన్నింగ్స్‌ల్లో 182 స్ట్రైక్‌రేట్‌తో మొత్తం 261 పరుగులు చేశాడు. లీగ్ దశలో పాకిస్థాన్‌పై కూడా భారత్ విజయం సాధించింది. కానీ ఫైనల్లో అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకుంది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ అండర్ 19 టీమ్ నిర్ణీ 50 ఓవర్లలో 8 వికెట్లకు 347 పరుగుల భారీ స్కోర్ చేసింది. సమీర్ మిన్హాస్(113 బంతుల్లో 17 ఫోర్లు, 9 సిక్స్‌లతో 172) భారీ శతకంతో రాణించాడు.

అనంతరం భారత్ అండర్ 19 టీమ్ 26.2 ఓవర్లలో 156 పరుగులకు ఆలౌటైంది. అలీ రాజా(4/42) నాలుగు వికెట్లు తీయగా.. మహమ్మద్ సయ్యమ్(2/38), అబ్దుల్ సుభమ్(2/29), హుజైఫా అషాన్(2/12) రెండు వికెట్లు పడగొట్టాడు.

Story first published: Tuesday, December 23, 2025, 15:05 [IST]
Other articles published on Dec 23, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+