చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ.. కోహ్లీ రికార్డ్ బద్దలు!
టీమిండియా టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ చరిత్ర సృష్టించాడు. యూత్ వన్డే క్రికెట్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రికార్డ్‌ను అధిగమించాడు. అండర్ 19 ప్రపంచకప్ 2026లో భాగంగా బంగ్లాదేశ్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో ఈ ఫీట్ సాధించాడు. ఈ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ.. 67 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 72 పరుగులు చేశాడు. దాంతో యూత్ వన్డేల్లో కోహ్లీని వైభవ్ సూర్యవంశీ అధిగమించాడు. 2006 నుంచి 2008 మధ్య 28 యూత్ వన్డేలు ఆడిన కోహ్లీ.. 978 పరుగులు చేసాడు. వైభవ్ సూర్యవంశీ 19 యూత్ వన్డేల్లోనే 3 సెంచరీలు, ఐదు హాఫ్ సెంచరీలతో 1047 పరుగులు చేశాడు. 2024లో భారత్ తరఫున అండర్ 19 క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన సూర్యవంశీ.. దుమ్మురేపుతున్నాడు.
శుభ్‌మన్ గిల్, ఉన్ముక్త్ చంద్‌లను అధిగమించే దిశగా సూర్యవంశీ దూసుకెళ్తున్నాడు. 2018 అండర్ 19 ప్రపంచకప్‌లో వైస్ కెప్టెన్‌గా వ్యవహరించిన శుభ్‌మన్ గిల్.. మొత్తం 15 యూత్ వన్డేల్లో 1149 పరుగులు చేశాడు. 2012 అండర్ 19 ప్రపంచకప్ విన్నర్ ఉన్ముక్త్ చంద్ 21 ఇన్నింగ్స్‌ల్లో 1149 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్లో ఉన్ముక్త్ అజేయ శతకంతో రాణించాడు. 2008 అండర్ 19 ప్రపంచకప్‌లో విరాట్ కోహ్లీ.. భారత జట్టును విజేతగా నిలిపాడు.

యూత్ వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్ల జాబితాలో భారత మాజీ అండర్ 19 కెప్టెన్ విజయ్ జోల్ అగ్రస్థానంలో ఉన్నాడు. అతను 36 మ్యాచ్‌ల్లో 1404 పరుగులు చేశాడు. అతని తర్వాత యశస్వి జైస్వాల్ 27 మ్యాచ్‌ల్లో 1386 పరుగులు చేశాడు. కోహ్లీ సారథ్యంలో ఆడిన తన్మయ్ శ్రీవాస్తవా 34 మ్యాచ్‌ల్లో 1316 పరుగులు చేశాడు. సూర్యవంశీ వయసు 14 ఏళ్లు మాత్రమే కావడంతో అతను ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచే అవకాశం ఉంది.
అయితే అతనికి మరో అండర్ 19 ప్రపంచకప్ ఆడే అవకాశం లేదు. ఎందుకంటే బీసీసీఐ రూల్స్ ప్రకారం ఒక ప్లేయర్ ఒక అండర్ 19 ప్రపంచకప్ ఎడిషన్ మాత్రమే ఆడాలి. భారత దేశవాళీ క్రికెట్‌లో బిహార్‌కు ఆడుతున్న సూర్యవంశీ.. ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. తన విధ్వంసకర ఆట తీరుతో తుది జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు.
యూత్ వన్డేల్లో భారత్ తరపున అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్లు:
విజయ్ జోల్ 1404
యశస్వి జైస్వాల్ 1386
తన్మయ్ శ్రీవాస్తవ 1316
శుభ్‌మన్ గిల్ 1149
ఉన్ముక్త్ చంద్ 1149
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications