IPL 2026: వైభవ్ సూర్యవంశీకి విరాట్ కోహ్లీ అదిరిపోయే గిఫ్ట్!
ఐపీఎల్ 2026 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) విజేతగా నిలిచింది. ఆదివారం అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్లో సమష్టిగా రాణించిన ఆర్‌సీబీ 5 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్‌ను చిత్తు చేసి రెండో టైటిల్ అందుకుంది. అయితే ఈ మ్యాచ్‌కు రాజస్థాన్ రాయల్స్ టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ హాజరయ్యాడు. దాంతో అదరి దృష్టి అతనిపైనే నెలకొంది.
సచిన్ టెండూల్కర్ నుంచి ప్రశంసలు అందుకున్న కొన్ని గంటల వ్యవధిలోనే మరో దిగ్గజ విరాట్ కోహ్లీ కూడా వైభవ్ సూర్యవంశీని మెచ్చుకున్నాడు. ఫైనల్ అనంతరం విరాట్ కోహ్లీకి వైభవ్ సూర్యవంశీ కంగ్రాట్స్ చెప్పగా.. విరాట్ కోహ్లీ అతన్ని దగ్గరకు తీసుకొని ఆత్మీయ ఆలింగనం చేసుకున్నాడు.
భుజాలపై చేతులు వేసి..
అతని భుజంపై చేతులు వేసి కాసేపు మాట్లాడాడు. వారిద్దరి మధ్య జరిగిన సంభాషణ జరిగిందో తెలియకపోయినప్పటికీ.. కోహ్లీ చర్య వైభవ్ సూర్యవంశీకి పెద్ద బహుమతిగా నిలిచిందని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
ఐపీఎల్ ఫైనల్‌కు ముందే క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ కూడా వైభవ్ సూర్యవంశీని ఆకాశానికెత్తాడు. వెంటనే వైభవ్ సూర్యవంశీని టెస్ట్ క్రికెట్‌లోకి తీసుకోవాలని చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌కు సూచించాడు. ఈ సీజన్ ఆరంభంలోనే గౌహతిలో జరిగిన మ్యాచ్ తర్వాత వైభవ్ టోపీపై కోహ్లీ ఆటోగ్రాఫ్ ఇచ్చాడు.

ఐదు అవార్డులు.
ఈ సీజన్‌లో వైభవ్ సూర్యవంశీ మొత్తం ఐదు ప్రతిష్టాత్మక అవార్డులను గెలుచుకుని అద్భుతమైన రికార్డును అందుకున్నాడు. ఆరెంజ్ క్యాప్‌తో పాటు అత్యధిక సిక్సర్లు, సూపర్ స్ట్రైకర్, మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్, ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ అవార్డులను గెలుచుకున్నాడు.
ఈ సీజన్‌లో 72 సిక్సర్లు బాది, ఒక ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక సిక్సర్లు (59 సిక్సర్లు) కొట్టిన క్రిస్ గేల్ రికార్డును వైభవ్ బద్దలు కొట్టాడు. అంతేకాకుండా.. ఐపీఎల్ చరిత్రలో అతి తక్కువ వయసులో, అత్యంత వేగంగా 1000 పరుగులు సాధించిన భారత ఆటగాడిగా రిషబ్ పంత్ నెలకొల్పిన రికార్డును కూడా వైభవ్ అధిగమించాడు. ఈ 15 ఏళ్ల కుర్రాడి అద్భుత ప్రదర్శన క్రికెట్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది.
చాలా కాలం ఆడాలి..
ఐపీఎల్ ఫైనల్ అనంతరం రవిశాస్త్రితో మాట్లాడుతూ.. తన బ్యాటింగ్, భవిష్యత్తు ప్రణాళికల గురించి వెల్లడించాడు. 'నేను చాలా కాలం పాటు క్రికెట్ ఆడాలని అనుకుంటున్నాను. ఫిట్‌నెస్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. గాయాల బారిన పడకుండా జాగ్రత్తపడాలి. అందుకే భవిష్యత్తులో నా ఫిట్‌నెస్‌పై మరింత కష్టపడి పూర్తి శ్రద్ధ పెడతాను.’అని చెప్పుకొచ్చాడు.
ఐపీఎల్ ఫైనల్ సందర్భంగా వీఐపీ బాక్స్‌లో జై షా పక్కన కూర్చుని వైభవ్ మ్యాచ్ చూడటం గమనార్హం. ఇది అతను త్వరలోనే భారత జాతీయ జట్టులోకి అడుగు పెడతాడనే ప్రచారానికి బలమిస్తోంది. భారత్-ఏ జట్టు తరఫున వైభవ్ సూర్యవంశీ శ్రీలంక పర్యటనకు వెళ్లనున్నాడు. అక్కడ సత్తా చాటితే భారత జట్టు తరఫున అరంగేట్రం చేయనున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications