టీమిండియా టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీకి ప్రతిష్టాత్మక అవార్డ్ లభించింది. 14 ఏళ్ల వయసులోనే పరుగుల మోత మోగిస్తున్న ఈ బిహార్ కుర్రాడికి దేశ అత్యున్నత బాలల పురస్కారమైన 'ప్రధాన్ మంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్'వరించింది. వీర్ బాల్ దివస్ పేరిట ఢిల్లీలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా సూర్యవంశీ ఈ అవార్డ్‌ను అందుకున్నాడు.
చిన్న వయసు(5-18)లో ధైర్య సాహసాలు ప్రదర్శించడంతో పాటు ఆర్ట్, కల్చర్, ఎన్విరాన్‌మెంట్, ఇన్నోవేషన్, సోషల్ సర్వీస్, సైన్స్ అండ్ టెక్నాలజీ, స్పోర్ట్స్ రంగాల్లో అసాధారణ ప్రతిభ కనబర్చిన పిల్లలకు ఈ పురస్కారం అందజేస్తారు. ఈ ఏడాది 18 రాష్ట్రాల నుంచి 20 మంది పిల్లలు ఈ అవార్డ్‌ను స్వీకరించారు. క్రీడల కేటగిరిలో వైభవ్‌కు ఈ దేశ అత్యున్నత బాలల పురస్కారం లభించింది.

వైభవ్ సూర్యవంశీతో పాటు ఈ అవార్డ్ గ్రహీతలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలవనున్నారు. ఈ అవార్డ్ స్వీకరణ నేపథ్యంలో విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్‌కు వైభవ్ సూర్యవంశీ దూరమయ్యాడు. అరుణాచల్ ప్రదేశ్‌తో గత బుధవారం జరిగిన తొలి మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగాడు. 36 బంతుల్లోనే సెంచరీ మార్క్ అందుకున్న వైభవ్.. లిస్ట్-ఏ క్రికెట్‌లో ఈ ఘనతను అందుకున్న అత్యంత పిన్నవయస్కుడిగా చరిత్రకెక్కాడు.
ఈ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ(84 బంతుల్లో 16 ఫోర్లు, 15 సిక్స్‌లతో 190) తృటిలో ద్విశతకాన్ని చేజార్చుకోగా.. బిహార్ 574/6 పరుగులతో ఆల్‌టైమ్ రికార్డ్ స్కోర్ నమోదు చేసింది. లిస్ట్-ఏ క్రికెట్‌లోనే అత్యధిక స్కోర్ నమోదు చేసిన జట్టుగా చరిత్రకెక్కింది.
'ప్రధాన్ మంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్' అవార్డ్ వైభవ్ సూర్యవంశీ కెరీర్‌లో ప్రత్యేకంగా నిలిచిపోనుంది. 14 ఏళ్ల వయసులోనే అసాధారణ బ్యాటింగ్‌తో యావత్ క్రికెట్ ప్రపంచాన్ని నివ్వెరపోయేలా చేసిన వైభవ్.. ఈ అవార్డుతో మరో మెట్టెక్కాడు.