U19 World Cup 2026: సెంచరీతో చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ.. వరల్డ్ రికార్డ్!
Vaibhav Suryavanshi: టీమిండియా టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ చరిత్ర సృష్టించాడు. అండర్ 19 ప్రపంచకప్ ఫైనల్లో అత్యంత వేగంగా సెంచరీ బాదిన తొలి బ్యాటర్‌గా నిలిచాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఫైనల్లో 55 బంతుల్లో సెంచరీ చేయడం ద్వారా వైభవ్ సూర్యవంశీ ఈ ఫీట్ సాధించాడు. అండర్ 19 ప్రపంచకప్ ఫైనల్లో సెంచరీ బాదిన అతని పిన్న వయస్కుడు కూడా వైభవ్ సూర్యవంశీ కావడం గమనార్హం. 14 ఏళ్ల వయసులోనే వైభవ్ సూర్యవంశీ ఈ ఫీట్ సాధించాడు. ఈ విధ్వంసకర శతకంతో అరుదైన రికార్డులను వైభవ్ సూర్యవంశీ తన పేరిట లిఖించుకున్నాడు.
ఐసీసీ టోర్నీల చరిత్రలోనే ఫైనల్లో అత్యంత వేగంగా సెంచరీ బాదిన బ్యాటర్‌గా కూడా వైభవ్ సూర్యవంశీ రికార్డుకెక్కాడు. పురుషుల, మహిళల ఐసీసీ టోర్నీల ఫైనల్లోనూ వైభవ్ సూర్యవంశీ కంటే వేగంగా ఎవరూ శతకం సాధించలేదు. అండర్ 19 ప్రపంచకప్ చరిత్రలోనే అత్యంత వేగంగా శతకం బాదిన రెండో బ్యాటర్‌గా నిలిచాడు.

U19 ప్రపంచకప్‌లో అత్యంత వేగవంతమైన సెంచరీలు (ఎదుర్కొన్న బంతుల ప్రకారం)
51 - విల్ మాలాజ్కుక్ (ఆస్ట్రేలియా) vs జపాన్, విండ్‌హోక్, 2026
55 - వైభవ్ సూర్యవంశీ (భారత్) vs ఇంగ్లాండ్, హరారే, 2026
63 - ఖాసిం అక్రమ్ (పాకిస్తాన్) vs శ్రీలంక, నార్త్ సౌండ్, 2022
65 - బెన్ మేయెస్ (ఇంగ్లండ్) vs స్కాట్లాండ్, హరారే, 2026
69 - రాజ్ బావా (భారత్) vs ఉగాండా, టరూబా, 2022
ఫైనల్లో టాప్ స్కోర్..
అండర్ 19 ప్రపంచకప్ ఫైనల్స్ చరిత్రలోనే అత్యధిక వ్యక్తిగత స్కోర్ నమోదు చేసిన బ్యాటర్‌గా కూడా వైభవ్ సూర్యవంశీ చరిత్రకెక్కాడు. ఈ ఫీట్ సాదించిన మూడో భారత బ్యాటర్‌గా కూడా వైభవ్ నిలిచాడు. అతని కంటే ముందు ఉన్మక్త చంద్(111*), మన్జోత్ కల్రా(101*) ఫైనల్లో భారత్ తరఫున శతకాలు నమోదు చేశారు. అండర్ 19 ప్రపంచకప్ చరిత్రలోనే అత్యంత వేగంగా 150 పరుగులు చేసిన బ్యాటర్‌గా కూడా వైభవ్ సూర్యవంశీ రికార్డుకెక్కాడు.
U19 ప్రపంచకప్ ఫైనల్స్‌లో సెంచరీలు
175 - వైభవ్ సూర్యవంశీ (భారత్) vs ఇంగ్లాండ్, హరారే, 2026
111* - ఉన్ముక్త్ చంద్ (భారత్) vs ఆస్ట్రేలియా, టౌన్స్‌విల్లే, 2012
108 - బ్రెట్ విలియమ్స్ (ఆస్ట్రేలియా) vs పాకిస్తాన్, అడిలైడ్, 1988
107 - స్టీఫెన్ పీటర్స్ (ఇంగ్లాండ్) vs న్యూజిలాండ్, జోహన్నెస్‌బర్గ్, 1998
101* - మన్జోత్ కల్రా (భారత్) vs ఆస్ట్రేలియా, మౌంట్ మౌంగనుయ్, 2018
100* - జరాడ్ బుర్కే (ఆస్ట్రేలియా) vs సౌత్ ఆఫ్రికా, లింకన్, 2002
15 సిక్స్‌లతో ఊచకోత..
ఈ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ తన విశ్వరూపం చూపించాడు. 15 సిక్స్‌లు, 15 ఫోర్లతో ఇంగ్లండ్ బౌలర్లను ఊచకోత కోసాడు. ఈ మ్యాచ్‌లో 32 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న వైభవ్ సూర్యవంశీ.. మరో 23 బంతుల వ్యవధిలోనే శతకాన్ని అందుకున్నాడు. మరో 16 బంతుల వ్యవధిలోనే 150 పరుగుల మార్క్ ధాటాడు. డబుల్ సెంచరీ దిశగా సాగిన అతన్ని ఇంగ్లండ్ బౌలర్ మన్నీ లమ్స్‌డెన్ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications