Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఏజ్ ఫ్రాడ్ ఆరోపణలు.. వైభవ్ సూర్యవంశీకి బోన్ టెస్ట్ చేయనున్న బీసీసీఐ!

టీమిండియా యువ సంచలనం, 14 ఏళ్ల సిక్సర పిడుగు వైభవ్ సూర్యవంశీకి భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) బోన్ టెస్ట్ చేయనుంది. 14 ఏళ్ల వయసులోనే ఐపీఎల్‌లోకి అరంగేట్రం చేయడమే కాకుండా ఎదుర్కొన్న తొలి బంతినే ఈ బిహార్ కుర్రాడు సిక్సర్ తరలించాడు. 14 ఏళ్ల వయసులోనే 35 బంతుల్లో సెంచరీ బాది.. టీ20 క్రికెట్ చరిత్రలోనే అత్యంత పిన్న వయసులో శతకం బాదిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. 18 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వేగంగా సెంచరీ బాదిన రెండో ఆటగాడిగా నిలిచాడు.

ఏజ్ ఫ్రాడ్ ఆరోపణలు

ఈ ప్రదర్శనతో వైభవ్ సూర్యవంశీ టాక్ ఆఫ్ ది వరల్డ్‌గా నిలిచాడు. అతనిపై దిగ్గజ ఆటగాళ్ల నుంచి సాధారణ అభిమానుల వరకు ప్రశంసల జల్లు కురిపించారు. అయితే కొందరు మాత్రం అతని వయసుపై సందేహం వ్యక్తం చేశారు. వైభవ్ సూర్యవంశీ ఏజ్ ఫ్రాడ్‌కు పాల్పడ్డాడని, ఖచ్చితంగా అతని వయసులో 16 ఏళ్ల కంటే ఎక్కువగానే ఉంటుందని కామెంట్ చేశారు. నార్త్ ఇండియాలో క్రికెటర్లు ఏజ్ ఫ్రాడ్ చేయడం సాధారణమని, రోహిత్, కోహ్లీ, ధోనీలు కూడా తమ వయసును తక్కువగా రాయించుకున్నవాళ్లేనని, ఏజ్ క్రికెట్ కోసం చాలా మంది తమ వయసును ఒకటి, రెండేళ్లు తక్కువ చెప్పుకునేవారేనని అభిప్రాయపడ్డారు.

Vaibhav Suryavanshi Controversy Prompts BCCI to Revise Age-Fudging Norms

బీసీసీఐ బోన్ టెస్ట్..

ఈ క్రమంలోనే వైభవ్ సూర్యవంశీ ఏజ్‌ గురించి సోషల్ మీడియా వేదికగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ వివాదానికి ముగింపు పలికేందుకు బీసీసీఐ సిద్దమైంది. అందరీ సందేహాలను పటాపంచలు చేసేందుకు వైభవ్ సూర్యవంశీకి బోన్ టెస్ట్ నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. వైభవ్ సూర్యవంశీ వయస్సు వివాదం తర్వాత, ఏజ్ క్రికెట్‌లో వయసు మోసాన్ని అరికట్టడానికి బీసీసీఐ కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది. ఈ క్రమంలోనే అండర్ 16 ఆటగాళ్లందరికీ మరోసారి బోన్ టెస్ట్ నిర్వహించనుంది.

BCCI సాధారణంగా ఆటగాళ్ల ఖచ్చితమైన వయస్సును తెలుసుకునేందుకు BW3 (Bone Wrist 3) అనే పద్ధతిని ఉపయోగిస్తుంది. ఈ టెస్ట్‌లో ఆటగాళ్ల చేతి ఎముకలు, దంతాలు, తల ఎముకలను క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఎముకల పెరుగుదల వయసుతో ముడిపడి ఉంటుంది. ఈ పరీక్ష ద్వారా ఆటగాడి వయస్సును చాలా వరకు ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. అయితే గతంలో కంటే ఖచ్చితమైన వయసును లెక్కించేందుకు బీసీసీఐ కొత్త పద్దతిని ఉపయోగించనుంది.

మాకు భయం లేదు..

ఈ టెస్ట్ నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీ తండ్రి సంజీవ్ మాట్లాడుతూ తమకు ఎలాంటి భయం లేదని చెప్పాడు. 8 ఏళ్ల వయసులోనే సూర్యవంశీకి బోన్ టెస్ట్ జరిగిందని, అతను ఇప్పటికే అండర్ 19 జట్టుకు ఆడాడని, మళ్లీ టెస్ట్ చేసినా తమకు భయం లేదని స్పష్టం చేశాడు. 'రామాయణంలో సీతమ్మకే తప్పలేదు అగ్నిపరీక్ష.. వైభవ్ సూర్యవంశీ ఎంత?'అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

Story first published: Tuesday, June 17, 2025, 17:03 [IST]
Other articles published on Jun 17, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+