Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ.. బంతితో వరల్డ్ రికార్డ్!

టీమిండియా టీనేజ్ సెన్సెషన్ వైభవ్ సూర్యవంశీ ఇంగ్లండ్ గడ్డపై రికార్డుల మోత మోగిస్తున్నాడు. యూత్ వన్డే సిరీస్‌లో విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగి అరుదైన ఘనతను సొంతం చేసుకున్న వైభవ్ సూర్యవంశీ.. టెస్ట్ సిరీస్‌లోనూ అదే జోరు కొనసాగిస్తున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో విఫలమైన వైభవ్(14).. రెండో ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ(56)తో రాణించాడు.

అయితే బ్యాట్‌తో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయకపోయినా బంతితో వరల్డ్ రికార్డ్ నమోదు చేశాడు. లెఫ్టార్మ్ స్పిన్నర్ అయిన వైభవ్ సూర్యవంశీ రెండు వికెట్లు తీసాడు. అద్భుతమైన ప్రదర్శన కనబర్చిన ఇంగ్లండ్ కెప్టెన్ హంజా షేక్(84)తో పాటు థామస్ రెవ్(34)ను పెవిలియన్ చేర్చాడు. ఈ క్రమంలో అండర్ 19 టెస్ట్ క్రికెట్ చరిత్రలో వికెట్ తీసిన అత్యంత పిన్నవయస్కుడిగా నిలిచాడు. 14 ఏళ్ల 107 రోజుల వయసులోనే వైభవ్ సూర్యవంశీ వికెట్ తీసాడు. ఈ క్రమంలో భారత అండర్ 19 క్రికెటర్ మనిషీ(15) రికార్డ్‌ను అధిగమించాడు. అతను 15 ఏళ్ల వయసులో వికెట్ తీసాడు.

Vaibhav Suryavanshi Continues to Break Records Achieves Bowling Feat

ఈ మ్యాచ్‌లో భారత్ భారీ ఆధిక్యం దిశగా సాగుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో 504 పరుగులు చేసిన భారత అండర్ 19 జట్టు.. ఇంగ్లండ్ అండర్ 19 టీమ్‌ను 439 పరుగులకే ఆలౌట్ చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో నాలుగో రోజు లంచ్ బ్రేక్ సమయానికి 209/8 పరుగులు చేసింది. ప్రస్తుతం భారత్ ఆధిక్యం 310 పరుగులకు చేరింది.

Story first published: Tuesday, July 15, 2025, 17:45 [IST]
Other articles published on Jul 15, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+