Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Vaibhav Suryavanshi: ఇదేం కొట్టుడు పిలగా.. 30 బంతుల్లో 150 రన్స్!

Vaibhav Suryavanshi:టీమిండియా టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ(80 బంతుల్లో 15 ఫోర్లు, 15 సిక్స్‌లతో 175) విధ్వంసకర శతకంతో సత్తా చాటాడు. అండర్ 19 ప్రపంచకప్ 2026లో భాగంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఫైనల్లో 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 218.75 స్ట్రైక్‌రేట్‌తో ఇంగ్లండ్ బౌలర్లను ఊచకోత కోసాడు. 15 సిక్సర్లు, 15 ఫోర్లతో 30 బంతుల్లోనే 150 పరుగులు చేశాడు. అతని విధ్వంసానికి ఇంగ్లండ్ కుర్రాళ్లు బిత్తరపోయారు. ఎప్పుడు ఔటవుతార్రా బాబు అని తలలు పట్టుకున్నారు.

ఈ మ్యాచ్‌లో 32 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదిన వైభవ్ సూర్యవంశీ.. 55 బంతుల్లోనే సెంచరీ మార్క్ అందుకున్నాడు. 71 బంతుల్లోనే 150 పరుగులు సాధించాడు. ఈ మ్యాచ్‌లో తొలి 50 పరుగులకు 32 బంతులు తీసుకున్న వైభవ్ సూర్యవంశీ.. రెండో యాభై 23 బంతుల్లోనే పూర్తి చేశాడు. 16 బంతుల్లోనే మూడో యాబైని పూర్తి చేశాడు. డబుల్ సెంచరీ దిశగా సాగిన వైభవ్ సూర్యవంశీ ఇంగ్లండ్ బౌలర్ మన్నీ లమ్స్‌డెన్ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. దాంతో ఇంగ్లండ్ బౌలర్లు ఊపిరి పీల్చుకున్నారు.

Vaibhav Suryavanshi Blasts 150 off 30 Balls With 15 Sixes 15 Fours in U19 World Cup Final vs England

పెవిలియన్ వైపు నడిచిన వైభవ్ సూర్యవంశీ.. ప్రతీ ఇంగ్లండ్ ప్లేయర్ ప్రత్యేకంగా అభినందించారు. అతని దగ్గరకు వచ్చి మరి విషేస్ చెప్పారు. వైభవ్ సూర్యవంశీ ధాటికి ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత అండర్ 19 టీమ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 411 పరుగుల భారీ స్కోర్ చేసింది.

వైభవ్‌కు తోడుగా కెప్టెన్ ఆయుష్ మాత్రే(51 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 53) హాఫ్ సెంచరీ సాధించగా.. అభిజ్ఞాన్ కుండు(40), విహాన్ మల్హోత్రా(30), వేదాంత్ త్రివేది(32), కాన్షిక్(37 నాటౌట్) దూకుడుగా ఆడారు. ఇంగ్లండ్ బౌలర్లలో సెబాస్టియన్ మోర్గాన్, అలెక్స్ గ్రీన్ రెండేసి వికెట్లు తీయగా.. జేమ్స్ మింటో(3/45) మూడు వికెట్లు పడగొట్టాడు. మన్నీ లమ్స్‌డెన్ ఒక వికెట్ తీసాడు. అండర్ 19 ప్రపంచకప్ చరిత్రలోనే ఇది అత్యధిక స్కోర్ కావడం గమనార్హం.

Story first published: Friday, February 6, 2026, 17:07 [IST]
Other articles published on Feb 6, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+