Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Vaibhav Sooryavanshi: ఫస్ట్‌ బాల్‌కే ప్రపంచ రికార్డ్ బద్దలుగొట్టిన బుడ్డోడు!

రాజస్థాన్ రాయల్స్ టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ చరిత్ర సృష్టించాడు. టీ20 క్రికెట్‌లో అత్యంత వేగంగా 100 సిక్స్‌లు బాదిన బ్యాటర్‌గా నిలిచాడు. ఈ ఘనతను అందుకునేందుకు ఈ 15 ఏళ్ల బుడ్డోడు కేవలం 514 బంతులనే తీసుకున్నాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో శనివారం జైపూర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ ఈ ఫీట్ సాధించాడు.

మహమ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో ఎదుర్కొన్న తొలి బంతినే సిక్సర్ బాదడం ద్వారా వైభవ్ సూర్యవంశీ 100 సిక్స్‌ల మైలురాయి అందుకున్నాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా లెఫ్టాండర్ కర‌ణ్‌బిర్ సింగ్ పేరిట ఉన్న రికార్డ్‌ను వైభవ్ సూర్యవంశీ అధిగమించాడు. కరన్‌బిర్ 813 బంతుల్లో 100 సిక్స్‌లు బాదాడు. కీరన్ పొలార్డ్, రొమారియో షెపెర్డ్, సెక్కుగా ప్రసన్న, రఖీమ్ కార్న్‌వాల్ ఈ ఫీట్ సాధించేందుకు 800+ బాల్స్ తీసుకున్నారు.

యంగెస్ట్ క్రికెటర్‌గా..

2024లో ప్రొఫెషనల్ టీ20 క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన వైభవ్ సూర్యవంశీ 19 మ్యాచ్‌ల్లో 102 సిక్స్‌లు బాదాడు. టీ20ల్లో 100 సిక్స్‌ల మైలురాయి అందుకున్న యంగెస్ట్ బ్యాటర్‌గానూ వైభవ్ సూర్యవంశీ నిలిచాడు. 15 ఏళ్ల 43 రోజుల వయసులో ఈ ఘనతను అందుకున్నాడు.

Vaibhav Sooryavanshi Smashes World Record Becomes Fastest to 100 T20 Sixes during RR vs GT in IPL 2026

టీ20ల్లో అత్యంత వేగంగా 100 సిక్సర్లు బాదిన బ్యాటర్లు (బంతుల పరంగా)

514 బంతులు - వైభవ్ సూర్యవంశీ (భారత్)

813 బంతులు - కరణ్‌బీర్ సింగ్ (ఆస్ట్రియా)

843 బంతులు - కీరన్ పొలార్డ్ (వెస్టిండీస్)

845 బంతులు - రోమారియో షెపర్డ్ (వెస్టిండీస్)

850 బంతులు - సీక్కుగే ప్రసన్న (శ్రీలంక)

850 బంతులు - రఖీమ్ కార్న్‌వాల్ (వెస్టిండీస్)

సిరాజ్X వైభవ్..

ఈ మ్యాచ్‌లో సిరాజ్, వైభవ్ మధ్య సైలెంట్ వార్ నడిచింది. సిరాజ్ బౌలింగ్‌లో వైభవ్ భారీ షాట్స్ ఆడగా.. కళ్లు చెదిరే యార్కర్లతో బుడ్డోడిని డీఎస్పీ సాబ్ ఇబ్బంది పెట్టాడు. గంటకు 146.6 కిలోమీటర్ల వేగంతో సిరాజ్ సంధించిన యార్కర్.. వైభవ్ సూర్యవంశీ పాదానికి బలంగా తాకింది. ఈ గాయం ధాటికి 15 ఏళ్ల కుర్రాడు క్రీజులో కుప్పకూలాడు. ఆ తర్వాత మరింత కసితో సిరాజ్ బౌలింగ్‌లో బౌండరీలు బాదాడు. చివరకు సిరాజ్ బౌన్సర్‌కు పుల్ షాట్ ఆడబోయి క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. వైభవ్‌పై కన్నెర్ర చేస్తూ గట్టిగా అరుస్తూ సిరాజ్ సెలెబ్రేట్ చేసుకున్నాడు.

గుజరాత్ ఘన విజయం..

ఈ మ్యాచ్‌లో 77 పరుగుల భారీ తేడాతో రాజస్థాన్ రాయల్స్‌ను చిత్తు చేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 229 పరుగులు చేసింది. సాయి సుదర్శన్(36 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 55), శుభ్‌మన్ గిల్(44 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 84) హాఫ్ సెంచరీలతో రాణించగా.. వాషింగ్టన్ సుందర్(20 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 37 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో బ్రిజేష్ శర్మ రెండు వికెట్లు తీయగా.. యష్‌రాజ్ పుంజా, రవీంద్ర జడేజా తలో వికెట్ తీసారు.

అనంతరం రాజస్థాన్ రాయల్స్ 16.3 ఓవర్లలో 152 పరుగులకు ఆలౌటై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. రవీంద్ర జడేజా(25 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 38), వైభవ్ సూర్యవంశీ(16 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 36) టాప్ స్కోరర్లుగా నిలవగా మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. రషీద్ ఖాన్(4/33) నాలుగు వికెట్లతో రాజస్థాన్ రాయల్స్ పతనాన్ని శాసించాడు. కగిసో రబాడ రెండు వికెట్లు తీయగా.. జాసన్ హోల్డర్(3/12) మూడు వికెట్లు తీసాడు. మహమ్మద్ సిరాజ్‌కు ఒక వికెట్ దక్కింది.

Story first published: Sunday, May 10, 2026, 11:27 [IST]
Other articles published on May 10, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+