Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

భారత టీ20 జట్టులోకి వైభవ్ సూర్యవంశీ.. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్!

ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లే భారత టీ20 జట్టులో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీకి తొలి అవకాశం ఇవ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లే భారత జట్టును ఎంపిక చేసేందుకు బీసీసీఐ సెలెక్షన్ కమిటీ శనివారం(జూన్ 6) ముంబైలో సమావేశం కానుంది.

ఈ జట్టులో వైభవ్ సూర్యవంశీకి దాదాపు చోటు ఖాయం కానుంది. జూన్ 26, 28 తేదీల్లో డబ్లిన్ వేదికగా ఐర్లాండ్‌తో టీమిండియా రెండు టీ20ల సిరీస్ ఆడనుంది. జులై 1 నుంచి 11 వరకు ఇంగ్లండ్‌తో ఐదు టీ20ల సిరీస్ ఆడనుంది.

ఐపీఎల్ 2026లో వరల్డ్ రికార్డ్

బీహార్‌కు చెందిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ.. అద్వితీయమైన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన అండర్ 19 ప్రపంచకప్‌లో విధ్వంసకర బ్యాటింగ్‌తో భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు కూడా అందుకున్నాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లోనూ అదే జోరు కొనసాగించాడు. రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్‌గా 16 మ్యాచ్‌ల్లో 776 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు. 237.30 స్ట్రైక్‌రేట్‌తో ఆడిన వైభవ్ 72 సిక్సర్లతో వరల్డ్ రికార్డ్ నమోదు చేశాడు. టీ20 క్రికెట్ చరిత్రలోనే ఒక సిరీస్‌లో ఏ ఆటగాడు ఇన్ని సిక్సర్లు కొట్టలేదు.

Vaibhav Sooryavanshi Set to Earn Maiden India Call-Up for T20I Series in Ireland and England

టీమిండియా భవిష్యత్తు తార..

వైభవ్ బ్యాటింగ్‌కు దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌తో పాటు ప్యాట్ కమిన్స్ వంటి స్టార్ ఆటగాళ్లు ఫిదా అయ్యారు. భారత జట్టు తరఫున ఆడించాలని సూచించారు. వైభవ్ భారత్ తరఫున బరిలోకి దిగితే.. అంతర్జాతీయ క్రికెట్ ఆడిన అత్యంత పిన్న వయస్కుడిగా నిలుస్తాడు. 2028 లాస్ ఎంజిల్స్ ఒలింపిక్స్, అదే ఏడాది ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వేదికగా జరిగే టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకొని భారత సెలెక్షన్ కమిటీ జట్టును ఎంపిక చేయనుంది.

సూర్యకుమార్ యాదవ్‌పై వేటు..

పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడుతున్న టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌పై వేటు పడనుంది. గత 18 నెలలుగా అతను పరుగులు చేసేందుకు ఇబ్బంది పడుతున్నాడు. అతని స్థానంలో శ్రేయస్ అయ్యర్‌ను కొత్త టీ20 సారథిగా నియమించే అవకాశం ఉంది. డిసెంబర్ 2023లో అయ్యర్ భారత్ తరఫున చివరి టీ20 ఆడాడు.

Story first published: Friday, June 5, 2026, 13:22 [IST]
Other articles published on Jun 5, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+