టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లోకి వైభవ్ సూర్యంశీకి నో ఎంట్రీ!
టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీని టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లోకి అనుమతించమని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) స్పష్టం చేసింది. వరల్డ్ బెస్ట్ లీగ్ అయిన ఐపీఎల్‌లో 15 ఏళ్ల వైభవ్.. ఎంతో మంది స్టార్ బౌలర్లను చితక్కొట్టినా.. టీమిండియాలో ఆడే అవకాశం దక్కించుకున్నా.. తాము ఇంకా అతన్ని పసివాడిగానే చూస్తున్నామని ఈసీబీ స్పష్టం చేసింది.
16 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉండటంతో అతను టీమిండియా ఆటగాళ్ల డ్రెస్సింగ్ రూమ్‌లో ఉండరాదని సూచించింది. అందుకే వైభవ్ సూర్యవంశీ కోసం ప్రత్యేకమైన డ్రెస్సింగ్ రూమ్‌ను కేటాయిస్తామని తెలిపింది.
ప్రత్యేకమైన డ్రెస్సింగ్ రూమ్..
'వైభవ్ వయసు 16 ఏళ్ల కంటే తక్కువ. ఇలాంటి అండర్-16 ఆటగాళ్లకు తగిన భద్రత కల్పించే విషయంలో ఇంగ్లండ్ దేశంలోని చట్టాలను మేం అమలు చేస్తాం. అతను మ్యాచ్ జరిగేటప్పుడు లేదా టీమ్ మీటింగ్స్ సమయంలో మాత్రమే తన జట్టు సభ్యులతో కలిసి డ్రెస్సింగ్ రూమ్‌లో కూర్చోవచ్చు.

అయితే జెర్సీ మార్చుకునే సమయంలో అతను అక్కడ ఉండరాదు. లేదా ఎవరూ లేని సమయంలో మార్చుకున్నా.. ఇతర ఆటగాళ్లు వస్తే వెంటనే గదిని వీడాలి. అందుకే వైభవ్ కోసం అదనంగా మరో డ్రెస్సింగ్ రూమ్‌ను ఏర్పాటు చేస్తున్నాం.'అని ఈసీబీ పేర్కొంది.
ఐర్లాండ్ సిరీస్‌కు కూడా..
దేశవాళీ క్రికెట్‌లో బిహార్ టీమ్ సభ్యుడిగా.. ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్‌గా ఇప్పటికే వైభవ్ సూర్యవంశీ టీమ్ డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్నాడు. కానీ ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు మాత్రం అంగీకరించడం లేదు. ఇంగ్లండ్‌తో సిరీస్‌కు ముందు జరిగే ఐర్లాండ్ సిరీస్‌కు కూడా ఇవే నిబంధనలు వర్తిస్తాయి.
వాస్తవానికి ఇవి ఐసీసీ రూల్స్. ద్వైపాక్షిక సిరీస్‌ల సమయంలో వీటిని పాటించాల్సిన అవసరం అయితే లేదు. అయితే ఈసీబీ తమ సేఫ్ హ్యాండ్స్ విధానం ప్రకారం వైభవ్ సూర్యవంశీని ప్రత్యేక ఆటగాడిగా చూస్తోంది. గతంలో ప్రీమియర్ లీగ్ ఫుట్‌బాల్‌లో ఆర్సనల్ జట్టుకు చెందిన ఇద్దరు అండర్ -16 ప్లేయర్లు ఎథన్ ఎన్‌వనరి, మ్యాక్స్ డోమన్‌ను కూడా ఇలాగే విడిగా ఉంచారు.
తల్లిదండ్రులకు బీసీసీఐ అనుమతి..
15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ వెంట అతని తల్లిదండ్రులను పంపించాలని బీసీసీఐ ఇప్పటికే నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. శుక్రవారం ఐర్లాండ్‌తో జరిగే తొలి టీ20లో అతను బరిలోకి దిగితే భారత్ తరఫున అంత్యంత పిన్న వయసులో(15 ఏళ్ల 91 రోజులు) అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన క్రికెటర్‌గా రికార్డ్ సాధిస్తాడు. ఈ క్రమంలో సచిన్ టెండూల్కర్ రికార్డ్‌ను బ్రేక్ చేస్తాడు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ 16 ఏళ్ల 205 రోజుల వయసులో అరంగేట్రం చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

