Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అది ఇషాన్ భయ్యాకు తెలియదు.. భయపడుతూనే బౌలింగ్ ఇచ్చాడు: వైభవ్ సూర్యవంశీ

టీమిండియా టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర బ్యాటింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 15 ఏళ్ల వయసులోనే వరల్డ్ క్లాస్ బౌలర్లకు చుక్కలు చూపించిన బుడ్డో సిక్సర పిడుగుగా విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. అయితే ఈ బిహార్ కుర్రాడికి బౌలింగ్‌ చేసే సామర్థ్యం కూడా ఉంది.

4 బంతుల్లో 2 వికెట్లు.. బౌలింగ్‌లో అదరగొట్టిన వైభవ్ సూర్యవంశీ!

4 బంతుల్లో 2 వికెట్లు.. బౌలింగ్‌లో అదరగొట్టిన వైభవ్ సూర్యవంశీ!

ప్రతిష్టాత్మక దేశవాళీ టోర్నీ దులీప్ ట్రోఫీలో వైభవ్ సూర్యవంశీ 4 బంతుల వ్యవధిలోనే 2 వికెట్లు తీసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఈ టోర్నీలో ఈస్ట్ జోన్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న వైభవ్ సూర్యవంశీ..నార్త్ ఈస్ట్ జోన్‌తో జరిగిన మ్యాచ్‌లో తన బౌలింగ్‌‌తో సత్తా చాటాడు. అయితే ఈ మ్యాచ్‌లో కెప్టెన్ ఇషాన్ కిషన్ భయపడుతూనే తనకు బౌలింగ్ ఇచ్చాడని తాజాగా వైభవ్ సూర్యవంశీ చెప్పుకొచ్చాడు.

Vaibhav Sooryavanshi Says Ishan Kishan doesn t know I m a wicket-taker on his bowling in Duleep Trophy

తాజాగా బీసీసీఐ టీవీతో మాట్లాడిన వైభవ్ సూర్యవంశీ.. బౌలింగ్‌ను ఆస్వాదించానని చెప్పాడు. 'బ్యాటర్లు ఎప్పుడూ బౌలింగ్‌ చేయడాన్ని ఆస్వాదిస్తారు. బ్యాటర్ బౌలింగ్ చేయడం.. బౌలర్ బ్యాటింగ్ చేయడం ఆటగాడికి మరింత ఆనందాన్నిస్తుంది. వికెట్లు పడకపోవడంతోనే నేను వెళ్లే 2-3 ఓవర్లు బౌలింగ్ చేస్తానని ఇషాన్ కిషన్‌ను అడిగాను. ఇషాన్ భయ్యా మాత్రం భయపడుతూనే నాకు బౌలింగ్ ఇచ్చాడు. కానీ నేను వికెట్లు తీసే బౌలర్‌నని ఆయన ఊహించలేదు.

నేను ఐదు వికెట్లు పడగొట్టినా.. బౌలింగ్ చేయడానికి కేవలం మూడు ఓవర్లు మాత్రమే ఇస్తారని నా మనసులో అనుకున్నా. ఒకే చోట నిలబడి వీలైనంత త్వరగా నా స్పెల్‌ను ఉత్తమంగా ముగించడానికి ప్రయత్నించాను. ఆ మ్యాచ్‌లో నేను గొప్పగా బ్యాటింగ్ చేయలేదు. కానీ బంతితో జట్టుకు సహకరించడం చాలా సరదాగా అనిపించింది. ఒక బ్యాటర్ వికెట్ తీసినప్పుడు కలిగే ఆనందం కంటే గొప్పది మరొకటి ఉండదు.'అని వైభవ్ సూర్యవంశీ చెప్పుకొచ్చాడు.

సూర్యవంశీ, జైస్వాల్‌ను వదులొద్దు.. కఠినంగా వ్యవహరించాలి: సంజయ్ మంజ్రేకర్

Also Read

సూర్యవంశీ, జైస్వాల్‌ను వదులొద్దు.. కఠినంగా వ్యవహరించాలి: సంజయ్ మంజ్రేకర్

నార్త్ ఈస్ట్ జోన్‌పై ఇన్నింగ్స్ తేడాతో గెలిచిన ఈస్ట్ జోన్.. సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. సెంట్రల్ జోన్‌తో ఆదివారం ప్రారంభమయ్యే మ్యాచ్‌లో ఈస్ట్ జోన్‌ తలపడనుంది. ఈ మ్యాచ్‌కు వైభవ్ సూర్యవంశీ సిద్దమయ్యాడు. కనీసం ఈ మ్యాచ్‌లోనైనా అతను బ్యాట్ ఝులిపించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Story first published: Saturday, August 29, 2026, 14:49 [IST]
Other articles published on Aug 29, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+