Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Vaibhav Sooryavanshi: బుడ్డోడు కాదు.. మనసున్నోడు!

టీమిండియా టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ గొప్ప మనసు చాటుకున్నాడు. వయసులో చిన్న అయినా.. ఆలోచనలో మిన్న అని నిరూపించుకున్నాడు. 15 ఏళ్ల వయసులోనే గొప్ప పనికి శ్రీకారం చుట్టాడు. ఎక్స్‌ ఫ్లాట్‌ఫామ్ వేదికగా వచ్చే ఆదాయాన్ని నిరుపేద విద్యార్థుల కోసం ఖర్చు చేస్తానని ప్రకటించాడు.

ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్‌ పెట్టాడు. ముందుగా 'గొప్ప విషయాలు రాబోతున్నాయి.. ఇలాగే చూస్తూ ఉండండి'అని పోస్ట్ చేసిన వైభవ్.. ఆ తర్వాత అసలు విషయాన్ని వెల్లడించాడు.

అది ఇషాన్ భయ్యాకు తెలియదు.. భయపడుతూనే బౌలింగ్ ఇచ్చాడు: వైభవ్ సూర్యవంశీ

అది ఇషాన్ భయ్యాకు తెలియదు.. భయపడుతూనే బౌలింగ్ ఇచ్చాడు: వైభవ్ సూర్యవంశీ

'ఎక్స్ ఫ్లాట్‌ఫామ్ వేదికగా వచ్చే ఆదాయాన్ని అవసరమైన పేద విద్యర్థుల చదువుకు ఖర్చు చేయాలనుకుంటున్నా. అర్హత కలిగిన విద్యార్థులు సంప్రదించగలరు. స్కూల్, కాలేజీ సంబంధించి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నవారికి సాయంగా ఉంటా. నా సాయశక్తుల సాయం చేసేందుకు ప్రయత్నిస్తా.'అని వైభవ్ మరో పోస్ట్‌లో వెల్లడించాడు.

Vaibhav Sooryavanshi Says He Wants to Use X Payout to Support a Needy Student s Education

ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ.. నెటిజన్లు వైభవ్ సూర్యవంశీపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.'సిక్సర పిడుగే అనుకున్నాం.. మనసున్నోడివిరా బుడ్డోడా'అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇంత చిన్న వయసులోనే సేవ చేయాలనే ఆలోచన రావడం గొప్ప విషయమని కొనియాడుతున్నారు. కెరీర్‌లో మరింత గొప్ప స్థాయికి చేరి తన సాయాన్ని మరింత విస్తరించాలని కోరుకుంటున్నారు.

15 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసి యావత్ క్రికెట్ ప్రపంచం దృష్టిని తనవైపు తిప్పుకున్న వైభవ్.. టీమిండియా ముఖ చిత్రంగా ఎదుగుతున్నాడు. అతి త్వరలోనే అతను మూడు ఫార్మాట్లలో సచిన్, కోహ్లీ వారసత్వాన్ని కొనసాగించనున్నాడు.

ప్రస్తుతం ప్రతిష్టాత్మక దేశవాళీ టోర్నీ దులీప్ ట్రోఫీలో ఈస్ట్ జోన్‌కు వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న వైభవ్ సూర్యవంశీ.. నార్త్ ఈస్ట్ జోన్‌తో జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో విఫలమైనా బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. 4 బంతుల వ్యవధిలోనే రెండు వికెట్లు తీసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు.

4 బంతుల్లో 2 వికెట్లు.. బౌలింగ్‌లో అదరగొట్టిన వైభవ్ సూర్యవంశీ!

Also Read

4 బంతుల్లో 2 వికెట్లు.. బౌలింగ్‌లో అదరగొట్టిన వైభవ్ సూర్యవంశీ!

బెంగళూరులోని బీసీసీఐ సీఓఈ మైదానం వేదికగా ఆదివారం ప్రారంభమయ్యే సెమీఫైనల్లో సెంట్రల్ జోన్‌తో ఈస్ట్ జోన్‌ తలపడనుంది. ఈ మ్యాచ్‌కు వైభవ్ సూర్యవంశీ అన్ని విధాల సిద్దమయ్యాడు. కనీసం ఈ మ్యాచ్‌లోనైనా అతను బ్యాట్ ఝులిపించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Story first published: Saturday, August 29, 2026, 15:13 [IST]
Other articles published on Aug 29, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+