Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నాకు అచ్చొచ్చిన మైదానం.. నా సత్తా చూపిస్తా: వైభవ్ సూర్యవంశీ

జింబాబ్వేతో మూడు టీ20ల సిరీస్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నానని టీమిండియా టీనేజ్ సెన్సేషన్, యూనివర్సల్ బేబీ బాస్ వైభవ్ సూర్యవంశీ అన్నాడు. జింబాబ్వేలోని హరారే మైదానం తనకు అచ్చొచ్చినదని, అవకాశం వస్తే తన సత్తా చూపిస్తానని తెలిపాడు.

మూడు టీ20ల సిరీస్ కోసం టీమిండియా.. జింబాబ్వే పర్యటనకు వెళ్లింది. గురువారం హరారే వేదికగా జరిగే తొలి మ్యాచ్‌తో ఈ సిరీస్‌కు తెరలేవనుంది. ఇంగ్లండ్ పర్యటనలో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన వైభవ్ సూర్యవంశీ వరుసగా మూడు మ్యాచ్‌ల్లో 14, 13, 15 పరుగులే చేసి నిరాశపర్చాడు. దాంతో జింబాబ్వేతో సిరీస్‌లో సత్తా చాటాలని ఈ 15 ఏళ్ల కుర్రాడు ఉవ్విళ్లూరుతున్నాడు.

భారత్‌ను ఓడిస్తాం.. వైభవ్‌పై విమర్శలు సరికాదు: జింబాబ్వే కెప్టెన్

భారత్‌ను ఓడిస్తాం.. వైభవ్‌పై విమర్శలు సరికాదు: జింబాబ్వే కెప్టెన్

ఒడిదుడుకులు ఎదుర్కొన్నా..

ఈ సిరీస్ ప్రారంభం నేపథ్యంలో బుధవారం బీసీసీఐ టీవీతో మాట్లాడిన వైభవ్ సూర్యవంశీ.. ఈ సిరీస్ కోసం సిద్దమైనట్లు చెప్పాడు. ఐపీఎల్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశా. అయితే ఈ నాలుగు నెలల్లోనే నేను ఎన్నో ఒడిదొడుకులను చూశా. క్రికెట్‌లో ఇవన్నీ సహజమేనని తెలుసు. నా ప్రాక్టీస్‌ను మాత్రం ఆపలేదు. మళ్లీ ఎప్పుడు ఆడే అవకాశం వచ్చినా నా అత్యుత్త ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నిస్తా.

Vaibhav Sooryavanshi Says Harare is a very memorable ground to me ahead of India vs Zimbabwe T20I Series

క్రికెట్‌లో మనం అనుకున్నవన్నీ ఒక్కోసారి జరగకపోవచ్చు. కానీ అందుకోసం ప్రయత్నించడం మాత్రం ఆపకూడదు. తుది జట్టులో చోటు దొరక్కపోవడం నిరాశగానే ఉంటుంది. కానీ చుట్టూ ఉండే ఆటగాళ్లు మద్దతు ఇచ్చినప్పుడు మరింత ఎక్కువగా ప్రాక్టీస్ చేసి సిద్ధం కావాల్సిన అవసరం ఉంది.

బుడ్డోడికి బుద్దొచ్చింది.. నెట్స్‌లో చెమటోడుస్తున్న వైభవ్ సూర్యవంశీ! (వీడియో)

బుడ్డోడికి బుద్దొచ్చింది.. నెట్స్‌లో చెమటోడుస్తున్న వైభవ్ సూర్యవంశీ! (వీడియో)

నాకు అచ్చొచ్చిన మైదానం..

హరారే మైదానం నాకు అచ్చొచ్చిన గ్రౌండ్. ఈ మైదానం నాకు గుర్తుండిపోతుంది. నాలుగు నెలల క్రితమే ఇక్కడే అండర్ 19 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ ఆడి గెలిచాం. ఈ మైదానంలో నేను భారీ సెంచరీ చేశా. అందుకే నాకు ఇది ప్రత్యేకమైన గ్రౌండ్.

భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించడమనేది ఎప్పటికీ మధురమైన క్షణమే. మళ్లీ ఇక్కడికి రావడం సంతోషంగా ఉంది. నాకు ఇక్కడి పిచ్, వాతావరణంపై మంచి అవగాహన ఉంది. అవకాశం దస్తే తప్పకుండా మెరుగైన ప్రదర్శన చేస్తా. ఈ మైదానంలో నాకు మెరుగైన రికార్డ్ ఉంది.'అని వైభవ్ సూర్యవంశీ చెప్పుకొచ్చాడు.

Story first published: Wednesday, July 22, 2026, 16:38 [IST]
Other articles published on Jul 22, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+