నా కల నెరవేరింది.. వారికి రుణపడి ఉంటా: వైభవ్ సూర్యవంశీ
అంతర్జాతీయ క్రికెట్‌లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలవడం తన కల నెరవేరిన క్షణమని టీమిండియా టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ అన్నాడు. ఈ సిరీస్ తనకు ఎంతో ప్రత్యేకమని, ఒకేసారి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌తో పాటు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను గెలుచుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పాడు.
జింబాబ్వేతో మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా ఆదివారం జరిగిన ఆఖరి మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ(81) విధ్వంసకర బ్యాటింగ్‌తో భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ సిరీస్‌లో మూడు మ్యాచ్‌ల్లో రెండు హాఫ్ సెంచరీలతో 151 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌తో పాటు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను అందుకున్నాడు. ఈ అవార్డు స్వీకరించిన అనంతరం మాట్లాడిన వైభవ్ సూర్యవంశీ.. తన ప్రదర్శనపై ఆనందం వ్యక్తం చేశాడు. కెప్టెన్, కోచ్‌లు, జట్టులోని ఆటగాళ్లంతా ఎంతో మద్దతు ఇచ్చారని, వారికి రుణపడి ఉంటానని చెప్పుకొచ్చాడు.

వారి సహకారంతోనే..
'ఈ సిరీస్‌లో నా ప్రదర్శన పట్ల చాలా సంతోషంగా ఉంది. మేం హరారేకి వచ్చిన తర్వాత రెండు, మూడు రోజుల పాటు మా ప్రిపరేషన్ బాగా జరిగింది. నేను ఇక్కడే అండర్ 19 ప్రపంచకప్ ఆడాను. కాబట్టి ఈ వేదికలో ఆడటాన్ని నేను బాగా ఆస్వాదించాను. కెప్టెన్, కోచ్‌లు, సహచర ఆటగాళ్లంతా నాకు మద్దతు ఇచ్చారు. వారి సహకారంతోనే నేను రాణించాను. అందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను.
టీ20 క్రికెట్‌లో నా ఆట తీరు ఎలా ఉంటుందో.. ఈ సిరీస్‌లో కూడా అలాగే ఆడాను. జట్టు కోసం నా సహజమైన ఆటను ఆడటానికి ప్రయత్నించాను. మూడు మ్యాచ్‌ల్లో జట్టుకు మెరుగైన ఆరంభం ఇవ్వాలని ప్రయత్నించాను. నాకు మంచి ఆరంభం లభిస్తే.. ఇన్నింగ్స్‌ను మరింత ముందుకు తీసుకెళ్లాలని అనుకున్నాను. ఇదే నా విధానం.
అదే నా సక్సెస్ సీక్రెట్..
ప్రాక్టీస్‌లో నేను ఏ షాట్లు అయితే ప్రాక్టీస్ చేస్తానో.. అవే షాట్లను మ్యాచ్‌లోనూ అమలు చేయడానికి ప్రయత్నిస్తాను. అదే నా సక్సెస్ సీక్రెట్. భారత్ తరఫున ఒకేసారి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులను గెలవడం చాలా సంతోషంగా ఉంది. ఇది నిజంగా నా కల నెరవేరిన క్షణం.'అని వైభవ్ సూర్యవంశీ చెప్పుకొచ్చాడు.
భారత్‌దే సిరీస్ ..
మూడో టీ20లో భారత్ 35 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్‌ను 3-0 క్లీన్ స్వీప్ చేసింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 192 పరుగులు చేసింది. వైభవ్ సూర్యవంశీ(49 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్స్‌లతో 81) విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగగా.. ఇషాన్ కిషన్(29), శ్రేయస్ అయ్యర్(27), రింకూ సింగ్(25) పర్వాలేదనిపించారు.
అనంతరం జింబాబ్వే 20 ఓవర్లలో 7 వికెట్లకు 157 పరుగులే చేసి ఓటమిపాలైంది. ర్యాన్ బర్ల్(43 బంతుల్లో 5 ఫోర్లతో 54 నాటౌట్) హాఫ్ సెంచరీతో రాణించగా.. వెస్లీ మధవెరె(28) పర్వాలేదనిపించాడు. భారత బౌలర్లలో మయాంక్ యాదవ్(3/29) మూడు వికెట్లు తీయగా.. యశ్ ఠాకూర్(2/45) రెండు వికెట్లు పడగొట్టాడు. అశోక్ శర్మ, రవి బిష్ణోయ్ తలో వికెట్ తీసారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

