Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నా ఫేవరేట్ టెన్నిస్ ప్లేయర్ అతనే: వైభవ్ సూర్యవంశీ

రఫెల్ నాదల్, నోవాక్ జకోవిచ్ తన ఫేవరేట్ టెన్నిస్ ప్లేయర్స్ అని టీమిండియా టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ తెలిపాడు. గత ఐదారేళ్లుగా టెన్నిస్‌ను ఫాలో అవుతున్నానని ఈ 15 ఏళ్ల బిహార్ క్రికెటర్ చెప్పుకొచ్చాడు.

ఆదివారం జరిగిన వింబుల్డన్ ఫైనల్ మ్యాచ్‌కు అభిషేక్ శర్మ, సంజూ శాంసన్‌లతో కలిసి వైభవ్ సూర్యవంశీ హాజరయ్యాడు. స్పెషల్‌ లుక్‌లో మెరిసిన వైభవ్ సూర్యవంశీ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ ఫైనల్ సందర్భంగా అధికారిక బ్రాడ్‌కాస్టర్‌తో మాట్లాడిన వైభవ్ సూర్యవంశీ.. అభిషేక్ శర్మనే తనను ఈ మ్యాచ్‌కు తీసుకొచ్చాడని, ఈ స్టైలిష్‌ లుక్ వెనుక కూడా అతనే ఉన్నాడని తెలిపాడు. ఈ సందర్భంగా ఫేవరేట్ టెన్నిస్ ప్లేయర్స్ ఎవరని అడగ్గా.. నాదల్, జకోవిచ్ పేర్లు చెప్పాడు.

IND vs ENG: కన్నీళ్లు పెట్టుకున్న బుడ్డోడు! (వీడియో)

IND vs ENG: కన్నీళ్లు పెట్టుకున్న బుడ్డోడు! (వీడియో)

మరిచిపోలేని అనుభూతి..

'వింబుల్డన్ ఫైనల్‌ మ్యాచ్‌‌‌ను ప్రత్యక్షంగా చూడటం మరిచిపోలేని అనుభూతి. అత్యంత ఒత్తిడి సమాయల్లో ఆటగాళ్లు ఎలా వ్యవహరిస్తారనే విషయాన్ని ఈ మ్యాచ్‌లో గమనించా. నాకు టెన్నిస్‌లో రఫేల్ నాదల్, జకోవిచ్ అంటే చాలా ఇష్టం. టైమ్ దొరికితే వారిద్దరి ఆటను చూస్తూ ఉంట. గత ఐదారేళ్లుగా టెన్నిస్‌ను ఫాలో అవుతున్నా. వింబుల్డన్ ఫైనల్లో సినర్ గెలుస్తాడని నేను ముందే ఊహించా.

Vaibhav Sooryavanshi Reveals His Favourite Tennis Stars During Wimbledon 2026 Final Video Goes viral

ఈ టోర్నీ ఆసాంతం అతను అద్బుత ప్రదర్శన కనబర్చాడు. ఈ మ్యాచ్‌ను చూసేందుకు వస్తానని అనుకోలేదు. కానీ, అభిషేక్ శర్మ సాయంతో ఇక్కడికి వచ్చా. నా ప్రయాణ ఏర్పాట్లు అన్ని అతనే చేశాడు. ఈ స్టైలిష్ లుక్ వెనుక కూడా అతనే ఉన్నాడు.'అని వైభవ్ సూర్యవంశీ చెప్పుకొచ్చాడు.

గంభీర్.. నువ్వేంటో.. నీ విధానం ఏంటో అస్సలు అర్థం కాదు! పాపం బుడ్డోడు!

గంభీర్.. నువ్వేంటో.. నీ విధానం ఏంటో అస్సలు అర్థం కాదు! పాపం బుడ్డోడు!

బుడ్డోడిని కలవడం సంతోషంగా ఉంది..

భారత దిగ్గజ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ కూడా ఈ మ్యాచ్‌కు హాజరయ్యాడు. వైభవ్ సూర్యవంశీతో పాటు తన శిష్యుడు అభిషేక్ శర్మతో కలిసి యువరాజ్ సింగ్ మాట్లాడాడు. వైభవ్ సూర్యవంశీని కలవడం తనకు చాలా సంతోషంగా ఉందని, అతన్ని కలవడం ఇదే తొలిసారని యువరాజ్ సింగ్ చెప్పుకొచ్చాడు. వైభవ్ బౌలర్లకు బాస్ అయిపోయాడని, దాంతోనే అందరూ అతన్ని బేబీ బాస్ అంటున్నారని ప్రశంసించాడు.

ఐపీఎల్‌లో సంచలన ప్రదర్శనతో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన వైభవ్.. తన రాకను ఘనంగా చాటుకోలేకపోయాడు. ఇంగ్లండ్‌తో మాంచెస్టర్ వేదికగా జరిగిన రెండో టీ20తో అరంగేట్రం చేసిన వైభవ్.. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో విఫలమయ్యాడు. దాంతో ఆఖరి టీ20లో చోటు కోల్పోయాడు. ఈ సిరీస్‌లో టీమిండియా దారుణంగా విఫలమైంది. 0-4తో క్లీన్ స్వీప్ అయ్యింది.

సినర్‌దే టైటిల్...

వింబుల్డన్ ఫైనల్లో జర్మనీ స్టార్ అలెగ్జాండర్ జ్వెరెవ్‌ను డిఫెండింగ్ ఛాంపియన్, ఇటలీ ప్లేయర్ యానిక్ సినర్ ఓడించాడు. హోరాహోరీగా సాగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో సినర్ 6-7(7-9), 7-6(7-2), 6-3. 6-4తో జ్వెరెవ్‌పై విజయం సాధించాడు. సినర్ కెరీర్‌లో ఇది ఐదో గ్రాండ్‌స్లామ్ టైటిల్.

Story first published: Monday, July 13, 2026, 13:10 [IST]
Other articles published on Jul 13, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+