నా ప్రధాన లక్ష్యం.. 6 బంతుల్లో 6 సిక్స్‌లు: వైభవ్ సూర్యవంశీ
6 బంతుల్లో 6 సిక్స్‌లు కొట్టడమే తన ప్రధాన లక్ష్యమని టీమిండియా టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ తెలిపాడు. వెస్టిండీస్‌తో టీ20 సిరీస్ ప్రారంభానికి ముందు స్టార్ స్పోర్ట్స్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న వైభవ్ సూర్యవంశీ.. తన మనసులో ఉన్న 6 లక్ష్యాలను వెల్లడించాడు.
ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోలో తన భవిష్యత్ లక్ష్యాలు, డ్రీమ్ సాధనల గురించి ఎలాంటి భయం లేకుండా మాట్లాడాడు. తన లక్ష్యాలకు సంబంధించిన ఆప్షన్స్‌ను ముందు పెట్టగా.. ఒక్కొక్కటి సెలెక్ట్ చేశాడు.
ఫస్ట్ ఛాయిస్.. ఓవర్‌కి ఆరు సిక్సర్లు
6 బంతుల్లో 6 సిక్స్‌లు కొట్టడం తన మొదటి లక్ష్యమని వైభవ్ సూర్యవంశీ పేర్కొన్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ బాదడం రెండో ఆప్షన్‌గా ఎంచుకున్నాడు. క్రికెట్ చరిత్రలోనే భారీ సిక్సర్ బాదడం మూడో ఆప్షన్‌గా ఉంచాడు. భారత్ తరఫున టీ20ల్లో అత్యధిక సెంచరీలు బాదడాన్ని నాలుగో ఆప్షన్‌గా ఎంచుకున్న వైభవ్.. ఉత్కంఠగా సాగే మ్యాచ్‌లో ఆఖరి బంతిని సిక్స్ కొట్టి గెలిపించడాన్ని ఐదో ఆప్షన్‌గా ఎంచుకున్నాడు.

క్రికెట్ చరిత్రలోనే గుర్తుండిపోయే అద్భుతమైన క్యాచ్ పట్టడం తన ఆరో లక్ష్యమని స్పష్టం చేశాడు. 15 ఏళ్ల వయసులోనే విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగుతున్న వైభవ్ సూర్యవంశీ యావత్ క్రికెట్ ప్రపంచాన్ని తనవైపు తిప్పుకున్నాడు. తన విధ్వంసకర ఆటతో అబ్బూరపరుస్తున్నాడు. అతను ఇదే జోరు కొనసాగిస్తే.. ఈ 6 లక్ష్యాలను కూడా అతి త్వరలోనే నెరవేర్చుతాడని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.
ఇప్పటివరకు 8 అంతర్జాతీయ టీ20లు ఆడిన వైభవ్.. రెండు హాఫ్ సెంచరీలు సాధించాడు. తన తొలి అంతర్జాతీయ సెంచరీ కోసం ఎదురుచూస్తున్నాడు. ఐపీఎల్‌లో మాత్రం ఇప్పటికే 3 సెంచరీలు బాదేసాడు.
తుది జట్టులో చోటు లేదు..
వెస్టిండీస్‌తో నేడు జరిగే తొలి టీ20 మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ బరిలోకి దిగే అవకాశాలు లేవు. సంజూ శాంసన్, అభిషేక్ శర్మ ఓపెనింగ్ జోడీని కొనసాగించాలని టీమిండియా మేనేజ్‌మెంట్ నిర్ణయించింది. ఇటీవల ముగిసిన ఆసియా గేమ్స్ 2026 ఫైనల్లో పాకిస్థాన్‌పై గెలిచి పసిడి పతకం సాధించిన భారత జట్టులో వైభవ్ ఉన్నాడు. కానీ వెస్టిండీస్‌తో తొలి టీ20లో టీమ్ కాంబినేషన్‌లో భాగంగా వైభవ్‌ను ఆడించే పరిస్థితి లేదు. దాంతో అతను బెంచ్‌కే పరిమితమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
