Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs SL: శ్రీలంక ఆటగాళ్లతో వైభవ్ సూర్యవంశీ కొట్లాట!(వీడియో)

టీమిండియా టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ సహనం కోల్పోయాడు. శ్రీలంక ఏ ఆటగాళ్లతో వాగ్వాదానికి దిగాడు. ముక్కోణపు వన్డే సిరీస్‌లో భాగంగా దంబుల్లా వేదికగా సోమవారం జరిగిన మ్యాచ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. సూపర్ ఓవర్‌కు దారి తీసిన ఈ మ్యాచ్‌లో భారత్ 6 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌తో పాటు సూపర్ ఓవర్‌లో‌నూ వైభవ్ సూర్యవంశీ విఫలమయ్యాడు.

సూపర్ ఓవర్ ముగిసిన అనంతరం శ్రీలంక ప్లేయర్లపైకి వైభవ్ సూర్యవంశీ కోపంగా దూసుకెళ్లాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. శ్రీలంక టీమ్‌లోని ఓ ఫీల్డర్‌.. వైభవ్ సూర్యవంశీని ఏదో అనడంతో అతను తీవ్ర ఆగ్రహానికి గురైనట్లు తెలుస్తోంది. శ్రీలంక వికెట్ కీపర్ డిక్‌వెల్లా వారిని శాంతింపజేశారు. ఆ తర్వాతా వైభవ్ లంక ఆటగాళ్లను కోపంగా చూస్తూ.. ఏదో అంటూ పెవిలియన్‌కు వెళ్లారు. అయితే కాసేపటికి ఇరు జట్లు షేక్‌హ్యాండ్స్ ఇచ్చుకున్నాయి.

Vaibhav Sooryavanshi Pushes Sri Lanka A Player in Heated Altercation After Super Over Defeat
Photo Credit: X (twitter)

అర్షద్ ఖాన్ వేసిన సూపర్ ఓవర్‌లో శ్రీలంక 16 పరుగులు చేసింది. అవిష్కా ఫెర్నాండో సిక్సర్ బాది భారీ స్కోర్ అందించాడు. నాలుగు బంతులు కట్టడిగా వేసిన అర్షద్ ఖాన్.. ఐదో బంతికి సిక్సర్ ఇచ్చుకున్నాడు. అనంతరం భారత్-ఏ సూపర్ ఓవర్‌లో 10 పరుగులే చేసి ఓటమిపాలైంది. వరుసగా మూడు బంతులాడిన సూర్యాన్ష్ షెడ్గే మూడు పరుగులే చేశాడు. ఒక్క బౌండరీ కొట్టలేకపోయాడు. చివరి మూడు బంతుల్లో వైభవ్ కూడా ఒక్క సిక్సర్ కూడా బాదలేకపోయాడు. ఒకే ఒక బౌండరీ బాదాడు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ ఏ 49.2 ఓవర్లలో 265 పరుగులకు ఆలౌటైంది. సూర్యన్ష్ షెడ్గే(66 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 72), విప్రజ్ నిగమ్(49 బంతుల్లో 6 ఫోర్లతో 51) హాఫ్ సెంచరీలతో రాణించారు. వైభవ్ సూర్యవంశీ(21), ప్రభ్‌సిమ్రాన్ సింగ్(11), రుతురాజ్ గైక్వాడ్(37), తిలక్ వర్మ(23), ఆయుష్ బదోని(15), నిషాంత్ సింధు(6) దారుణంగా విఫలమయ్యారు. శ్రీలంక ఏ బౌలర్లలో మహమ్మద్ షిరాజ్(3/33), విజయ్‌కాంత్(3/26) మూడేసి వికెట్లు తీయగా.. సహాన్, వనుజ సహన్, మతులన్ తలో వికెట్ తీసారు.

అనంతరం శ్రీలంక-ఏ కూడా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 265 పరుగులే చేసింది. సదీర సమరవిక్రమా(113 బంతుల్లో 7 ఫోర్లతో 93) తృటిలో శతకం చేజార్చుకోగా.. నిరోషన్ డిక్‌వెల్లా(37), వానుజ సాహన్(25) పర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో ఆయుష్ బదోని 2 వికెట్లు తీయగా.. అర్షద్ ఖాన్, నిషాంత్ సింధు, విప్రజ్ నిగమ్, అనుకూల్ రాయ్, సూర్యాన్ష్ షెడ్గే తలో వికెట్ తీసారు.

Story first published: Monday, June 15, 2026, 19:36 [IST]
Other articles published on Jun 15, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+