Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బుమ్రా బౌలింగ్.. అంత భీకరంగా ఏం లేదు: వైభవ్ సూర్యవంశీ (వీడియో)

ముంబై ఇండియన్స్ స్టార్ పేసర్, యార్కర్ల కింగ్ జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్ అంత భీకరంగా ఏం లేదని రాజస్థాన్ రాయల్స్ టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ తెలిపాడు. తాను బౌలర్ కంటే ఎక్కువగా బంతిపైనే ఫోకస్ పెట్టడానికి ప్రయత్నించానని వెల్లడించాడు.

ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా మంగళవారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ 15 ఏళ్ల సిక్సర పిడుగు విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగిన విషయం తెలిసిందే. తన కెరీర్‌లోనే తొలిసారి జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్‌ను ఎదుర్కొన్న వైభవ్ సూర్యవంశీ ఎలాంటి భయం లేకుండా తొలి మూడు బంతుల్లోనే రెండు భారీ సిక్స్‌లు బాదాడు. వైభవ్ ధాటికి వరల్డ్ బెస్ట్ పేసర్ అయిన బుమ్రా నోరెళ్ల బెట్టాడు.

Vaibhav Sooryavanshi Opens Up on Facing Legend Bumrah The Secret Behind His Calm Batting
Photo Credit: screen grab for RR X Video

5 సిక్స్‌లతో..

వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ (14 బంతుల్లో ఫోర్, 5 సిక్స్‌లతో 39), యశస్వి జైస్వాల్(32 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్స్‌లతో 77 నాటౌట్) విధ్వంసకర బ్యాటింగ్‌తో ముంబై ఇండియన్స్ నుంచి మ్యాచ్‌ను లాగేసుకున్నారు. దాంతో రాజస్థాన్ రాయల్స్ 27 పరుగుల తేడాతో విజయం సాధించింది.

ఈ మ్యాచ్ అనంతరం రాజస్థాన్ రాయల్స్ సోషల్ మీడియా టీమ్‌తో మాట్లాడిన వైభవ్ సూర్యవంశీ.. బుమ్రా బౌలింగ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బుమ్రా బౌలింగ్‌లో కొంత కంగారుపడినా.. తనకు అలవాటైన రీతిలో బంతిని చూసి బాదనని చెప్పాడు.

అంత భీకరంగా ఏం లేదు..

'జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్ అంత భీకరంగా అనిపించలేదు. నేను బౌలర్ కంటే ఎక్కువగా బంతిని చూసి బాదేందుకే ప్రయత్నించాను. బుమ్రాను చూడగానే కాస్త కంగారుపడ్డాను. కానీ నా సహజసిద్దమైన ఆటపై నమ్మకం ఉంచి.. బౌలర్ కంటే బంతిని మాత్రమే చూసి ఆడాను.

మ్యాచ్‌కు ముందు నిర్వహించే ప్రాక్టీస్ సెషన్స్ మాకు చాలా ఉపయోగపడుతాయి. ఎందుకంటే త్రోడౌన్ స్పెషలిస్ట్‌లు చాలా తక్కువ దూరం నుంచి బంతులను వేగంగా విసురుతారు. దానివల్ల అసలు మ్యాచ్‌లో బౌలర్‌ను ఎదుర్కొనేటప్పుడు మాకు బంతిని చూసి ఆడటానికి అదనపు సమయం దొరుకుతుంది.

నా బ్యాటింగ్‌ లోపాలను సరి చేసుకున్నా..

గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్ తర్వాత నా బ్యాటింగ్‌లో ఒకటి, రెండు లోపాలు ఉన్నాయనిపించింది. వాటిపై ఫోకస్ పెట్టాలని నిర్ణయించుకున్నా. అందుకే ముంబైతో మ్యాచ్‌కు ముందు త్వరగా ప్రాక్టీస్‌కు వెళ్లాను. ఆ ప్రాక్టీస్ సెషన్‌ నా బ్యాటింగ్‌కు సహాయపడింది.

గత రెండు ఇన్నింగ్స్‌ల్లో మంచి షాట్లు ఆడినప్పటికీ నేను ఔట్ అవుతూ వచ్చాను. తొలి మ్యాచ్‌లో కూడా అది మంచి షాటే. కానీ నేరుగా ఫీల్డర్ చేతుల్లోకి వెళ్ళింది. ముంబైతో మ్యాచ్‌లో గనుక నేను ఇన్నింగ్స్ మొత్తం ఆడి ఉంటే.. స్కోరు ఇంకా భారీగా ఉండేది'అని వైభవ్ సూర్యవంశీ చెప్పుకొచ్చాడు.

Story first published: Thursday, April 9, 2026, 20:15 [IST]
Other articles published on Apr 9, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+