Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆడు మగాడ్రా బుజ్జి.. 15 ఏళ్లకే రూ.10 కోట్లు ఎనకేసాడు!

టీమిండియా టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ వరల్డ్ క్రికెట్‌లో వండర్ కిడ్‌గా మారాడు. బీహార్‌కు చెందిన ఈ 15 ఏళ్ల లెఫ్టార్మ్ బ్యాటర్.. అద్వితీయమైన ప్రదర్శనతో యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. చిన్న వయసులోనే దేశవాళీ క్రికెట్ ఆడటంతో పాటు వరల్డ్ బెస్ట్ లీగ్ ఐపీఎల్‌లో సంచలన ప్రదర్శన కనబర్చాడు.

వరల్డ్ బెస్ట్ ప్లేయర్లను వెనక్కి నెట్టి ఐపీఎల్ 2026 సీజన్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచి ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు. ముఖ్యంగా అతని ఫియర్ లెస్ గేమ్ మాజీ క్రికెటర్లతో పాటు ప్రస్తుత స్టార్ ఆటగాళ్లను, అభిమానులను వీపరీతంగా ఆకట్టుకుంది. సచిన్, కోహ్లీ తరహాలో పాపులారిటీ సొంతం చేసుకున్న వైభవ్ సూర్యవంశీ.. చిన్న వయసులోనే కోట్లు సంపాదిస్తున్నాడు.

నేను అతని మాట మాత్రమే వింటాను: తిలక్ వర్మ

నేను అతని మాట మాత్రమే వింటాను: తిలక్ వర్మ

రేట్లు పెంచేసిన బుడ్డోడు..

ఐపీఎల్ 2026 సీజన్‌తో వచ్చిన క్రేజ్‌ను క్యాష్ చేసుకునే పనిలో వైభవ్ సూర్యవంశీ పడ్డాడు. తన ఎండార్స్‌మెంట్ రేట్లను డబుల్ చేశాడు. ఐపీఎల్‌కు ముందు రూ. కోటి రూపాయాలు వసూలు చేసిన వైభవ్ సూర్యవంశీ.. ఆ ధరను ఇప్పుడు రెట్టింపు చేసి రూ. 2 కోట్లు అడుగుతున్నాడని అడ్వర్టైజ్‌మెంట్ రంగ నిపుణులు పేర్కొన్నారు.

Vaibhav Sooryavanshi Net Worth A Closer Look at the Finances of the 15-Year-Old Indian Cricket Sensation

వైభవ్ సూర్యవంశీ కెరీర్ ఆరంభంలోనే ఉండటంతో అతని నెట్‌వర్త్‌పై సరైన లెక్కలు లేనప్పటికీ.. మార్కెట్ అంచనాల ప్రకారం రూ.10 కోట్లు ఉంటుందని సమాచారం. 15 ఏళ్ల వయసులోనే ఈ కుర్రాడు తన బ్యాటింగ్‌తో రూ.10 కోట్లు ఆర్జించాడనే వార్తు ఇప్పుడు నెటిజన్లు అవాక్కయ్యేలా చేస్తోంది. సాధారణంగా 15 ఏళ్ల వయసులో అందరూ 10వ తరగతి పరీక్ష పాసై.. తర్వాత ఏం చేయాలని ఆలోచిస్తారు. కానీ వైభవ్ మాత్రం టీమిండియాకు ఆడేందుకు రెడీ అయ్యాడు.

బ్రాండ్ అంబాసిడర్‌గా..

ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ ఇచ్చే రూ.1.10 కోట్లు వైభవ్ సూర్యవంశీకి ప్రధాన ఆదాయం కాగా.. డొమెస్టిక్ క్రికెట్ మ్యాచ్ ఫీజులు, భారత అండర్ 19, భారత్-ఏ జట్ల తరఫున వచ్చే మ్యాచ్ ఫీజులు, అలవెన్సులు ఇతర ఆదాయ మార్గాలు. అయితే ఇటీవల వైభవ్ సూర్యవంశీ పలు ఉత్పత్తులకు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నాడు. 'కాంప్లాన్' 'రెడ్ బుల్' వంటి ప్రముఖ బ్రాండ్‌లను ప్రమోట్ చేస్తున్నాడు. ఇప్పటికే చాలా కంపెనీలు అతని కోసం క్యూ కట్టినట్లు వార్తలు వస్తున్నాయి. భవిష్యత్తులో వైభవ్ సూర్యవంశీ నెట్ వర్త్ పదింతలు పెరిగే అవకాశం ఉంది.

ప్రస్తుతానికి వైభవ్ సూర్యవంశీకి ఎలాంటి కార్లు లేవు. అతని వయసు 15 ఏళ్లే కావడం.. డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవడంతో వైభవ్ ఫ్యామిలీ అతని పేరిట ఎలాంటి కార్లను కొనుగోలు చేయలేదు. ప్రస్తుతం అతని కుటుంబం సాధారణ మధ్యతరగతి కుటుంబాలు వాడే కార్లను మాత్రమే ఉపయోగిస్తుంది.

ఇంకా స్థిరాస్తులు కొనలేదు..

వైభవ్ సూర్యవంశీ స్వస్థలం బీహార్‌లోని సమస్తిపూర్ జిల్లా. ప్రస్తుతం అతని కుటుంబం సమస్తిపూర్‌లో తమ సొంత ఇంట్లోనే నివసిస్తోంది. వైభవ్ శిక్షణ కోసం వారి కుటుంబం కొంతకాలం పాట్నాలో ఉంది. ప్రస్తుతానికి స్థిరాస్తుల రూపంలో భారీ ఇన్వెస్ట్‌మెంట్లు ఏవీ లేవు. కానీ వైభవ్ తండ్రి సంజీవ్ సూర్యవంశీ పర్యవేక్షణలో ఆర్థిక ప్రణాళికలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. 15 ఏళ్లకే 10 కోట్లు సంపాదించడంతో ఆడు మగాడ్రా బుజ్జి అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

ఈ కాలపు భీష్ముడు భయ్యా.. బుడ్డోడి ఇన్‌స్టా సీక్రెట్ లీక్!

ఈ కాలపు భీష్ముడు భయ్యా.. బుడ్డోడి ఇన్‌స్టా సీక్రెట్ లీక్!
Story first published: Friday, June 5, 2026, 17:16 [IST]
Other articles published on Jun 5, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+