Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Vaibhav Sooryavanshi: పాపం బుడ్డోడు.. లక్ కలిసొచ్చినా..!(వీడియో)

రాజస్థాన్ రాయల్స్ టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ మరో విధ్వంసకర ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో తృటిలో శతకాన్ని చేజార్చుకున్నాడు.

రనౌట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నా.. శతకాన్ని అందుకోలేకపోయాడు. 38 బంతుల్లో 7 ఫోర్లు, 10 సిక్స్‌లతో 93 పరుగులు చేసి మోహ్‌సిన్ ఖాన్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. 221 పరుగుల భారీ లక్ష్యఛేదనలో వైభవ్ సూర్యవంశీ తనదైన శైలిలో చెలరేగాడు.

Vaibhav Suryavanshi Misses Out on Century Despite Surviving a Drama-Filled Run-Out in RR vs LSG Clash

23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న వైభవ్ సూర్యవంశీ.. మరో 15 బంతుల వ్యవధిలోనే 93 పరుగుల మార్క్ అందుకున్నాడు. అయితే మోహ్‌సిన్ ఖాన్ వేసిన 13వ ఓవర్ తొలి బంతికి వైభవ్ సూర్యవంశీ రనౌటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.

ఈ బంతిని ధ్రువ్ జురెల్ బ్యాక్‌వార్డ్ దిశగా ఆడగా.. నాన్ స్ట్రైకర్‌లో ఉన్న సూర్యవంశీ సింగిల్ కోసం ప్రయత్నించాడు. బంతిని అందుకున్న దిగ్వేష్ రాఠి బంతిని మోహ్‌సిన్ ఖాన్‌కు ఇవ్వగా.. అతను వికెట్లకు బంతి కొట్టడంలో విఫలమయ్యాడు.

దాంతో వైభవ్ సూర్యవంశీ ఊపిరి పీల్చుకున్నాడు. కానీ ఇదే ఓవర్ ఆఖరి బంతికి భారీ షాట్స్ ఆడబోయి క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. దాంతో వైభవ్ సూర్యవంశీ శతకం చేజారింది. సెంచరీ మిస్సైనా లక్నోకు చేయాల్సిన నష్టం వైభవ్ చేశాడు. అంతేకాకుండా అత్యధిక పరుగుల వీరుడిగా ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు.

Story first published: Tuesday, May 19, 2026, 23:22 [IST]
Other articles published on May 19, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+