టెస్ట్‌ల్లోనూ వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. 7 సిక్స్‌లతో వీరవిహారం!
టీమిండియా టీనేజ్ సెన్సేష్ వైభవ్ సూర్యవంశీ(81 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్స్‌లతో 92) తన దూకుడు కొనసాగించాడు. ఫార్మాట్ ఏదైనా డోంట్ కేర్ అన్నట్లు చెలరేగాడు. రెడ్ బాల్ క్రికెట్‌లోనూ దూకుడైన బ్యాటింగ్‌తో పరుగులు రాబట్టాడు.
ప్రతిష్టాత్మక దేశవాళీ టోర్నీ దులీప్ ట్రోఫీ 2026లో ఈస్ట్ జోన్‌కు వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న వైభవ్ సూర్యవంశీ.. ఈస్ట్ జోన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 7 ఫోర్లు 7 సిక్స్‌లతో వీరవిహారం చేశాడు. కానీ తృటిలో శతకాన్ని చేజార్చుకున్నాడు.
సెహ్వాగ్ తరహాలో..
బెంగళూరులోని బీసీసీఐ సీఓఈ మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన వైభవ్ సూర్యవంశీ.. వన్డే తరహా బ్యాటింగ్‌తో బౌలర్లపై విరుచుకుపడ్డాడు. తన ఫియర్‌లెస్ బ్యాటింగ్‌తో మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌ను తలపించాడు. తనకే సాధ్యమైన భారీ సిక్సర్లతో బౌలర్లకు చుక్కలు చూపించాడు. 42 బంతుల్లోనే 5 ఫోర్లు, 6 సిక్స్‌లతో అర్ధశతకం పూర్తి చేసుకున్న వైభవ్.. ఫాస్టెస్ట్ సెంచరీ దిశగా సాగాడు.

సారాన్ష్ జైన్ బౌలింగ్‌లో వరుసగా ఫోర్, సిక్స్ బాదిన వైభవ్ సూర్యవంశీ.. 90 పరుగుల మార్క్‌ను అందుకున్నాడు. కానీ హర్ష్‌దూబే వేసిన మరుసటి ఓవర్‌లో మరో భారీ షాట్ ఆడే ప్రయత్నంలో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. దాంతో వైభవ్ సూర్యవంశీ అద్భుత ఇన్నింగ్స్‌కు తెరపడింది.
సెంచరీ మిస్సైనా..
అయితే 40 పరుగుల వద్ద వైభవ్ సూర్యవంశీ ఇచ్చిన క్యాచ్‌ను సెంట్రల్ జోన్ ఫీల్డర్లు వదిలేసారు. ఈ అవకాశంతో వైభవ్ సూర్యవంశీ రెచ్చిపోయాడు. కానీ ఆ అవకాశాన్ని సెంచరీగా మల్చలేకపోయాడు. ఈ మ్యాచ్‌లో సెంచరీ చేయకపోయినా.. రెడ్ బాల్ క్రికెట్‌లో ఆడే సత్తా తనకు ఉందని వైభవ్ సూర్యవంశీ చాటి చెప్పాడు. ఇదే తరహా దూకుడు కనబరిస్తే అతి త్వరలోనే వైభవ్ ఓపెనర్‌గా టీమిండియాలోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు.
మరోవైపు అభిమన్యు ఈశ్వరన్ కూడా అతనికి అండగా నిలిచాడు. 70 బంతుల్లో అతను 7 ఫోర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దాంతో ఈస్ట్ జోన్ 161 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. వైభవ్ ఔటైన వెంటనే.. కుమార్ కుశాగ్ర గోల్డెన్ డక్‌గా పెవిలియన్ చేరాడు. సుదీప్ కుమార్‌తో కలిసి అభిమన్యు ఈశ్వరన్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపిస్తున్నాడు.
సెంట్రల్ జోన్ 266 ఆలౌట్..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సెంట్రల్ జోన్.. 80.1 ఓవర్లలో 266 పరుగులకు ఆలౌటైంది. రింకూ సింగ్(88 బంతుల్లో 8 ఫోర్లతో 60) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించగా.. ఆర్య జుయల్(113 బంతుల్లో 6 ఫోర్లతో 46) హాఫ్ సెంచరీ చేజార్చుకున్నాడు. ఈస్ట్ జోన్ బౌలర్లలో ముఖేష్ కుమార్(3/56), అభిజిత్ సర్కార్(3/38) మూడేసి వికెట్లు తీయగా.. మహమ్మద్ షమీ, మహమ్మద్ కౌనైన్ రెండేసి వికెట్లు పడగొట్టారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

