IND vs IRE: వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం ఆలస్యం!
టీమిండియా టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ అరంగేట్రం ఆలస్యమయ్యే అవకాశం ఉంది. జూన్ 26 నుంచి ఐర్లాండ్‌తో జరిగే రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్ నిర్వహణపై సస్పెన్స్ నెలకొంది. ప్రస్తుతం ఐర్లాండ్‌లో కమ్యూనిటీ అల్లర్లు, ఘర్షణలు నెలకొన్నాయి. వలసదారులకు వ్యతిరేకంగా అక్కడి జనాలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు.
ఈ ఘర్షనల నేపథ్యంలో ఇప్పటికే కొన్ని లోకల్ క్రీడా టోర్నీలను రద్దు చేశారు. లిస్బర్న్ వేదికగా జరగాల్సిన 'ఇంటర్-ప్రొవిన్షియల్ టీ20 ఫెస్టివల్' అనే లోకల్ క్రికెట్ టోర్నీని కూడా క్రికెట్ ఐర్లాండ్ తాత్కాలికంగా రద్దు చేసింది.
మ్యాచ్ వేదికలకు సమీపంలోనే..
జూన్ 26, 28 తేదీల్లో ఐర్లాండ్‌తో భారత్ రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడాల్సి ఉంది. ఈ రెండు మ్యాచ్‌లు నార్తర్న్ ఐర్లాండ్ రాజధాని బెల్ఫాస్ట్‌లోని స్టోర్‌మాంట్ క్రికెట్ గ్రౌండ్లో జరగాల్సి ఉంది. అయితే ప్రస్తుతం అల్లర్లు జరుగుతున్న ప్రాంతాలకు ఈ వేదిక దగ్గరగా ఉండటంతో ఆటగాళ్ల భద్రతపై ఆందోళన నెలకొంది. ఒకవేళ అక్కడి పరిస్థితులు అదుపులోకి రాకపోతే.. సిరీస్ వాయిదే పడే ప్రమాదం ఉంది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కూడా అక్కడి పరిస్థితులను నిశితంగా గమనిస్తోంది.

భద్రతే మాకు ముఖ్యం..
ప్రస్తుతం తమ దేశంలో నెలకొన్ని అల్లర్ల నేపథ్యంలో షెడ్యూల్‌పై 48 గంటల్లో అప్‌డేట్ ఇస్తామని ఐర్లాండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. 'ప్రస్తుతం అల్లర్లు జరుగుతున్న ప్రాంతాల్లోని పరిస్థితులను మేం నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. స్థానిక అధికారులు, ప్రొవిన్షియల్ యూనియన్లతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాం. మాకు ఆటగాళ్లు, కోచ్‌లు, మ్యాచ్ అధికారులు, అభిమానుల భద్రతే అత్యంత ముఖ్యం.'అని ఐర్లాండ్స్ ఎక్స్ వేదికగా పేర్కొంది.
ఆదివారం జరగబోయే స్థానిక క్రికెట్ మ్యాచ్‌ల నిర్వహణపై తదుపరి 48 గంటల్లో నిర్ణయం తీసుకుంటామని బోర్డు తెలిపింది. భారత సిరీస్‌కు ఇంకా రెండు వారాల సమయం ఉండటంతో.. అప్పటివరకు పరిస్థితులను సమీక్షించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ భారత్-ఐర్లాండ్ టీ20 సిరీస్ వాయిదా పడితే జూలై 1 నుంచి ప్రారంభమయ్యే ఇంగ్లండ్ సిరీస్ వరకు వైభవ్ సూర్యవంశీ వేచి చూడాల్సిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

