IND vs IRE: వైభవ్ సూర్యవంశీ కోసం అతనిపై వేటు!
ఐర్లాండ్‌తో రెండు టీ20ల సిరీస్‌కు టీమిండియా సిద్దమైంది. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు ప్రారంభమయ్యే తొలి మ్యాచ్‌తో ఈ సిరీస్ మొదలవ్వనుంది. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 విజయం తర్వాత టీమిండియా ఆడుతున్న తొలి మ్యాచ్ ఇదే కాగా.. టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ బరిలోకి దిగుతుండటం ఆసక్తికరంగా మారింది. టీమిండియా టీ20 కెప్టెన్ మారడం..శ్రేయస్ అయ్యర్ సారథ్యం వహిస్తుండటం ఈ సిరీస్‌కు మరింత హైప్‌ను తీసుకొస్తోంది.
15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ఖాయంగానే కనిపిస్తున్నా.. తుది జట్టు ఎంపిక టీమ్‌మేనేజ్‌మెంట్‌కు సవాల్‌గా మారింది. వైభవ్ కోసం ఇప్పుడు ఎవర్నీ పక్కనపెడుతారు? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.
వైభవ్ బరిలోకి దిగితే..
సూపర్ ఫామ్‌లో ఉన్న వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం చేస్తే ఓపెనర్‌గానే బరిలోకి దిగుతాడు. ఐపీఎల్, దేశవాళీలోనూ అతను ఓపెనర్‌గానే ఆడాడు. దాంతో మరో ఓపెనర్ అభిషేక్ శర్మ, సంజూ శాంసన్‌లో ఒకరిని పక్కనపెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. సంజూ శాంసన్‌కు మిడిలార్డర్‌లో కూడా బ్యాటింగ్ చేయగలడు. కానీ అభిషేక్ శర్మ ఓపెనర్‌గా మాత్రమే ఆడగలడు. కానీ వైభవ్ కోసం ఇప్పుడు ఈ ఇద్దరిలో ఒకరిపై వేటు వేయడం లేదా బ్యాటింగ్ ఆర్డర్‌ను మార్చడం తప్పనిసరి.

అభిషేక్ శర్మ ప్రస్తుతం వరల్డ్ నెంబర్ వన్ టీ20 బ్యాటర్. కేవలం 46 ఇన్నింగ్స్‌ల్లోనే అతను 190 స్ట్రైక్‌రేట్‌తో 1438 పరుగులు చేశాడు. టీ20 ప్రపంచకప్‌లో అద్వితీయమైన ప్రదర్శన కనబర్చిన సంజూ శాంసన్ 62 మ్యాచ్‌ల్లో 156.84 సగటుతో 1,399 పరుగులు చేశాడు. ఇప్పుడు 15 ఏళ్ల వైభవ్ కోసం గౌతమ్ గంభీర్ ఈ ఇద్దరిలో ఒకర్ని పక్కనపెట్టే సాహసం చేస్తాడా? అంటే అవునని చెప్పలేని పరిస్థితి. అవసరమైతే వైభవ్‌నే బెంచ్‌పై కూర్చోపెట్టే రకం గంభీర్.
సంజూ శాంసన్‌కు డిమోషన్..
అయితే సంజూ శాంసన్‌ను మిడిలార్డర్‌లో ఆడించే ఆప్షన్ గంభీర్‌కు ఉంది. నితీష్ కుమార్ రెడ్డి దూరమవడంతో అతని స్థానంలో సంజూ బ్యాటింగ్‌కు పంపించవచ్చు. ఎందుకంటే ఫస్ట్ డౌన్ ఆడే ఇషాన్ కిషన్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నాలుగో స్థానంలో.. వైస్ కెప్టెన్ తిలక్ వర్మ ఐదో స్థానంలో ఆడనున్నాడు. వారిని పక్కనపెట్టలేని పరిస్థితి.
ఆరోస్థానంలో సంజూ శాంసన్ బ్యాటింగ్ చేయాల్సి వస్తుంది. కానీ బౌలింగ్ ఆప్షన్స్ తగ్గుతాయి. ఏడో స్థానంలో ఆల్‌రౌండర్ శివమ్ దూబే, 8వ స్థానంలో అక్షర్ పటేల్ ఆడనుండగా.. నితీష్ స్థానంలో ఎంపికైన సూర్యాన్ష్ షెడ్జే బెంచ్‌కే పరిమితం కావాల్సి ఉంటుంది. స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా రవి బిష్ణోయ్ ఆడనుండగా.. అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణాలు పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు. ఎక్స్‌ట్రా పేసర్‌తో ఆడాలనుకుంటే ప్రిన్స్ యాదవ్, ప్రసిధ్ కృష్ణలో ఒకరికి చోటు దక్కుతుంది.
ఐర్లాండ్‌తో తుది జట్టు (అంచనా)
వైభవ్ సూర్యవంశీ, సంజూ శాంసన్/అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, శ్రేయస్ అయ్యర్, శివమ్ దూబే, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్/ప్రసిధ్ కృష్ణ, రవి బిష్ణోయ్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

