Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs SL: కొంపముంచిన బుడ్డోడు.. సూపర్ ఓవర్‌లో ఒక్క సిక్సర్ కొట్టని వైభవ్ సూర్యవంశీ!

టీమిండియా టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ సిక్స్ హిట్టింగ్ సామర్థ్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఐపీఎల్‌లో తన భారీ సిక్సర్లతో వరల్డ్ క్లాస్ బౌలర్లు అయిన జస్‌ప్రీత్ బుమ్రా, ప్యాట్ కమిన్స్, కగిసో రబడా, మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్ వుడ్, భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ సిరాజ్‌లకు చుక్కలు చూపించాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2026 సీజన్‌లో మొత్తం 72 సిక్స్‌లు బాది క్రిస్ గేల్ పేరిట ఉన్న 14 ఏళ్ల రికార్డ్‌ను బద్దలు కొట్టాడు.

అలాంటి వైభవ్ సూర్యవంశీ తాజాగా ఒక్క సిక్స్ కొట్టలేక ఇబ్బంది పడ్డాడు. భారత్-ఏ ఓటమికి కారణమయ్యాడు. భారత్-ఏ జట్టులోనే డేంజరస్‌ హిట్టర్‌గా గుర్తింపు పొందిన వైభవ్ ఆపేరును నిలబెట్టుకోలేకపోయాడు. ముక్కోణపు వన్డే సిరీస్‌లో భాగంగా శ్రీలంక-ఏతో సోమవారం జరిగిన హోరాహోరీ మ్యాచ్‌లో భారత్-ఏ సూపర్ ఓవర్‌లో 6 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.

భారత జట్టులోకి తీసుకోమని అడుక్కోలేను: భువనేశ్వర్ కుమార్

భారత జట్టులోకి తీసుకోమని అడుక్కోలేను: భువనేశ్వర్ కుమార్

సూపర్ ఓవర్‌లో విఫలమైన వైభవ్..

ఈ మ్యాచ్‌లో స్కోర్లు టై కావడంతో అంపైర్లు సూపర్ ఓవర్ ద్వారా ఫలితాన్ని తేల్చారు. అర్షద్ ఖాన్ వేసిన సూపర్ ఓవర్‌లో శ్రీలంక 16 పరుగులు చేసింది. అవిష్కా ఫెర్నాండో సిక్సర్ బాది భారీ స్కోర్ అందించాడు. నాలుగు బంతులు కట్టడిగా వేసిన అర్షద్ ఖాన్.. ఐదో బంతికి సిక్సర్ ఇచ్చుకున్నాడు. అనంతరం భారత్-ఏ సూపర్ ఓవర్‌లో 10 పరుగులే చేసి ఓటమిపాలైంది. వరుసగా మూడు బంతులాడిన సూర్యాన్ష్ షెడ్గే మూడు పరుగులే చేశాడు. ఒక్క బౌండరీ కొట్టలేకపోయాడు. చివరి మూడు బంతుల్లో వైభవ్ కూడా ఒక్క సిక్సర్ కూడా బాదలేకపోయాడు. ఒకే ఒక బౌండరీ బాదాడు.

Vaibhav Sooryavanshi Flop Show Caps Off Dismal Match as India A Fall to Sri Lanka A in ODI Tri Series
Photo Credit: X (twitter)

యార్కర్లతో వైభవ్‌ను శ్రీలంక బౌలర్లు కట్టడి చేశారు. వరుసగా మూడు బంతుల్లో రెండు సిక్సర్లు, బౌండరీ కొట్టాల్సి రావడంతోనే వైభవ్ ఒత్తిడికి గురైనట్లు తెలుస్తోంది. సూపర్ ఓవర్‌లో స్ట్రైక్ వైభవ్ తీసుకోవాల్సిందని, తొలి మూడు బంతుల్లో ఒక్క సిక్సర్ వచ్చినా.. ఛేజింగ్ సులువయ్యేదని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. ఎలాంటి బంతినైనా బౌండరీకి తరలించే వైభవ్.. ఏమైందో ఏమో తెలియదు కానీ శ్రీలంకలో తడబడుతున్నాడు. ఈ మ్యాచ్‌లో ఓడినా.. కీలక సమయంలో వైభవ్ బ్యాట్ నుంచి ఒక్క సిక్సర్ రాకపోవడం అభిమానులను తీవ్రంగా నిరాశపర్చింది.

స్కోర్లు టై..

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ ఏ 49.2 ఓవర్లలో 265 పరుగులకు ఆలౌటైంది. సూర్యన్ష్ షెడ్గే(66 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 72), విప్రజ్ నిగమ్(49 బంతుల్లో 6 ఫోర్లతో 51) హాఫ్ సెంచరీలతో రాణించారు. వైభవ్ సూర్యవంశీ(21), ప్రభ్‌సిమ్రాన్ సింగ్(11), రుతురాజ్ గైక్వాడ్(37), తిలక్ వర్మ(23), ఆయుష్ బదోని(15), నిషాంత్ సింధు(6) దారుణంగా విఫలమయ్యారు. శ్రీలంక ఏ బౌలర్లలో మహమ్మద్ షిరాజ్(3/33), విజయ్‌కాంత్(3/26) మూడేసి వికెట్లు తీయగా.. సహాన్, వనుజ సహన్, మతులన్ తలో వికెట్ తీసారు.

అనంతరం శ్రీలంక-ఏ కూడా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 265 పరుగులే చేసింది. సదీర సమరవిక్రమా(113 బంతుల్లో 7 ఫోర్లతో 93) తృటిలో శతకం చేజార్చుకోగా.. నిరోషన్ డిక్‌వెల్లా(37), వానుజ సాహన్(25) పర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో ఆయుష్ బదోని 2 వికెట్లు తీయగా.. అర్షద్ ఖాన్, నిషాంత్ సింధు, విప్రజ్ నిగమ్, అనుకూల్ రాయ్, సూర్యాన్ష్ షెడ్గే తలో వికెట్ తీసారు.

Vaibhav Sooryavanshi: ఆ బౌలర్లు ఉంటేనే బుడ్డోడు చెలరేగుతాడు!

Vaibhav Sooryavanshi: ఆ బౌలర్లు ఉంటేనే బుడ్డోడు చెలరేగుతాడు!
Story first published: Monday, June 15, 2026, 19:15 [IST]
Other articles published on Jun 15, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+