Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వైభవ్ సూర్యవంశీ, తిలక్ వర్మను శిక్షించిన బీసీసీఐ

టీమిండియా టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ, భారత్-ఏ కెప్టెన్ తిలక్ వర్మలపై బీసీసీఐ క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. మైదానంలో దూకుడుగా వ్యవహరించి నిబంధనలను ఉల్లంఘించినందుకు మ్యాచ్ ఫీజులో కోత విధిస్తూ భారీ జరిమానా విధించింది.

ముక్కోణపు వన్డే సిరీస్‌లో భాగంగా శ్రీలంక-ఏతో జరిగిన మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ గొడవకు దిగిన సంగతి తెలిసిందే. శ్రీలంక ప్లేయర్ వీసెన్ హల్లంబాగే ఎగతాళి చేయడంతో సహనం కోల్పోయిన వైభవ్ సూర్యవంశీ అతనిపైకి దూసుకెళ్లి చేతితో నెట్టేసాడు. ఈ ఘటన సోషల్ మీడియా వేదికగా తీవ్ర చర్చనీయాంశం కాగా.. వైభవ్ సూర్యవంశీపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి.

బుడ్డోడి కోసం గంట వెయిట్ చేసిన శ్రీలంక దిగ్గజం!(వీడియో)

బుడ్డోడి కోసం గంట వెయిట్ చేసిన శ్రీలంక దిగ్గజం!(వీడియో)

ఈ ఘటనపై విచారణ జరిపిన మ్యాచ్ రిఫరీ ప్రదీప్ జయప్రకాష్ సిఫార్సు మేరకు వైభవ్ సూర్యవంశీ మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత విధిస్తూ బీసీసీఐ జరిమానా విధించింది. మరోవైపు శ్రీలంక ప్లేయర్ హలంబకే మ్యాచ్ ఫీజులో కూడా 50 శాతం కోత విధిస్తూ శ్రీలంక క్రికెట్ బోర్డు చర్యలు తీసుకుంది. ఈ గొడవను ఆపిన శ్రీలంక సీనియర్ ప్లేయర్ నిరోషన్ డిక్వెల్లా మ్యాచ్ ఫీజులో కూడా 20 శాతం కోత పడింది.

Vaibhav Sooryavanshi Faces 50 Fine Captain Tilak Varma Penalized After Heated Post-Match Brawl in Dambulla

మైదానంలో అంపైర్లతో పలు మార్లు వాగ్వాదానికి దిగిన భారత్-ఏ కెప్టెన్ తిలక్ వర్మ‌పై కూడా బీసీసీఐ చర్యలు తీసుకుంది. సూపర్ ఓవర్ నిర్వాహణ, నోబాల్, బ్యాడ్ లైట్ వంటి విషయాల్లో అంపైర్లతో తిలక్ వర్మ వాగ్వాదానికి దిగాడు. ఇది నిబంధనలకు విరుద్దమని భావించిన బీసీసీఐ మ్యాచ్ రిఫరీ సూచనల మేరకు తిలక్ మ్యాచ్ ఫీజులో 30 శాతం జరిమానా విధించింది.

సాధారణంగా ఏ జట్లు ఆడే మ్యాచ్‌ల్లో ఐసీసీ ప్రత్యక్ష క్రమశిక్షణా చర్యలు తీసుకోదు. కాబట్టి ఆటగాళ్లు నిబంధనలను ఉల్లంఘిస్తే ఆయా దేశాల క్రికెట్ బోర్డులు చర్యలు తీసుకుంటాయి. ఈ వివాదాస్పద ఘనటలపై బీసీసీఐ స్పందిస్తూ.. 'భారత్ ఏ జట్టు కీలకమైన ట్రై సిరీస్ ఆడుతోంది. సీనియర్ జట్టులోకి రావడానికి ప్రయత్నిస్తున్న యువ ఆటగాళ్లు ఇలాంటి అనవసర వివాదాలపై ఫోకస్ పెట్టకుండా.. కేవలం తమ ఆటపైనే దృష్టి సారించాలి.'అని పేర్కొంది.

వైభవ్ సూర్యవంశీని జట్టు నుంచి తప్పించాల్సింది: సంజయ్ మంజ్రేకర్

వైభవ్ సూర్యవంశీని జట్టు నుంచి తప్పించాల్సింది: సంజయ్ మంజ్రేకర్
Story first published: Thursday, June 18, 2026, 11:25 [IST]
Other articles published on Jun 18, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+