Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టాలెంట్ ఉన్నా పట్టించుకోలేదు.. ఐపీఎల్ వేలంపై వైభవ్ సూర్యవంశీ షాకింగ్ కామెంట్స్! (వీడియో)

ఐపీఎల్ వేలంపై రాజస్థాన్ రాయల్స్ టీనేజ్ సెన్సేషన్, యూనివర్సల్ బేబీ బాస్ వైభవ్ సూర్యవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వేలంలో తన కోసం రెండు జట్లే పోటీపడటం తనను తీవ్రంగా నిరాశపర్చిందని చెప్పాడు.

తాజాగా రాజస్థాన్ రాయల్స్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన వీడియోలో వైభవ్ సూర్యవంశీ ఈ విషయాన్ని వెల్లడించాడు. 'నేను బాగా ఆడుతాను. ట్రయల్స్‌లోనూ బాగా పర్ఫార్మ్ చేశాను. అయినా వేలంలో నా కోసం రెండే జట్లే బిడ్ వేశాయి. మిగతా టీమ్స్ ఎందుకు పట్టించుకోలేదని నేను చాలా బాధపడ్డాను.

కానీ రాజస్థాన్ రాయల్స్‌లోకి తీసుకొచ్చినందుకు ఈ ఏడాదిన్నర కాలంలో ఆ దేవుడికి కనీసం వెయ్యి సార్లయినా కృతజ్ఞతలు చెప్పుకుని ఉంటాను. ఇక్కడి కోచ్‌లు, సపోర్ట్ స్టాఫ్, ఆటగాళ్లు, మేనేజ్‌మెంట్, మీడియా టీమ్, ఫిజియోలు, ట్రైనర్లు.. అందరూ ఒక కుటుంబంలా ఉంటారు.

Vaibhav Sooryavanshi Explains Why He Was Initially Disappointed After Record-Breaking Rajasthan Royals IPL Bid
Photo Credit: RR (X)

ఇక్కడ ఉంటే మన సొంత ఇల్లులాగే ఎంతో సౌకర్యంగా అనిపిస్తుంది. ఎవరితోనైనా మన మనసులోని మాటను, భావాలను పంచుకోవచ్చు. ఈ ఫ్రాంచైజీలోకి వచ్చినందుకు నేను ఎంత సంతోషంగా ఉన్నానో మాటల్లో చెప్పలేను. జట్టులోని సీనియర్లు అందరూ నాకు ఎంతో మంచి మార్గదర్శకత్వం అందిస్తారు. ఏది మంచిది, ఏం చేయాలి, ఏం చేయకూడదు అని చెప్తారు. ఇక్కడ నేను నేర్చుకోవడానికి చాలా విషయాలు ఉన్నాయి.'అని వైభవ్ సూర్యవంశీ ఆనందం వ్యక్తం చేశాడు.

బుడ్డోడు కాదు.. గేమ్ ఛేంజర్: అజిత్ అగార్కర్

బుడ్డోడు కాదు.. గేమ్ ఛేంజర్: అజిత్ అగార్కర్

ఐపీఎల్ 2025 మెగా వేలంలో వైభవ్ సూర్యవంశీ కోసం రాజస్థాన్ రాయల్స్‌తో పాటు ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రమే పోటీపడ్డాయి. చివరకు రాజస్థాన్ రాయల్స్ రూ. 1.10 కోట్లకు కొనుగోలు చేసింది. 14 ఏళ్ల వయసులోనే ఐపీఎల్ వేలంలో అమ్ముడైన ఆటగాడిగా.. ఐపీఎల్ ఆడిన వ్యక్తిగా.. సెంచరీ బాదిన ప్లేయర్‌గా వైభవ్ సూర్యవంశీ చరిత్ర సృష్టించాడు.

ఐపీఎల్ 2026 సీజన్‌లో సంచలన ప్రదర్శనతో ఆరెంజ్ క్యాప్‌తో పాటు మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్, సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది అవార్డు, అత్యధిక సిక్సర్లు, ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది అవార్డ్స్‌ను వైభవ్ సూర్యవంశీ సొంతం చేసుకున్నాడు. ఈ సంచలన ప్రదర్శనతో టీమిండియాకు కూడా ఎంపికయ్యాడు. ఐర్లాండ్‌తో పాటు ఇంగ్లండ్ పర్యటనలకు ఎంపిక చేసిన భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు. తద్వారా టీమిండియాకు ఎంపికైన అతి పిన్నవయస్కుడిగా వైభవ్ సూర్యవంశీ చరిత్రకెక్కాడు.

రాజస్థాన్ రాయల్స్ కాదు.. బుడ్డోడి ఫేవరెట్ ఐపీఎల్ టీమ్ అదే! (వీడియో)

రాజస్థాన్ రాయల్స్ కాదు.. బుడ్డోడి ఫేవరెట్ ఐపీఎల్ టీమ్ అదే! (వీడియో)
Story first published: Monday, June 8, 2026, 10:19 [IST]
Other articles published on Jun 8, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+