Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మా అమ్మ కోసం A మార్క్.. రింకూ సింగ్‌ కోసం ఆ సెలెబ్రేషన్: వైభవ్ సూర్యవంశీ

తన తల్లికి కృతజ్ఞతగానే హాఫ్ సెంచరీ అనంతరం A మార్క్ సెలెబ్రేషన్స్ చేసుకున్నానని టీమిండియా టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ తెలిపాడు. రింకూ సింగ్‌తో జరిగిన సంభాషణను గుర్తు చేస్తూ సరదాగా థంబ్స్ అప్ సింబల్స్‌ను చూపించానని పేర్కొన్నాడు.

18 బంతుల్లో 50.. వైభవ్ సూర్యవంశీ‌కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఎందుకు రాలేదంటే..?

18 బంతుల్లో 50.. వైభవ్ సూర్యవంశీ‌కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఎందుకు రాలేదంటే..?

జింబాబ్వేతో మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లోనే వైభవ్ సూర్యవంశీ రికార్డ్ హాఫ్ సెంచరీతో సత్తా చాటిన సంగతి తెలిసిందే. హరారే వేదికగా గురువారం జరిగిన ఈ మ్యాచ్‌లో వైభవ్ 18 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 50 పరుగులు చేసి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లోనే హాఫ్ సెంచరీ బాదిన అత్యంత పిన్నవయస్కుడిగా వరల్డ్ రికార్డ్ నమోదు చేశాడు. ఈ క్రమంలో సచిన్ టెండూల్కర్ 37 ఏళ్ల రికార్డ్ బద్దలు కొట్టాడు.

Vaibhav Sooryavanshi explains His celebration after maiden fifty in IND vs ZIM 1st T20I at Harare

A మార్క్ సెలెబ్రేషన్..

అయితే హాఫ్ సెంచరీ అనంతరం తన చేతి వేళ్లతో A‌ని చూపిస్తూ సెలెబ్రేట్ చేసుకున్నాడు. అంతేకాకుండా టీమిండియా డగౌట్ వైపు థంబ్స్ అప్ సింబల్ చూపించాడు. వైభవ్ సెలెబ్రేషన్స్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌‌గా మారింది. ఈ మ్యాచ్ అనంతరం బీసీసీఐ టీవీతో మాట్లాడిన వైభవ్ సూర్యవంశీ.. తన సెలెబ్రేషన్స్ వెనుక ఉన్న కారణాన్ని వెల్లడించాడు.

'మా అమ్మ పేరు ఆర్తి. ఆమెకు కృతజ్ఞతగా A మార్క్ సెలెబ్రేషన్స్ చేసుకున్నా. మ్యాచ్‌కు ముందు రింకూ సింగ్‌ సంభాషణను గుర్తు చేసుకుంటూ సరదాగా థంబ్స్ అప్ సింబల్స్‌ను చూపించా'అని వైభవ్ తెలిపాడు.

ఈ మ్యాచ్ నా వల్ల గెలవలేదు..

ఈ గెలుపు క్రెడిట్ తనది కాదని, బౌలర్ల అద్భుత ప్రదర్శనతో విజయం సాధించామని తెలిపాడు. ఈ విధ్వంసకర హాఫ్ సెంచరీని తన కుటుంబంతో పాటు కోచ్‌లకు, తన ప్రయాణంలో మద్దతుగా నిలిచిన ప్రతీ ఒక్కరికి అంకితమిస్తున్నట్లు ప్రకటించాడు.

'కెరీర్ ప్రారంభంలో ఇలాంటి ఇన్నింగ్స్ ఆటగాళ్ల ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తుంది. ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగగానే.. నేను నా జోన్‌లో ఉన్నట్లు అనిపించింది. నా బలాన్ని నమ్ముకొని ఆడాను. కొన్ని మైదానాల్లో పరుగులు చేయడం బాగుంటుంది. అయితే నేను దేన్ని తేలికగా తీసుకోను. ఈ గెలుపు క్రెడిట్ నాది కాదు. బౌలర్ల అత్యుత్తమ ప్రదర్శనతోనే ఈ విజయం దక్కింది.

IND vs ZIM: చెత్త పిచ్ వల్లే ఓడిపోయాం: జింబాబ్వే కెప్టెన్

IND vs ZIM: చెత్త పిచ్ వల్లే ఓడిపోయాం: జింబాబ్వే కెప్టెన్

ఎలాంటి పరిస్థితుల్లోనైనా గొప్పగా బ్యాటింగ్ చేయడానికి ప్రయత్నిస్తా. జట్టు కోసం నా బెస్ట్ ఇవ్వడానికి కష్టపడుతా. ఈ రికార్డు హాఫ్ సెంచరీని నా కుటుంబంతో పాటు కోచ్‌లకు, నా క్రికెట్ ప్రయాణంలో అండగా నిలిచిన ప్రతీ ఒక్కరికి అంకితం ఇస్తున్నాను.'అని వైభవ్ సూర్యవంశీ చెప్పుకొచ్చాడు.

Story first published: Friday, July 24, 2026, 17:16 [IST]
Other articles published on Jul 24, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+