Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2026: బుడ్డోడి విధ్వంసం.. పంజాబ్ కింగ్స్‌కు తప్పని పరాజయం!

ఐపీఎల్ 2026 సీజన్‌లో పంజాబ్ కింగ్స్‌కు తొలి పరాజయం ఎదురైంది. వరుసగా 6 విజయాల తర్వాత తొలి ఓటమిని రుచి చూసింది. మంగళవారం ముల్లాన్‌పూర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 6 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్‌ను చిత్తు చేసింది. డోనోవన్ ఫెర్రెరియా(26 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 52 నాటౌట్), ఇంపాక్ట్ ప్లేయర్ శుభమ్ దూబే(12 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 31 నాటౌట్) అసాధారణ బ్యాటింగ్‌ ప్రదర్శనతో రాజస్థాన్ రాయల్స్ విజయంలో కీలక పాత్ర పోషించారు.

బుడ్డోడి విధ్వంసం..

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 222 పరుగుల భారీ స్కోర్ చేసింది. ప్రభ్‌సిమ్రాన్ సింగ్(44 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 59), మార్కస్ స్టోయినీస్(22 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్‌లతో 62 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు. కూపర్ కన్నాల్లీ(14 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 30), ప్రియాన్ష్ ఆర్య(11 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 29) దూకుడుగా ఆడారు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, నండ్రే బర్గర్ చెరో వికెట్ తీయగా.. యశ్‌రాజ్ పునియా(2/41) రెండు వికెట్లు పడగొట్టాడు.

Vaibhav Sooryavanshi Donovan Ferreira and Shubham Dubey Lead Rajasthan Royals to a 6-Wicket Victory Over Punjab Kings

అనంతరం రాజస్థాన్ రాయల్స్ 19.2 ఓవర్లలో 4 వికెట్లకు 228 పరుగులు చేసి గెలుపొందింది. యశస్వి జైస్వాల్(27 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 51) హాఫ్ సెంచరీతో రాణించగా.. వైభవ్ సూర్యవంశీ(16 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లతో 43) దూకుడుగా ఆడాడు. పంజాబ్ బౌలర్లలో యుజ్వేంద్ర చాహల్(3/36) మూడు వికెట్లు తీయగా..అర్ష్‌దీప్ సింగ్(1/68) ఒక వికెట్ తీసారు. లాకీ ఫెర్గూసన్(0/57), అర్ష్‌దీప్ సింగ్ ధారళంగా పరుగులివ్వడం పంజాబ్ కింగ్స్ విజయవకాశాలను దెబ్బతీసింది.

గెలిపించిన డొనోవన్, శుభమ్‌ దూబే..

223 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో రాజస్థాన్ రాయల్స్‌కు అదిరిపోయే ఆరంభం దక్కింది. వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర బ్యాటింగ్‌తో 3 ఓవర్లలోనే రాజస్థాన్ 50 పరుగులు చేసింది. కానీ హాఫ్ సెంచరీకి చేరువైన వైభవ్ సూర్యవంశీ క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. క్రీజులోకి వచ్చిన ధ్రువ్ జురెల్(16)తో కలిసి యశస్వి జైస్వాల్ చెలరేగాడు.

అయితే ఈ జోడీని యుజ్వేంద్ర చాహల్‌ను విడదీసాడు. ధ్రువ్ జురెల్‌(16)ను క్యాచ్‌ ఔట్‌గా పెవిలియన్ చేర్చి చాహల్.. తన మరుసటి ఓవర్‌లో హాఫ్ సెంచరీ సాధించిన యశస్వి జైస్వాల్‌ను ఔట్ చేశాడు. ఆ తర్వాత దూకుడుగా ఆడిన కెప్టెన్ రియాన్ పరాగ్‌ను కూడా క్యాచ్ ఔట్ చేసి మ్యాచ్‌ను ఉత్కంఠగా మార్చాడు. కానీ రాజస్థాన్ రాయల్స్ శుభ్‌మ్ దూబే‌ను ఇంపాక్ట్ ప్లేయర్‌గా పంపించి ఫలితం రాబట్టింది. శుభమ్‌తో కలిసి డోనావన్ ఫెర్రెరియా అద్భుతమైన బ్యాటింగ్‌తో రాజస్థాన్ రాయల్స్ విజయాన్ని లాంఛనం చేశాడు. ఈ ఇద్దరూ ఐదో వికెట్‌కు అజేయంగా 77 పరుగులు జోడించారు.

Story first published: Tuesday, April 28, 2026, 23:13 [IST]
Other articles published on Apr 28, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+