ఈ రికార్డ్ హాఫ్ సెంచరీ వారికి అంకితం: వైభవ్ సూర్యవంశీ
టీమిండియా టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ ఎట్టకేలకు జూలు విధిల్చాడు. అంతర్జాతీయ క్రికెట్‌లోనూ ఈ 15 ఏళ్ల సిక్సర పిడుగు పరుగుల మోత మోగించడం మొదలెట్టాడు. ఇంగ్లండ్‌తో వరుసగా మూడు టీ20ల్లో విఫలమైన వైభవ్.. జింబాబ్వేతో తొలి మ్యాచ్‌లోనే రికార్డ్ హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. హరారే వేదికగా గురువారం జరిగిన తొలి మ్యాచ్‌లో 18 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 50 పరుగులు చేసి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లోనే హాఫ్ సెంచరీ బాదిన అత్యంత పిన్నవయస్కుడిగా వరల్డ్ రికార్డ్ నమోదు చేశాడు.
ఈ విధ్వంసకర హాఫ్ సెంచరీని తన కుటుంబంతో పాటు కోచ్‌లకు, తన ప్రయాణంలో మద్దతుగా నిలిచిన ప్రతీ ఒక్కరికి అంకితమిస్తున్నట్లు వైభవ్ సూర్యవంశీ తెలిపాడు. వైభవ్ విధ్వంసకర హాఫ్ సెంచరీతో పాటు మయాంక్ యాదవ్ అద్భుత బౌలింగ్‌తో ఈ మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో గెలుపొందిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ అనంతరం బీసీసీఐ టీవీతో మాట్లాడిన వైభవ్ సూర్యవంశీ.. ఈ ఇన్నింగ్స్ తన ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసిందని తెలిపాడు.

నా బెస్ట్ ఇవ్వడానికి కష్టపడుతా..
'కెరీర్ ప్రారంభంలో ఇలాంటి ఇన్నింగ్స్ ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తుంది. ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగగానే.. నేను నా జోన్‌లో ఉన్నట్లు అనిపించింది. నా బలాన్ని నమ్ముకొని ఆడాను. కొన్ని మైదానాల్లో పరుగులు చేయడం బాగుంటుంది. అయితే నేను దేన్ని తేలికగా తీసుకోను.
ఎలాంటి పరిస్థితుల్లోనైనా గొప్పగా బ్యాటింగ్ చేయడానికి ప్రయత్నిస్తా. జట్టు కోసం నా బెస్ట్ ఇవ్వడానికి కష్టపడుతా. ఈ రికార్డు హాఫ్ సెంచరీని నా కుటుంబంతో పాటు కోచ్‌లకు, నా క్రికెట్ ప్రయాణంలో అండగా నిలిచిన ప్రతీ ఒక్కరికి అంకితం ఇస్తున్నాను.'అని వైభవ్ సూర్యవంశీ చెప్పుకొచ్చాడు.
37 ఏళ్ల సచిన్ రికార్డ్ బద్దలు..
15 ఏళ్ల 118 రోజుల వయసులో తొలి టీ20 హాఫ్ సెంచరీ అందుకున్న వైభవ్ సూర్యవంశీ.. 37 ఏళ్ల సచిన్ టెండూల్కర్ రికార్డ్‌ను అధిగమించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో పూర్తి స్థాయి జట్లలో హాఫ్ సెంచరీ బాదిన అతి పిన్న వయస్కుడిగా వైభవ్ నిలిచాడు. 1989లో 16 ఏళ్ల 213 రోజుల వయసులో సచిన్ టెండూల్కర్ నమోదు చేసిన రికార్డ్‌ను బ్రేక్ చేశాడు.
భారత్ సూపర్ విక్టరీ..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 125 పరుగులే చేసింది. వెస్లీ మధెవెరే(34 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 39), తడివానషే మరుమాని(20 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 27 నాటౌట్) టాప్ స్కోరర్లుగా నిలవగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. భారత బౌలర్లలో మయాంక్ యాదవ్(2/18), ప్రిన్స్ యాదవ్(2/19) రెండేసి వికెట్లు తీయగా.. శివమ్ దూబే, రవి బిష్ణోయ్ తలో వికెట్ పడగొట్టారు.
అనంతరం భారత్ 13.2 ఓవర్లలోనే 3 వికెట్లకు 126 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ(19 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 50) విధ్వంసకర హాఫ్ సెంచరీతో భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇషాన్ కిషన్(24 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 35), శ్రేయస్ అయ్యర్(24 బంతుల్లో 3 ఫోర్లతో 28 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడారు. జింబాబ్వే బౌలర్లలో బ్లెస్సింగ్ ముజర్బానీ రెండు వికెట్లు తీయగా.. రిచర్డ్ నగర్వా ఒక వికెట్ పడగొట్టాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

