Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ.. 37 ఏళ్ల రికార్డ్ బద్దలు!

టీమిండియా టీనేజ్ సెన్సేషన్, యూనివర్సల్ బేబీ బాస్ వైభవ్ సూర్యవంశీ ఎట్టకేలకు జూలు విధిల్చాడు. వరుసగా మూడు మ్యాచ్‌ల వైఫల్యం తర్వాత నాలుగో మ్యాచ్‌లో విధ్వసంకర హాఫ్ సెంచరీతో చెలరేగాడు. తద్వారా అంతర్జాతీయ టీ20ల్లో తొలి హాఫ్ సెంచరీ అందుకున్న వైభవ్ సూర్యవంశీ.. 15 ఏళ్ల వయసులోనే ఈ ఫీట్ సాధించిన తొలి ఆటగాడిగా వరల్డ్ రికార్డ్ నమోదు చేశాడు. ఏ ఫార్మాట్‌లోనైనా హాఫ్ సెంచరీ బాదిన అతి పిన్నవయస్కుడిగా వైభవ్ నిలిచాడు.

IND vs ZIM: రఫ్ఫాడించిన మయాంక్ యాదవ్.. చేతులెత్తేసిన జింబాబ్వే!

IND vs ZIM: రఫ్ఫాడించిన మయాంక్ యాదవ్.. చేతులెత్తేసిన జింబాబ్వే!

సచిన్ రికార్డ్ బద్దలు..

జింబాబ్వేతో మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా గురువారం జరిగిన తొలి మ్యాచ్‌లో 18 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో హాఫ్ సెంచరీ చేయడం ద్వారా ఈ ఫీట్ సాధించాడు. అయితే ఆ మరుసటి బంతికే భారీ షాట్ ఆడబోయి క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. ఈ హాఫ్ సెంచరీతో ఏడేళ్ల రికార్డ్‌ను వైభవ్ బద్దలు కొట్టాడు. పూర్తిస్థాయి జట్టు మెంబర్ సాధించిన యంగెస్ట్ ఫిఫ్టీ సెంచరీ ఇదే కావడం విశేషం. ఈ క్రమంలో వైభవ్.. 37 ఏళ్ల సచిన్ టెండూల్కర్ రికార్డ్‌ను బద్దలు కొట్టాడు. 1989లో సచిన్ టెండూల్కర్.. పాకిస్థాన్‌పై టెస్ట్‌ల్లో తొలి హాఫ్ సెంచరీ నమోదు చేశాడు.

Vaibhav Sooryavanshi Creates History Shatters Sachin s 37-Year-Old Record with Maiden Fifty vs Zimbabwe

అతి పిన్న వయస్సులో అంతర్జాతీయ టీ20ల్లో తొలి హాఫ్ సెంచరీ చేసిన ఆటగాళ్లు..

15 ఏళ్ల 118 రోజులు - వైభవ్ సూర్యవంశీ (భారత్) vs జింబాబ్వే, హరారే, 2026

16 ఏళ్ల 56 రోజులు - లూయిస్ బ్రూస్ (జిబ్రాల్టర్) vs మాల్టా, ఆల్బెర్గారియా, 2021

16 ఏళ్ల 76 రోజులు - కవిన్ చద్దా (ఇండోనేషియా) vs స్వీడన్, బాలి, 2026

16 ఏళ్ల 89 రోజులు - అలుసిన్ తురే (సియెర్రా డియోన్) vs ఘనా, బెనోని, 2023

16 ఏళ్ల 118 రోజులు - టెంజిన్ రాబ్గే (భూటాన్) vs చైనా, కౌలాలంపూర్, 2023

17 ఏళ్ల 296 రోజులు - రహ్మానుల్లా గుర్బాజ్ (ఆఫ్ఘనిస్తాన్) vs జింబాబ్వే, చటోగ్రామ్, 2019

అబ్బర బిడ్డో.. ఇన్నింగ్స్ ఫస్ట్‌ బాల్‌కే వికెట్!గంటకు 150 కిలోమీటర్ల వేగం..!(వీడియో)

అబ్బర బిడ్డో.. ఇన్నింగ్స్ ఫస్ట్‌ బాల్‌కే వికెట్!గంటకు 150 కిలోమీటర్ల వేగం..!(వీడియో)


అంతర్జాతీయ క్రికెట్‌లో అతి పిన్న వయస్సులో తొలి అర్ధ సెంచరీ చేసిన ఆటగాళ్ళు (ఫుల్ మెంబర్ జట్లు):

15 ఏళ్ల 118 రోజులు - వైభవ్ సూర్యవంశీ (భారత్) vs జింబాబ్వే, హరారే, 2026 (T20I)

16 ఏళ్ల 213 రోజులు - సచిన్ టెండూల్కర్ (భారత్) vs పాకిస్తాన్, ఫైసలాబాద్, 1989 (టెస్ట్)

16 ఏళ్ల 214 రోజులు - షాహిద్ అఫ్రిది (పాకిస్తాన్) vs శ్రీలంక, నైరోబి, 1996 (వన్డే)

17 ఏళ్ల 39 రోజులు - ముష్తాక్ మహమ్మద్ (పాకిస్తాన్) vs భారత్, కోల్‌కతా, 1960 (టెస్ట్)

17 ఏళ్ల 63 రోజులు - మహమ్మద్ అష్రఫుల్ vs శ్రీలంక, కొలంబో (SSC), 2001 (టెస్ట్)

Story first published: Thursday, July 23, 2026, 19:53 [IST]
Other articles published on Jul 23, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+