ఏమో సార్.. నాకే తెలియదు: వైభవ్ సూర్యవంశీ
హాఫ్ సెంచరీ అనంతరం తాను చేసిన సెలెబ్రేషన్స్‌కు అర్థం ఏంటో తనకే తెలియదని రాజస్థాన్ రాయల్స్ టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ అన్నాడు. ప్రతీ మ్యాచ్‌లోనూ ఏదో ఒక కొత్త స్టైల్‌ను చూపిస్తానని, ముందే ఏం ప్లాన్ చేసుకోనని స్పష్టం చేశాడు.
ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ(38 బంతుల్లో 7 ఫోర్లు, 10 సిక్స్‌లతో 93) విధ్వంసకర బ్యాటింగ్‌తో రాజస్థాన్ రాయల్స్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అతని ధాటికి 221 పరుగుల భారీ లక్ష్యాన్ని రాజస్థాన్ 19.1 ఓవర్లలో ఛేదించి 7 వికెట్ల తేడాతో గెలుపొందింది.
హాఫ్ సెంచరీ అనంతరం వైభవ్ సూర్యవంశీ తన చేతి వేళ్లను చూపిస్తూ వినూత్నంగా సెలెబ్రేట్ చేసుకున్నాడు. మ్యాచ్ అనంతరం ఈ సెలెబ్రేషన్స్ గురించి హోస్ట్ ప్రశ్నించగా.. 'ఏమో సార్ .. నాకే తెలియదు'అని వైభవ్ బదులిచ్చాడు. లక్నో బ్యాటింగ్ సమయంలోనే డగౌట్ నుంచి పిచ్‌ను నిశితంగా పరిశీలించానని చెప్పాడు.

ప్రశంసలను పట్టించుకోను..
'నిజం చెప్పాలంటే ఈ సీజన్‌లో మూడో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ గెలుచుకోవడంపై నాకు ఎలాంటి అనుభూతి లేదు. మేం బౌలింగ్ చేస్తున్నప్పుడే నేను బయట కూర్చుని పిచ్‌ను పరిశీలించాను. వికెట్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్నట్లు అనిపించింది. అందుకే ఈ రోజు ఇన్నింగ్స్ ప్రారంభంలోనే తొందర పడకూడదని, కొంత సమయం తీసుకోవాలని అనుకున్నాను. నేను ఎక్కువ సమయం క్రీజులో ఉంటే, మరో ఎండ్‌లో ఉన్న బ్యాటర్‌కు కూడా సహాయపడుతుందని భావించాను.
స్లోగా ఆడి ఆ తర్వాత దూకుడు పెంచడం నా ఆలోచన. నేను ఎప్పుడైనా సరే రెండు, మూడు ఫోర్లు, సిక్సర్లు కొట్టగలను. అందుకే తొందర పడకుండా కొంచెం సమయం తీసుకుని, వీలైనంత వరకు క్రీజులో ఉండేందుకు ప్రయత్నించాను. నాపై వచ్చే ప్రశంసలను అస్సలు పట్టించుకోను. న్యూస్ పేపర్స్ అస్సలు చదవను. కాబట్టి వాటి గురించి ఎక్కువగా ఆలోచించను.
అర్థం ఏంటో తెలియదు..
ఇది కేవలం నా కెరీర్ ప్రారంభం మాత్రమే అని నేను భావిస్తాను. నా కెరీర్ సుదీర్ఘంగా సాగి, నేను చాలా కాలం పాటు ఆడితే.. జనాలు ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుంటారు. కాబట్టి నా దృష్టి ఎప్పుడూ ఆట మీదే ఉంచుతాను. నా ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నాను.
నా సెలెబ్రేషన్స్ అర్థం ఏంటో నాకే తెలియదు. నేను ప్రతి మ్యాచ్‌లోనూ ఏదో ఒక కొత్త స్టైల్ చూపిస్తుంటాను. నేనేం దాన్ని ముందే ప్లాన్ చేసుకోను. దాని వెనుక ఎలాంటి ప్రత్యేకమైన అర్థం కూడా లేదు. గత మ్యాచ్‌లో నేను చేసిన సెలబ్రేషన్‌కు కూడా ఎలాంటి అర్థం లేదు. నేను కేవలం కొత్త విషయాలను ప్రయత్నిస్తూ ఉంటానంతే.
ఆటను ఆస్వాదించడమే..
మా ఆఖరి మ్యాచ్ గురించి కూడా పెద్దగా ఆందోళన చెందడం లేదు. మా ఫోకస్ అంతా ఆటను ఆస్వాదించడంపైనే ఉంది. తదుపరి మ్యాచ్‌లో కూడా మేం మైదానం వెలుపల జరిగే విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకూడదు. టోర్నీ అంతటా మేం ఎలాగైతే ఆడామో.. అలాగే అందరూ ఆటపైనే దృష్టి పెట్టి ఎంజాయ్ చేస్తూ ఆడాలి. ఈ టోర్నీలో మాకు ఎన్నో ఎత్తుపల్లాలు ఎదురయ్యాయి. కానీ మంచి క్రికెట్ ఆడి మ్యాచ్‌లు గెలవడమే మా ఏకైక లక్ష్యం.'అని వైభవ్ సూర్యవంశీ చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

