తొలి మ్యాచ్‌లోనే వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్.. 37 ఏళ్ల రికార్డ్ బద్దలు!
టీమిండియా టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ చరిత్ర సృష్టించాడు. 15 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన తొలి భారత ఆటగాడిగా వైభవ్ నిలిచాడు. ఈ క్రమంలో సచిన్ టెండూల్కర్ 37 ఏళ్ల రికార్డ్‌ను అధిగమించాడు. అంతేకాకుండా అంతర్జాతీయ టీ20ల్లో అరంగేట్రం చేసిన అతి పిన్న వయస్కుడిగా సరికొత్త చరిత్రను లిఖించాడు.
ఇంగ్లండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా మాంచెస్టర్ వేదికగా జరుగుతున్న రెండో మ్యాచ్ బరిలోకి దిగి ఈ ఫీట్ సాధించాడు. 15 ఏళ్ల 99 రోజుల వయసులో అరంగేట్రం చేసిన వైభవ్.. అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన అతి పిన్న వయస్కుల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు.

పాకిస్థాన్ ప్లేయర్ హసన్ రాజా 14 ఏళ్ల 227 రోజుల వయసులో అరంగేట్రం చేసి ఈ జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అతను 1996లో ఫైసలాబాద్ వేదికగా జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో ఈ ఫీట్ సాధించాడు. వైభవ్ సూర్యవంశీ తర్వాత బంగ్లా ప్లేయర్ మహమ్మద్ షరీఫ్, పాక్ ప్లేయర్ ముస్తాక్ మొహమ్మద్, అకీబ్ జావెద్ ఉన్నారు. సచిన్ టెండూల్కర్ ఆరో స్థానంలో కొనసాగుతున్నాడు.
అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత పిన్న వయసులో అరంగేట్రం చేసిన ఆటగాళ్లు
14 ఏళ్లు 227 రోజులు - హసన్ రజా (పాకిస్తాన్) వర్సెస్ జింబాబ్వే, ఫైసలాబాద్, 1996
15 ఏళ్లు 99 రోజులు - వైభవ్ సూర్యవంశీ (ఇండియా) వర్సెస్ ఇంగ్లండ్, మాంచెస్టర్, 2026*
15 ఏళ్లు 116 రోజులు - మహ్మద్ షరీఫ్ (బంగ్లాదేశ్) వర్సెస్ జింబాబ్వే, హరారే, 2001
15 ఏళ్లు 124 రోజులు - ముస్తాక్ మహ్మద్ (పాకిస్తాన్) వర్సెస్ వెస్టిండీస్, లాహోర్, 1959
16 ఏళ్లు 127 రోజులు - ఆకిబ్ జావేద్ (పాకిస్తాన్) వర్సెస్ వెస్టిండీస్, అడిలైడ్, 1988
16 ఏళ్లు 205 రోజులు - సచిన్ టెండూల్కర్ (ఇండియా) వర్సెస్ పాకిస్తాన్, కరాచీ, 1989
అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత పిన్న వయసులో అరంగేట్రం చేసిన భారత ఆటగాళ్లు
వైభవ్ సూర్యవంశీ 15 సంవత్సరాల 99 రోజులు 2026
సచిన్ టెండూల్కర్ 16 సంవత్సరాల 205 రోజులు 1989
పియూష్ చావ్లా 17 సంవత్సరాల 75 రోజులు 2006
ఎల్ శివరామకృష్ణన్ 17 సంవత్సరాల 118 రోజులు 1983
పార్థివ్ పటేల్ 17 సంవత్సరాల 152 రోజులు 2002
మణిందర్ సింగ్ 17 సంవత్సరాల 193 రోజులు 1982
తిలక్ చేతుల మీదుగా..
ఈ మ్యాచ్ టాస్‌కు ముందు వైస్ కెప్టెన్ తిలక్ వర్మ చేతుల మీదుగా వైభవ్ సూర్యవంశీ అరంగేట్ర క్యాప్ అందుకున్నాడు. వైభవ్ అరంగేట్ర క్యాప్ అందుకోగానే సహచర ఆటగాళ్లంతా సంతోషంతో ఎగిరి గంతేసారు. సంజూ శాంసన్‌ను తప్పించి మరీ వైభవ్ సూర్యవంశీని ఆడించడం గమనార్హం. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది.
అభిషేక్ శర్మతో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించిన వైభవ్ సూర్యవంశీ.. జోఫ్రా ఆర్చర్ వేసిన తొలి బంతినే సిక్సర్‌గా తరలించాడు. జోష్ టంగ్ బౌలింగ్‌లో మరో సిక్సర్ బాదిన వైభవ్.. దూకుడుగా ఆడే క్రమంలో విల్ జాక్స్ బౌలింగ్‌లో స్టంప్ ఔట్‌గా వెనుదిరిగాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

