Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇదేం ఫ్యామిలీరా అయ్యా.. 10 ఏళ్లకే సెంచరీ బాదిన వైభవ్ సూర్యవంశీ తమ్ముడూ!

టీమిండియా టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ కుటుంబం నుంచి మరో డైనమైట్ బయటకు వచ్చాడు. వైభవ్ సూర్యవంశీ తమ్ముడు ఆశీర్వాద్ సూర్యవంశీ సెంచరీతో చెలరేగాడు. 10 ఏళ్ల వయసులోనే బిహార్‌లో జరిగిన లోకల్ ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఆశీర్వాద్ ఈ ఫీట్ సాధించాడు. తాజ్‌పూర్ క్రికెట్ అకాడమీ తరఫున 87 బంతుల్లో ఓ సిక్సర్, 20 ఫోర్లతో 103 రన్స్ చేశాడు. తన అన్నలా దూకుడుగా కాకుండా 118.39 స్ట్రైక్‌రేట్‌తో ఓపికగా బ్యాటింగ్ చేశాడు.

ఈ విషయాన్ని వైభవ్ అన్న ఉజ్వల్ సూర్యవంశీ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఆశీర్వాద్ కూడా త్వరలో ఐపీఎల్‌లో ఛాన్స్ కొట్టేస్తాడేమోనని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. ఫ్యామీలీ ఫ్యామీలీ ప్రతిభావంతులే ఉన్నట్లున్నారు కదా? అని ప్రశంసిస్తున్నారు. తమ్ముడి సెంచరీపై వైభవ్ సూర్యవంశీ కూడా సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. తమ్ముడి స్కోర్ కార్డ్‌ను ఇన్‌స్టాలో పంచుకున్న వైభవ్ సూర్యవంశీ.. కంగ్రాట్స్ ఆశీర్వాద్ అని క్యాప్షన్ ఇచ్చాడు. అయితే ఈ పోస్ట్‌లో తన చిన్ననాటి ఫొటోను జత చేయడం గమనార్హం.

Vaibhav Sooryavanshi 10-year-old younger brother Aashirwad slams century in Local Cricket Match

వైభవ్ సూర్యవంశీకి ఇద్దరు సోదరులు కాగా.. ఉజ్వల్ సూర్యవంశీ పెద్దవాడు. ఆశీర్వాద్ సూర్యవంశీ చిన్నోడు. పెద్దోడు క్రికెట్‌కు దూరంగా ఉన్నా.. చిన్నోడు తన అన్న జాడాలో నడుస్తున్నాడు. ప్రస్తుతం వైభవ్ సూర్యవంశీ శ్రీలంక పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. భారత్-ఏ తరఫున అఫ్గానిస్థాన్-ఏ, శ్రీలంక-ఏతో ముక్కోణపు సిరీస్ ఆడుతున్నాడు.

వైభవ్ సూర్యవంశీ.. వారికి దూరంగా ఉండు: శ్రీశాంత్ వార్నింగ్

వైభవ్ సూర్యవంశీ.. వారికి దూరంగా ఉండు: శ్రీశాంత్ వార్నింగ్

ఈ సిరీస్‌లో ఇప్పటికే రెండు మ్యాచ్‌లు ఆడిన వైభవ్ తొలి మ్యాచ్‌లో విఫలమైనా రెండో మ్యాచ్‌లో పర్వాలేదనిపించాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో వైభవ్ అద్వితీయమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. 16 మ్యాచ్‌ల్లో 776 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచి ఆరెంజ్ క్యాప్‌తో పాటు ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్‌ది సీజన్, మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్, సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్, అత్యధిక సిక్స్‌ల అవార్డులను కైవసం చేసుకున్నాడు.

ఈ ప్రదర్శనతో టీమిండియాకు ఎంపికయ్యాడు. అప్‌కమింగ్ ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలకు ఎంపిక చేసిన భారత టీ20 జట్టులో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కింది. జూన్ 26న ఐర్లాండ్‌తో జరిగే టీ20 మ్యాచ్‌తో వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేయనున్నాడు. ఇప్పటికే భారత జట్టుకు ఎంపికైన అత్యంత పిన్నవయస్కుడిగా సచిన్ రికార్డ్ బద్దలు కొట్టిన వైభవ్.. అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేస్తే ఈ ఘనత సాధించిన యంగెస్ట్ ప్లేయర్‌గా మరో రికార్డ్‌ను కైవసం చేసుకుంటాడు.

సచిన్, కోహ్లీ కంటే బుడ్డోడు తోపు: డేల్ స్టెయిన్

సచిన్, కోహ్లీ కంటే బుడ్డోడు తోపు: డేల్ స్టెయిన్
Story first published: Saturday, June 13, 2026, 9:20 [IST]
Other articles published on Jun 13, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+