For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

PAK vs USA: తిప్పేసిన ఉస్మాన్, షాదాబ్.. అమెరికాపై పాక్ ఘన విజయం

ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో పాకిస్థాన్ మరో విజయాన్ని నమోదు చేసింది. నెదర్లాండ్స్‌పై అతి కష్టంగా గెలుపొందిన పాకిస్థాన్.. రెండో మ్యాచ్‌లో సమష్టిగా ఆధిపత్యం చెలాయించింది. గ్రూప్-ఏలో భాగంగా కొలంబో వేదికగా అమెరికాతో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా చెలరేగిన పాకిస్థాన్ 32 పరుగుల తేడాతో గెలుపొందింది. బ్యాటింగ్‌లో షాహిబ్జాదా ఫర్హాన్.. బౌలింగ్‌లో ఉస్మాన్ తారిఖ్(3/27), షాదాబ్ ఖాన్(2/26) సత్తా చాటి పాక్ విజయంలో కీలక పాత్ర పోషించారు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 190 పరుగులు చేసింది. షాహిబ్జాదా ఫర్హాన్(41 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్‌లతో 73) హాఫ్ సెంచరీతో రాణించగా.. బాబర్ ఆజామ్(32 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 46), షాదాబ్ ఖాన్(12 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 30) విలువైన పరుగులు చేశారు. అమెరికా బౌలర్లలో వాన్ షాక్(4/25) నాలుగు వికెట్లు తీయగా.. సౌరభ్ నత్రావల్కర్, మహమ్మద్ మోహ్‌సిన్, హర్మీత్ సింగ్ తలో వికెట్ తీసారు.

అనంతరం అమెరికా 20 ఓవర్లలో 8 వికెట్లకు 158 పరుగులే చేసి ఓటమిపాలైంది. శుభమ్ రంజనే(29 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 51) హాఫ్ సెంచరీతో రాణించగా.. జహంగీర్(34 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 49) తృటిలో హాఫ్ సెంచరీ చేజార్చుకున్నాడు. మిలింద్ కుమార్(22 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్2తో 29) పర్వాలేదనిపించాడు. పాకిస్థాన్ బౌలర్లలో ఉస్మాన్ తారీఖ్(3/27) మూడు వికెట్లు తీయగా.. షాదాబ్ ఖాన్(2/26) రెండు వికెట్లు పడగొట్టాడు. అబ్రార్ అహ్మద్, మహమ్మద్ నవాజ్, షాహీన్ షా అఫ్రిది తలో వికెట్ తీసారు.

Usman Tariq Shadab Khan Star as Pakistan Beat USA by 32 runs in T20 World Cup 2026

పోరాడిన అమెరికా..

191 పరుగుల లక్ష్య ఛేదనలో అమెరికాకు మెరుగైన ఆరంభం లభించింది. ఓపెనర్ జహంగీర్ దూకుడుగా ఇన్నింగ్స్ ప్రారంభించాడు. మరో ఓపెనర్ ఆండ్రీస్ గౌస్(13) కూడా రెండు బౌండరీలు బాది మహమ్మద్ నవాజ్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. దాంతో పవర్ ప్లేలో అమెరికా వికెట్ నష్టానికి 50 పరుగులు చేసింది. కెప్టెన్ మోనాంక్ పటేల్(3) మరోసారి తీవ్రంగా నిరాశపర్చాడు. షాదాబ్ ఖాన్ బౌలింగ్‌లో రిటర్న్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. ఆ కాసేపటికే జహంగీర్.. షాదాబ్ ఖాన్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగి హాఫ్ సెంచరీ చేజార్చుకున్నాడు.

శుభమ్ హాఫ్ సెంచరీ..

ఈ పరిస్థితుల్లో మిలింద్ కుమార్(29), శుభమ్ రంజనే ఆచితూచి ఆడారు. నాలుగో వికెట్‌కు 54 పరుగులు జోడించిన అనంతరం మిలింద్ కుమార్‌ను ఉస్మాన్ తారీఖ్ పెవిలియన్ చేర్చాడు. ఆ మరుసటి ఓవర్‌లోనే సంజయ్ కృష్ణమూర్తి(0) డకౌట్‌ కాగా.. హర్మీత్ సింగ్‌తో కలిసి శుభమ్ రంజనే పోరాడాడు. ఛేదించాల్సిన రన్ రేట్ పెరగడంతో దూకుడుగా ఆడే ప్రయత్నంలో హర్మిత్ సింగ్(6) క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. ఆ మరుసటి బంతికే మహమ్మద్ మోహ్‌సిన్(0) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఓవైపు వికెట్లు పడినా మరోవైపు శుభమ్ 28 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. అంతర్జాతీయ టీ20ల్లో అతనికి ఇదే తొలి హాఫ్ సెంచరీ. ఆ మరుసటి బంతికే అతను ఎల్బీగా వెనుదిరిగాడు.

Story first published: Tuesday, February 10, 2026, 22:35 [IST]
Other articles published on Feb 10, 2026
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+