టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాపై ఆస్ట్రేలియా ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా ప్రశంసల జల్లు కురిపించాడు. తాను ఇప్పటి వరకు ఎదుర్కొన్న బౌలర్లలో బుమ్రానే అత్యంతమైన కఠినమైన పేసర్ అని కొనియాడాడు. అతన్ని తలుచుకుంటేనే భయంగా ఉందని చెప్పాడు. ఐదు టెస్ట్‌ల బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో బుమ్రా 9 ఇన్నింగ్స్‌లో 32 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచిన విషయం తెలిసిందే.
అయితే సిడ్నీ వేదికగా జరిగిన ఆఖరి టెస్ట్‌లో వెన్ను గాయంతో బుమ్రా మధ్యలోనే వైదొలిగాడు. రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్ కూడా చేయలేదు. దాంతో భారత్ నిర్దేశించిన 162 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ 4 వికెట్లు కోల్పోయి సునాయసంగా చేధించింది. బుమ్రా లేకపోవడంతో ఆసీస్ బ్యాటర్లు ఎలాంటి ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశారు. ఈ సిరీస్‌లో బుమ్రా బౌలింగ్‌లో తీవ్రంగా ఇబ్బందిని ఉస్మాన్ ఖవాజా అతని గైర్హాజరీలతో 41 పరుగులు చేశాడు.

బుమ్రా బౌలింగ్ చేయకపోవడం వల్లే తాము విజయం సాధించగలిగామని తాజాగా ఉస్మాన్ ఖవాజా వెల్లడించాడు. అతను బౌలింగ్ చేసి ఉండుంటే తమకు పీడకల మిగిల్చేవాడని పేర్కొన్నాడు.
'నేను ఈ సిరీస్‌లో ఒక్కసారి మినహా బుమ్రా బౌలింగ్‌లోనే ఔటయ్యాను. తరుచూ అతని బౌలింగ్‌లోనే ఔటవ్వడం సిగ్గుగా అనిపించింది. కీలకమైన ఐదో టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో బుమ్రా బౌలింగ్ చేయలేదు. అందుకు ఆ దేవుడికి ధన్యవాదాలు చెప్పుకున్నాం. ఒకవేల బుమ్రా బౌలింగ్ చేసి ఉంటే మాకు పీడకలను మిగిల్చేవాడు. సిడ్నీ పిచ్ మీద బుమ్రా బౌలింగ్‌ను ఎదుర్కోవడం అత్యంత ప్రమాదకరం. అతను మైదానంలో లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నాం. నేను ఇప్పటి వరకు ఎదుర్కొన్న బౌలర్లలో అతనే అత్యంత కఠినమైన పేసర్'అని ఉస్మాన్ ఖవాజా చెప్పుకొచ్చాడు.

ఈ సిరీస్‌లో బుమ్రా 9 ఇన్నింగ్స్‌ల్లో బౌలింగ్ చేయగా.. 9 సార్లు ఖావాజా అతని బంతులకే ఔటయ్యాడు. చివరి టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం బుమ్రా లేకపోవడంతో 41 పరుగులు చేసి సిరాజ్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ఆస్ట్రేలియా తరఫున నిలకడగా రాణించే ఖవాజా బుమ్రా కారణంగా.. ఈ సిరీస్‌లో 20.44 సగటుతో 184 పరుగులే చేశాడు.
"I was just getting Bumrah-ed."
— ABC SPORT (@abcsport) January 6, 2025
Usman Khawaja told ABC Sport Jasprit Bumrah is the toughest fast bowler he's ever faced and the Australians were relieved he couldn't play on the final day of the SCG Test. #AUSvIND
Hear Grandstand at Stumps: https://t.co/GGcpRr2E3L pic.twitter.com/YZZ70oRHBy