మైదానంలోనే లోదుస్తులు మార్చుకున్న బ్యాట్స్‌మన్ (వైరల్ వీడియో)

సిడ్నీ: ఆస్ట్రేలియా గడ్డపై జరుగుతున్న బిగ్‌బాష్ లీగ్‌లో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. మైదానంలోనే బ్యాట్స్‌మెన్ ప్యాంట్ విప్పి లోదుస్తులు మార్చుకోవడం చర్చనీయాంశమైంది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. సిడ్నీ థండర్, బ్రిస్బేన్ హీట్ మధ్య ఆదివారం నాకౌట్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో సిడ్నీ థండర్ ఓపెనర్, ఆస్ట్రేలియా క్రికెటర్ ఉస్మాన్ ఖవాజా మ్యాచ్ మధ్యలోనే ప్యాంట్ విప్పి లోదుస్తులను మార్చుకున్నాడు.
Have ... have you ever seen this before 😂
— 7Cricket (@7Cricket) January 31, 2021
Usman Khawaja had to change everything - on the field! 🙈#BBL10 pic.twitter.com/XOKsXkhLVS

అసలేం జరిగిందంటే..?
సిడ్నీ థండర్ ఇన్నింగ్స్ 9వ ఓవర్‌లో వికెట్ల మధ్య పరుగెత్తడానికి అసౌకర్యంగా ఫీలైన ఖవాజా.. అంపైర్ల అనుమతితో ఆటను నిలిపివేసి లోదుస్తులను మార్చుకున్నాడు. ఊహించని విధంగా మ్యాచ్‌కు బ్రేక్ రావడంతో స్టాండ్స్‌లో ఉన్న ప్రేక్షకులంతా అసలేం జరుగుతుందని ఆశ్చర్యానికి గురయ్యారు. కానీ ఖవాజా మైదానం మధ్యలో ఉండి ప్యాంట్ విప్పడంతో ఒక్కసారిగా అవాక్కయ్యారు. దీనికి సంబంధించిన వీడియోను 7క్రికెట్ ట్విటర్ హ్యాండిల్'క్రికెట్ చరిత్రలోనే కనివినీ ఎరగని ఘటన.. ఉస్మాన్ ఖవాజా మైదానంలోనే ప్రతీదీ మార్చుకున్నాడు'అనే క్యాప్షన్‌తో షేర్ చేసింది. ఈ విస్మయకర ఘటనపై అభిమానులు తమదైన శైలిలో కామెంట్ చేస్తున్నారు.

బ్రిస్బేన్ హీట్ గెలుపు..
ఇక ఈ మ్యాచ్‌లో బ్రిస్బేన్ హీట్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సిడ్నీ థండర్స్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లకు 158 పరుగులు చేసింది. సామ్ బిల్లింగ్స్(34), ఉస్మాన్ ఖవాజా(28) మినహా మిగతా బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. బ్రిస్బేన్ హీట్ బౌలర్లలో మార్క్, మిచెల్ స్వెప్సన్ రెండేసి వికెట్లు తీయగా.. బెన్, మార్నస్ లబుషేన్, మోర్నీ మోర్కెల్ తలో వికెట్ దక్కించుకున్నారు.

చెలరేగిన హీజ్లెట్, జిమ్మీ..
అనంతరం 159 పరగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బ్రిస్బేన్ హీట్ 19.1 ఓవర్లలో 3 వికెట్లకు 162 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. సామ్ హీజ్లెట్(49 బంతుల్లో 74 నాటౌట్), జిమ్మీ(24 బంతుల్లో 43 నాటౌట్) ధాటిగా ఆడగా.. మార్నస్ లబుషేన్(32)పర్వాలేదనిపించాడు. డానియల్ సామ్స్, బ్రెండన్ డొగెట్ తలో వికెట్ తీశారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications