Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

USA vs PAK: పాకిస్థాన్ జట్టులో విభేదాలు.. మహమ్మద్ అమీర్ X బాబర్ ఆజామ్! (వీడియో)

టీ20 ప్రపంచకప్ 2024 టోర్నీని మాజీ ఛాంపియన్ పాకిస్థాన్ ఓటమితో ప్రారంభించింది. పసికూన అమెరికా చేతిలో అనూహ్య రీతిలో ఓటమిపాలైంది. సూపర్ ఓవర్‌కు దారి తీసిన ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకుంది.

గురువారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 159 పరుగులు చేసింది. కెప్టెన్ బాబర్ అజామ్ ( 43 బంతుల్లో, 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 44), షాదాబ్ ఖాన్ ( 25 బంతుల్లో, 1 ఫోర్, 3 సిక్సర్లతో 40) రాణించగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు.

USA vs PAK Babar Azam pays price for ignoring Mohammad Amir s advice to bowl pacer

అమెరికా బౌలర్లలో కెంజిగె (3/30), సౌరభ్‌ నేత్రావల్కర్‌ (2/18) నిప్పులు చెరిగారు. అనంతరం అమెరికా నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి సరిగ్గా 159 పరుగులే చేసింది. దాంతో ఇరు జట్లు స్కోర్లు టై అయ్యాయి.

జోన్స్ జోరు..
యూఎస్‌ఏ కెప్టెన్ మొనాన్క్ పటేల్‌ (38 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్సర్‌తో 50), ఆరోన్‌ జోన్స్‌ (26 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 36 నాటౌట్‌), ఆంద్రీస్‌ గౌస్‌ (26 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్ 35) సత్తా చాటారు. మహమ్మద్ అమీర్, నసీమ్ షా, హారిస్ రౌఫ్ తలో వికెట్ తీసారు. సూపర్ ఓవర్‌లో అమెరికా 18 పరుగులు చేయగా.. పాకిస్థాన్ 13 పరుగులే చేసి ఓటమిపాలైంది.

అయితే ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టులోని విభేదాలు బయటపడ్డాయి. పాకిస్థాన్ ఆటగాళ్లు రెండు గ్రూప్‌లుగా విడిపోయినట్లు స్పష్టమైంది. ముఖ్యంగా మహమ్మద్ అమీర్, బాబర్ ఆజామ్ మధ్య సఖ్యత లేనట్లు స్పష్టంగా అర్థమైంది. మ్యాచ్ మధ్యలో అమీర్ ఇచ్చిన సలహాను బాబర్ ఆజామ్ పట్టించుకోలేదు.

అమీర్ సలహాను పట్టించుకోని బాబర్..
అమెరికా బ్యాటింగ్ సందర్భంగా 15వ ఓవర్‌లో నాలుగు పరుగులే ఇచ్చి వికెట్ తీసిన అమీర్.. పేసర్లతోనే బౌలింగ్ చేయించాలని బాబర్ ఆజామ్‌కు సూచించాడు. యూఎస్‌ఏ బ్యాటర్ జోన్స్ స్పిన్‌ను బాగా ఆడుతున్నాడని, పేసర్లు అయితే అతన్ని కట్టడి చేయగలరని చెప్పాడు. కానీ ఈ సలహాను పట్టించుకొని బాబర్ ఆజామ్ షాదాబ్ ఖాన్‌తో బౌలింగ్ చేయించాడు.

అతని బౌలింగ్‌లో అమెరికా బ్యాటర్లు 11 పరుగులు పిండుకున్నాడు. అమీర్ మాట విని పేసర్లతో బౌలింగ్ చేయించి ఉంటే జోన్స్ ఔటయ్యేవాడని, అప్పుడు పాక్ గెలిచేదని ఆ జట్టు ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. మహమ్మద్ అమీర్‌ సలహాకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. పాకిస్థాన్ ఆటగాళ్ల‌ మధ్య సఖ్యత లేదని ఆరోపిస్తున్నారు.

Story first published: Friday, June 7, 2024, 19:47 [IST]
Other articles published on Jun 7, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+