For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రిషభ్ పంత్‌ను వదలని ఊర్వశి రౌటేలా.. అతని బ్యాటింగ్‌ను గుర్తు చేస్తూ..!(వీడియో)

టీమిండియా స్టార్ వికెట్ కీపర్‌ రిషభ్ పంత్‌పై గతంలో సంచలన ఆరోపణలు చేసిన బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌటేలా మరోసారి అతనికి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తాజాగా సోషల్ మీడియా వేదికగా ఆమె షేర్ చేసిన వీడియోనే ఈ సందేహాలకు రుజువుగా మారింది.

రిషభ్ పంత్ బ్యాటింగ్‌కు సంబంధించిన ఓ వీడియో క్లిప్‌ను ఏఐ టెక్నాలజీ సాయంతో ఊర్వశీ రౌటేలా స్పూఫ్ చేసింది. టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా ఐర్లాండ్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో రిషభ్ పంత్ కొట్టిన విన్నింగ్ సిక్స్‌కు సంబంధించిన వీడియోను ఈ బాలీవుడ్ బ్యూటీ ఏఐ సాయంతో స్పూఫ్ చేసింది.

Urvashi Rautela uses AI feature showing her hitting Rishabh Pant s six in T20 World Cup 2024

ఈ మ్యాచ్‌లో ఐర్లాండ్ బౌలర్ బారీ మెక్‌కార్తీ వేసిన ఓవర్‌లో రిషభ్ పంత్ ర్యాంప్ షాట్‌తో సిక్స్ బాదాడు. 26 బంతుల్లో 36 పరుగులు చేసిన పంత్.. భారత విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు. దాంతో భారత్ 46 బంతులు మిగిలి ఉండగానే 8 వికెట్ల తేడాతో గెలిచింది.

పంత్ విన్నింగ్స్ సిక్స్ వీడియోను..తాను బ్యాటింగ్ చేసినట్లుగా ఊర్వశి స్పూఫ్ చేసింది. రిషభ్ పంత్ స్థానంలో తాను బ్యాటింగ్ చేసినట్లు ఏఐ సాయంతో మార్చింది. ఆరెంజ్ జెర్సీలో ఊర్వశీ బ్యాటింగ్ చేయడం విశేషం. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారగా.. ఫ్యాన్స్ ఫన్నీ కామెంట్ చేస్తున్నారు. పంత్‌కు దగ్గరయ్యేందుకు ఊర్వశీ ప్రయత్నిస్తుందని ఒకరంటే.. మళ్లీ అందరి దృష్టిని ఆకర్షించేందుకు అతన్ని టార్గెట్ చేస్తుందని మరికొందరు అంటున్నారు.

గతంలో రిషభ్ పంత్‌పై ఊర్వశి రౌటే బోల్డ్ కామెంట్ చేసింది. పంత్ తన సెక్స్ చేసేందుకు ఆసక్తి చూపించాడని, తన వెంటపడ్డాడని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. తన కంటే పెద్దవారితో సెక్స్ చేయడం రిషభ్ పంత్‌కు ఇష్టమని చెప్పుకొచ్చింది. ఈ వ్యాఖ్యలపై పంత్ ఖండించగా.. ఆమె ఘాటుగా బదులిచ్చింది. సోషల్ మీడియా వేదికగా ఈ ఇద్దరి మధ్య పెద్ద యుద్దమే నడిచింది. రిషభ్ పంత్‌ విఫలమైన ప్రతీసారి అతనిపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించింది.

రోడ్డు ప్రమాదంలో అతను తీవ్రంగా గాయపడిన తర్వాత మౌనంగా ఉండిపోయింది. ఊర్వశి రౌటేలా, రిషభ్ పంత్‌ల మధ్య సెక్స్ రిలేషన్ నడిచిందని, ఆమె కోరికలకు తగ్గట్లు బహుమతులు ఇచ్చుకోలేకనే పక్కనపెట్టేసాడని అప్పట్లో వార్తలు వచ్చాయి.

Story first published: Saturday, August 10, 2024, 19:50 [IST]
Other articles published on Aug 10, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+