Urvashi Rautela: ఛీ.. ఛీ.. నేను సారీ చెప్పింది ఆ పొట్టోడికి కాదు.. మాట మార్చిన బాలీవుడ్ బ్యూటీ!

న్యూఢిల్లీ: టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్‌కు క్షమాపణలు చెప్పిన బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌటేలా అంతలోనే మాట మార్చింది. తాను పంత్‌కు క్షమాపణలు చెప్పలేదని, తన ఫ్యాన్స్‌కు చెప్పానని పేర్కొంది. రిషభ్ పంత్ తనతో సెక్స్ చేయడానికి తెగ ఆరాటపడ్డాడని సంచలన ఆరోపణలు చేసిన ఊర్వశీ రౌటేటా.. ఆసియా కప్ ముందు సోషల్ మీడియా వేదికగా అతనితో వాగ్వాదానికి దిగింది. రిషభ్ పంత్ పేరును ప్రస్తావించకుండా తన కోసం హోటల్ గదిలో వేచి చూసాడని ఓ ఇంటర్వ్యూలో రౌటేలా చెప్పగా.. పాపులారిటీ కోసం ఇంత దిగుజారుతారా? అంటూ భారత వికెట్ కీపర్ కౌంటరిచ్చాడు. దాంతో రెచ్చిపోయిన ఊర్వశీ బ్యాట్ బాల్ ఆడుకోవాలని, నకరాలు చేస్తే ఇజ్జత్ తీస్తానని హెచ్చరించింది.

తనతో సెక్స్ చేయాలనుకున్నాడని..
'అరే ఓ చోటు భయ్యా.. బ్యాట్ బాల్ ఆడుకో. నేను చిన్నపిల్లను కాదు. నీలాంటి పిల్ల బచ్చాల వల్ల బద్నాం అవ్వడానికి. ఆర్‌పీ చోటు భయ్యా రక్షాబంధన్ శుభాకాంక్షలు. సైలెంట్‌గా ఉన్నానని అడ్వాంటేజ్ తీసుకోకు. నువ్వో కౌగర్ హంటర్(తన కంటే ఎక్కువ వయసున్న అమ్మాయితో శారీరక సంబంధం కోరుకునే పురుషుడు). నీ ఇజ్జత్ తీస్తా'అని ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. దీనికి ఆర్‌పీ చోటు భయ్యా, కౌగర్ హంటర్, డోంట్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ఏ సైలెంట్ గర్ల్ అనే హ్యాష్‌ట్యాగ్‌లను జత చేసింది. దీనికి పంత్ సైతం తనదైన శైలిలో కౌంటరిచ్చాడు. మన ఆధీనంలో లేని విషయాలను ఏ మాత్రం పట్టించుకోవద్దని బదులిచ్చాడు.

చేతులు జోడించి క్షమాపణలు..
ఇన్‌స్టాంట్ బాలీవుడ్ అనే చానెల్‌తో మాట్లాడుతూ.. 'మీరు పంత్‌కు ఏమైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారా..?' అని ప్రశ్నించగా.. ఊర్వశి స్పందిస్తూ.. 'నేను ఏం చెప్పాలనుకుంటున్నాననంటే.. అవును ఏం చెప్దామనుకున్నా. నాకే తెలియడం లేదు. అయితే ఒక్క విషయం సారీ.. ఐయామ్ సారీ..' అని చేతులు జోడించి క్షమాపణలు వేడుకుంటూ అక్కడ్నుంచి వెళ్లింది. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ కావడంతో ఇక ఊర్వశి-పంత్ మధ్య విభేదాలు సమసిపోయినట్టేనని అంతా భావించారు. కానీ ఈ బాలీవుడ్ బ్యూటీ మాట మార్చి మళ్లీ చిచ్చును రాజేసింది.

ఛీ.. ఛీ సారీ చెప్పింది అతనికి కాదు..
తాను సారీ చెప్పింది పంత్‌కు కాదని.. తన ఫ్యాన్స్ కోసం చెప్పానని తన ఇన్‌స్టా స్టోరీలో పేర్కొంది. 'ఈ రోజుల్లో కొన్ని అధికారిక న్యూస్ ఆర్టికల్స్, సో కాల్డ్ మీమ్ పేజీల అడ్మిన్లు సినిమాలు, టీవీ షో ల కంటే ఎక్కువ డ్రామాను రచిస్తున్నారు. నేను చెప్పిన సారీ నా ఫ్యాన్స్ కోసం.. నా ప్రియమైన వారికోసం.. అంతే, అంతకుమించి ఏమీ లేదు..'అని రాసుకొచ్చింది. అంతేగాక ఇదే స్టోరీలో #WhyTheNewIsNotTheTruth #falsemisleadinglight #greatscript #FactsAreNotCopyrightable హ్యాష్ ట్యాగ్ లను జతపరిచింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications