పిల్లాడు దడుసుకున్నాడు.. జర వదిలేయండి! నసీమ్ షా వ్యాఖ్యలకు ఊర్వశీ రౌటేలా కౌంటర్!

న్యూఢిల్లీ: బాలీవుడ్ నటి ఊర్వశి రౌటేలా మరోసారి వార్తల్లో నిలిచింది. ఆ మధ్య టీమిండియా వికెట్ రిషభ్ పంత్‌పై సంచలన ఆరోపణలు చేసిన ఊర్వశి.. ఇటీవల నసీమ్ షాను ఉద్దేశించి ఓ వీడియోను షేర్ చేయడం సంచలనం సృష్టించింది. ఆసియాకప్ 2022లో భాగంగా భారత్, పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్‌కు హాజరైన ఊర్వశి రౌటేలా.. మ్యాచ్ అనంతరం అతనికి సంబంధించిన వీడియోను షేర్ చేసింది. ఆ వీడియోలో నసీమ్ షా ఊర్వశి వైపు పదే పదే చూడగా ఆమె సిగ్గుపడుతుండటం కనిపించింది. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఈ ఇద్దరి మధ్య ఏదో నడుస్తుందని, యువ ప్లేయర్‌పై ఊర్వశి కన్నుపడిందని, అతనితో డేటింగ్ చేస్తుందనే వార్తలు షికారు చేశాయి.

నాకు ఆమె ఎవరో తెలియదు..
ఈ వ్యవహారంపై నసీమ్ షాను పాకిస్థాన్ మీడియా వివరణ కోరగా... అసలు ఊర్వశీ రౌటేలా ఎవరో కూడా తనకు తెలియదని బదులిచ్చాడు. 'ఊర్వశి ఎవరో నాకు తెలియదు. మీరు అడుగుతుంటే నాకు నవ్వు వస్తోంది. ఆమె ఎలాంటి వీడియోలను షేర్ చేస్తుందో నాకు తెలియదు. ఆమెతో డేటింగ్ చేయాలే ఉద్దేశం కూడా నాకు లేదు. నా ఫోకస్ అంతా క్రికెట్ పైనే ఉంది. వాస్తవానికి ఈ వ్యవహారం గురించి నాకు ఏ మాత్రం తెలియదు.'అని బదులిచ్చాడు.

ప్లీజ్.. వదిలేయండి..
ఇక తాను ఎవరో తెలియదంటూ నసీమ్ షా చేసిన వ్యాఖ్యలపై ఊర్వశీ రౌటేలా స్పందించింది. నసీమ్‌షాతో తనకు సంబంధం ఉందంటూ వస్తున్న వార్తలను ఆపేయాలని ఆమె సోషల్ మీడియా వేదికగా మీడియాను కోరింది. అది సరదా కోసం చేసిన పనని, నసీమ్ షాకు ఎలాంటి సంబంధం లేదని వివరణ ఇచ్చింది. 'మ్యాచ్‌కు హాజరైన నన్ను ఉద్దేశించి అభిమానులు ఎడిట్ చేసిన ఓ 11-12 వీడియోలను నా సోషల్ మీడియా టీమ్ వాడుకుంది. ఈ వీడియోలో ఉన్న ఇతర వ్యక్తులకు దీని గురించి ఏం తెలియదు. వారి గురించి తెలియకుండానే షేర్ చేసారు. దయచేసి ఎలాంటి వార్తలను సృష్టించవద్దని మీడియాను కోరుతున్నా'అని పేర్కొంది.

నాతో సెక్స్ చేయాలనుకున్నాడు.
.రిషభ్ పంత్ తనతో సెక్స్ చేయాలనుకున్నాడని ఊర్వశీ రౌటేలా సోషల్ మీడియా వేదికగా ఆరోపించింది. ఆసియాకప్ ముందు పంత్, రౌటేలా మధ్య సోషల్ మీడియా వేదికగా మాటల యుద్దమే నడిచింది. పంత్ పేరును ప్రస్తావించకుండా తన కోసం హోటల్ గదిలో వేచి చూసాడని ఓ ఇంటర్వ్యూలో రౌటేలా చెప్పగా.. పాపులారిటీ కోసం ఇంత దిగుజారుతారా? అంటూ భారత వికెట్ కీపర్ కౌంటరిచ్చాడు. దాంతో రెచ్చిపోయిన ఊర్వశీ బ్యాట్ బాల్ ఆడుకోవాలని, నకరాలు చేస్తే ఇజ్జత్ తీస్తానని హెచ్చరించింది.

బ్యాట్ బాల్ ఆడుకో..
'అరే ఓ చోటు భయ్యా.. బ్యాట్ బాల్ ఆడుకో. నేను చిన్నపిల్లను కాదు. నీలాంటి పిల్ల బచ్చా వల్ల బద్నాం అవ్వడానికి. ఆర్‌పీ చోటు భయ్యా రక్షబంధన్ శుభాకాంక్షలు. సైలెంట్‌గా ఉన్నానని అడ్వాంటేజ్ తీసుకోకు. నువ్వో కౌగర్ హంటర్(తన కంటే ఎక్కువ వయసున్న అమ్మాయితో శారీరక సంబంధం కోరుకునే పురుషుడు). నీ ఇజ్జత్ తీస్తా'అని ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. దీనికి ఆర్‌పీ చోటు భయ్యా, కౌగర్ హంటర్, డోంట్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ఏ సైలెంట్ గర్ల్ అనే హ్యాష్‌ట్యాగ్‌లను జత చేసింది. దీనికి పంత్ సైతం తనదైన శైలిలో కౌంటరిచ్చాడు. మన ఆధీనంలో లేని విషయాలను ఏ మాత్రం పట్టించుకోవద్దని బదులిచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications